టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ఎగ్జామ్ తేదీలు (TSPSC AEE Exam News): TSPSC నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే రద్దు చేసిన ఏఈఈ రిక్రూట్ మెంట్ పరీక్షల తేదీలను (TSPSC AEE Exam News) వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా కొన్ని పరీక్షలను TSPSC రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు TSPSC ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో రద్దైన AEE పరీక్షా తేదీలని ప్రకటిస్తూ (TSPSC AEE Exam News) బుధవారం TSPSC ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా TSPSC AEE పరీక్ష గత జనవరి నెలలో 22 తేదీన నిర్వహించింది. అయితే పేపర్ల లీకేజీ కలకలంతో మళ్లీ పరీక్షను మళ్లీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త తేదీలను ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ఏఈఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
TSPSC ఏఈఈ ఎగ్జామ్ కొత్త తేదీలు (TSPSC AEE Exam New Dates)
TSPSC ప్రకటించిన విధంగా ఏఈఈ పరీక్షలను మే నెలలో నిర్వహించనుంది.దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా చేపట్టింది. ఏఈఈ ఎగ్జామ్‌కు సంబంధించిన కొత్త తేదీలని ఈ దిగువున టేబుల్లో అందజేశాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇక్కడ పరిశీలించవచ్చు.పరీక్ష వివరాలు | తేదీలు |
---|---|
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్సానిక్స్ ఇంజనీరింగ్ | మే 8, 2023 |
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | మే 9, 2023 |
సివిల్ ఇంజనీరింగ్ | మే 21, 2023 |
TSPSC జరగబోయే కొన్ని పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షని జూన్ 17వ తేదీన నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం జూన్ 17వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను చేయనున్నారు.
కాగా తెలంగాణలో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనం సృష్టంచింది. దీంతో అంతకు ముందు జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలు, జరగబోయే పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయేమో అనే అనుమానం కలగడంతో TSPS పలు పరీక్షలను క్యాన్సిల్ చేసింది. కొన్నింటిని వాయిదా వేసింది. ఇప్పటికే నిర్ణయించిన పరీక్షల తేదీలను కూడా మార్చే పనిలో పడింది. కాగా లీకేజీ వ్యవహారంపై సిట్ విచారణ సాగిస్తుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.