టీఎస్ టెట్ హాల్ టికెట్ 2024 (TS TET Hall Ticket 2024) :
తెలంగాణ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షను మే 20 నుంచి జూలై 03 2024 వరకు నిర్వహిస్తుంది. TS TET పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు మే 15న విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ టెట్ పరీక్షకు హాజరు కావడానికి దరఖాస్తుదారులు హాల్ టికెట్లను (TS TET Hall Ticket 2024) డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి. అర్హత పొందిన అభ్యర్థులు జీవితాంతం చెల్లుబాటు అయ్యే TS TET సర్టిఫికెట్ పొందుతారు.
పాఠశాల విద్యాశాఖ ద్వారా TS TET హాల్ టికెట్ PDF ఫార్మాట్‌లో విడుదలవుతుంది. దరఖాస్తుదారులు TS TET హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు కార్డులో ఉన్న పూర్తి సమాచారం జాగ్రత్తగా చూసుకోవాలి. TS TET హాల్ టికెట్ల 2024ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి. హాల్ టికెట్‌తోపాటు అభ్యర్థులు పాన్‌కార్డ్, ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి ID ప్రూఫ్, ఇటీవలి రెండు పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోలని తీసుకెళ్లాలి.
ప్రతి సంవత్సరం, తెలంగాణ ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE) పరీక్షకు 10, 12 రోజుల ముందు TS TET హాల్ టికెట్‌లని విడుదల చేస్తుంది. కానీ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లను ఐదు రోజుల ముందు 15 మే 2024న విడుదల చేస్తారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS TET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download TS TET Hall Ticket 2024)
అభ్యర్థులు తమ TS TET హాల్ టికెట్ 2024 హార్డ్ కాపీలను అందుకోరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని డైరెక్ట్ లింక్ నుంచి లేదా అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.- తెలంగాణా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in /ని సందర్శించాలి.
- హోంపేజీలో 'తాజా వార్తలు' విభాగానికి నావిగేట్ చేయండి.
- 'TS TET అడ్మిట్ కార్డ్ 2024' కోసం డౌన్‌లోడ్ లింక్ కోసం చూసుకోవాలి.
- యూజర్ ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను అవసరమైన విధంగా పూరించాలి.
- అభ్యర్థులు TS TET హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- హార్డ్ కాపీ రిఫరెన్స్ కోసం అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకోవాలి.
TS TET హాల్ టికెట్ 2024లో పేర్కొన్న వివరాలు (Details Mentioned on TS TET Admit Card 2024)
అభ్యర్థులు తమ TS TET హాల్ టికెట్లని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాలి. ఎందుకంటే ఇది ఐడెంటి ఫ్రూఫ్‌గా పనిచేస్తుంది. పరీక్షా కేంద్రానికి యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది. మీరు డౌన్‌లోడ్ పూర్తి చేసిన తర్వాత మీ హాల్ టికెట్‌లో సమాచారాన్ని ధ్రువీకరించండి. TS TET అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న వివరాలు దిగువున ఇవ్వబడ్డాయి. స్పెల్లింగ్‌లో ఏదైనా లోపం లేదా ఏదైనా ఇతర తప్పులు కనుగొనబడినట్లయితే, సంబంధిత అథారిటీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.- అభ్యర్థి పేరు
- రోల్ నెంబర్
- రిజిస్ట్రేషన్ సంఖ్య
- పరీక్ష తేదీ
- రిపోర్టింగ్ సమయం
- పరీక్ష ప్రారంభ, ముగింపు సమయం
- పరీక్షా కేంద్రం వేదిక
- కేంద్రం చిరునామా
- ఫోటో, సంతకం
- సబ్జెక్ట్ కోడ్