TSPSC గ్రూప్ 2 కటాఫ్ మార్కులు 2024 (TSPSC Group 2 Cut-off Marks 2024) :
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్ష ఫలితాలను ప్రకటించిన తర్వాత గ్రూప్ 2 కటాఫ్ మార్కులను
(
TSPSC Group 2 Cut-off Marks 2024) పబ్లిష్ చేస్తుంది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి మొత్తం పనితీరు, మొత్తం ఖాళీల సంఖ్య ఆధారంగా కటాఫ్ మార్కులు నిర్ణయించబడతాయి. అధికారిక కటాఫ్ మార్కులు, అర్హత స్కోర్‌లు TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి. ఈ కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులు వివిధ గ్రూప్ 2 పోస్టులకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. గ్రూప్ 2 కటాఫ్ ట్రెండ్‌లు ఔత్సాహికులకు చాలా అవసరం, ఎందుకంటే అవి సంభావ్య ఎంపిక అవకాశాలకు స్పష్టమైన సూచనను అందిస్తాయి.
TSPSC డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించింది. పేపర్-1 పరీక్షకు 2 లక్షల 57 వేలకుపైగా, పేపర్ -2 రెండు లక్షల 55 వేలకుపైగా, పేపర్ 3 పరీక్ష 2 లక్షల 51 వేలకుపైగా, పేపర్-4 రెండు లక్షల 51 వేల 486 మంది అభ్యర్థులు రాశారు. ఈ పరీక్ష పేపర్‌పై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో అభ్యర్థులు కటాఫ్ మార్కులపై ఆశలు పెట్టుకున్నారు. TSPSC గ్రూప్ 2 కటాఫ్ మార్కులను ఇక్కడ అంచనాగా అందించాం.
TGPSC గ్రూప్ 2 కటాఫ్ మార్కులు 2024 (TSPSC Group 2 Cut off Marks 2024)
TGPSC గ్రూప్ 2 కటాఫ్ మార్కులను 2024 (TSPSC Group 2 Cut-off Marks 2024) అంచనా ఈ దిగువున అంచనాగా అందించాం. కేటగిరీల వారీగా అందించాం. అయితే ఇది కేవలం అంచనాగా మాత్రమే అందించామని అభ్యర్థులు గమనించాలి.కేటగిరి | పురుషులు | మహిళలు |
---|---|---|
జనరల్ కేటగిరి | 400 | 390 |
బీసీ ఏ | 390 | 380 |
బీసీ బీ | 390 | 380 |
బీసీ సీ | 380 | 370 |
బీసీ ఈ | 380 | 370 |
బీసీ డీ | 395 | 385 |
ఎస్సీ | 380 | 365 |
ఎస్టీ | 375 | 355 |
ఈడబ్ల్యూఎస్ | 375 | 355 |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్., రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.