తెలంగాణ టెట్ ఓసీ క్వాలిఫైయింగ్ మార్కులు 2024 (TS TET OC Qualifying Marks 2024) :
తెలంగాణ టెట్ 2024 పరీక్ష పేపర్ 1 - పేపర్ -2 పద్ధతిలో నిర్వహించబడింది. పేపర్ 1, పేపర్ 2. TS TET పేపర్ 1 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునే అభ్యర్థుల కోసం, పేపర్- 2 ఆరో తరగతి నుంచి 8 తరగతులకు బోధించాలనుకునే అభ్యర్థుల కోసం నిర్వహించడం జరిగింది. అభ్యర్థులు 1 నుంచి 8 తరగతులకు బోధించడం రెండు పేపర్లకు (పేపర్ 1, పేపర్ 2) హాజరయ్యారు. తెలంగాణ టెట్ 2024 ఫలితాలు జూన్ 12, 2024 విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో ఓసీ అభ్యర్థులు తమ క్వాలిఫైయింగ్ మార్కులను 2024 తెలుసుకోవాలనుకుంటారు. వారి కోసం ఇక్కడ తెలంగాణ టెట్ ఓసీ క్వాలిఫైయింగ్ మార్కులను (TS TET OC Qualifying Marks 2024) అందిస్తున్నాం.
ఇది కూడా చదవండి : తె
లంగాణ టెట్ ఎస్సీ క్వాలిఫైయింగ్ మార్కులు 2024
తెలంగాణ టెట్ ఓసీ అర్హత మార్కులు 2024 (TS TET OC Qualifying Marks 2024)
తెలంగాణలోని పాఠశాల విద్యా శాఖ, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఉద్యోగ నియామకాలకు అవసరమైన TS TET పరీక్ష కోసం కనీస ఉత్తీర్ణత స్కోర్‌ను సెట్ చేస్తుంది. అభ్యర్థులు కటాఫ్ సాధించలేకపోయినా, కనీస ఉత్తీర్ణత మార్కులను సాధిస్తే వారు పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు పరిగణించబడుతుంది. అయితే వారు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను కొనసాగించకపోవచ్చు.తెలంగాణ టెట్ 2024 క్వాలిఫైయింగ్ మార్కులు (TS TET 2024 Qualifying Marks)
కేటగిరీల వారీగా తెలంగాణ టెట్ 2024 అర్హత మార్కులను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు చూడవచ్చు.కేటగిరీ | అర్హత మార్కులు |
---|---|
జనరల్/ఓసీ | 60 శాతం మార్కులు |
బీసీ | 50 శాతం మార్కులు |
SC/ST/Pwd | 40 శాతం అంతకంటే ఎక్కువ |
తెలంగాణ టెట్ 2024 కటాఫ్ మార్కులను చెక్ చేసేదెలా? (Steps to Check TS TET 2024 Cut Off)
తెలంగాణ టెట్ 2024 కటాఫ్ మార్కులను చెక్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించిన విధంగా చూసుకోవచ్చు.- స్టెప్ 1: తెలంగాణ టెట్ 2024 కటాఫ్ మార్కులను చెక్ చేసుకునేందుకు ముందుగా అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ tstet2024.aptonline.inని సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో అందించిన ఫలితం, కటాఫ్ మార్కుల డౌన్‌లోడ్ లింక్‌ని గుర్తించి క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో ప్రదర్శించబడిన కేటగిరీ వారీగా TS TET కటాఫ్ మార్కులను చూడొచ్చు.
- స్టెప్ 4: భవిష్యత్తు సూచన కోసం వాటిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ టెట్ ఫలితాల లింక్ 2024 |
---|
తెలంగాణ టెట్ ఓసీ అర్హత మార్కులు 2024 |
తెలంగాణ టెట్ ఎస్సీ అర్హత మార్కులు 2024 |