TGPSC గ్రూప్ 3 ఆన్సర్ కీ విడుదల 2024 (TSPSC Group 3 Answer Key 2024):
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ III సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) కోసం ఆన్సర్ కీని తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో పబ్లిష్ చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు లాగిన్ అవ్వడం ద్వారా ప్రిలిమినరీ ఆన్సర్ కీని యాక్సెస్ చేయవచ్చు. మూడు పేపర్‌లకు సంబంధించిన ఆన్సర్ కీ, మాస్టర్ ప్రశ్న పత్రాలతో పాటు, జనవరి 8వ తేదీ నుంచి జనవరి 12, 2025 వరకు సమీక్ష కోసం అందుబాటులో ఉంటుంది.
గ్రూప్ III సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష మూడు సెషన్‌లలో నిర్వహించబడింది. TGPSC గ్రూప్ 3 పేపర్-I, పేపర్-II నవంబర్ 17, 2024 (FN & AN), పేపర్-III నవంబర్ 18, 2024 (FN), తెలంగాణలో 33 జిల్లాల్లోని 1,401 పరీక్షా కేంద్రాల్లో జరిగింది.
TGPSC గ్రూప్ 3 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ లింక్ (TGPSC Group 3 Answer Key Link)
TGPSC గ్రూప్ 3 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
TGPSC గ్రూప్ 3 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (TSPSC Group 3 Answer Key: How to Download?)
TGPSC గ్రూప్ 3 ఆన్సర్ కీని ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించాలి.
- మీ ఆధారాలను (యూజర్ పేరు, పాస్‌వర్డ్) ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- 'TSPSC గ్రూప్ 3 ఆన్సర్ కీ 2024' కోసం లింక్‌ని కనుగొని క్లిక్ చేయాలి.
- సంబంధిత పేపర్‌ని ఎంచుకుని, ఆన్సర్ కీని వీక్షించాలి.
- మీ సూచన కోసం ఆన్సర్ కీని PDFగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అవసరమైతే జనవరి 12, 2025లోగా అభ్యంతరాలను సబ్మిట్ చేయాలి.