తెలంగాణ టెట్ ఎడిట్ ఆప్షన్ 2024 చివరి తేదీ (TS TET Edit Option 2024 Last Date) :
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2025)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌ని పూరించడంలో ఏవైనా పొరపాట్లు, తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకోవచ్చు. దీనికోసం ఎడిట్ ఆప్షన్‌ను (TS TET Edit Option 2024 Last Date) అందుబాటులోకి తేవడం జరిగింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ లింక్‌పై క్లిక్ చేసి వెంటనే సవరించుకోవచ్చు. సంబంధిత లింక్‌ని ఇక్కడ అందించాం. దానిపై క్లిక్ చేసి నేరుగా తమ అప్లికేషన్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఎప్పటి వరకు ఉంటుందో ఇక్కడ తెలియజేసాం.
తెలంగాణ టెట్ దరకాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీ చివరి తేదీ. ఇప్పటి వరకు లక్షా 26 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో అందించిన వివరాల్లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే.. నవంబర్ 22వ తేదీ వరకు మార్చుకోవచ్చు. అభ్యర్థులు ఇప్పటికే అందించిన వివరాల్లో https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో సవరించవచ్చు.
గడువు ముగిసిన తర్వాత డేటా దిద్దుబాటు కోసం చేసిన అభ్యర్థనలు స్వీకరించబడవని డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఒకవేళ అప్లికేషన్‌ను సవరించుకునే క్రమంలో ఏమైనా సాంకేతిక సమస్యల కోసం అన్ని పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య 7032901383 లేదా 9000756178ని సంప్రదించండి.
ఏ విధంగా TS TET 2024 దరఖాస్తును సరించుకోవచ్చు? (How TS TET 2024 Application Can be Processed)
తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.- ముందుగ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి tstet2024.aptonline.in వెళ్లాలి.
- హోంపేజీలో లాగిన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ ఆధారాలను నమోదు చేసి క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్‌లో మీరు మార్చాలనుకునే వివరాలను సవరించాలి.
- అనంతరం మార్పులను సేవ్ చేసుకోవాలి.
- తర్వాత సవరించిన అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
- కాగా భ్యర్థులు తమ ఆధార్ నెంబర్, ఫోటోగ్రాఫ్, సంతకం మినహా అన్ని ఫీల్డ్‌లను సవరించవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పూర్తి వార్తలను https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ తెలుసుకోండి.