TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 డౌన్లోడ్ లింక్ (TSPSC Group 3 Hall Ticket 2024 Download Link) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 3 (గ్రూప్ III) కోసం హాల్ టికెట్‌ను నవంబర్ 10, 2024న రిలీజ్ చేసింది. TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 ఇప్పుడు అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ సంబంధిత హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వారి లాగిన్ వివరాలు అంటే TSPSC ID, పుట్టిన తేదీ అవసరం. హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఇక్కడ అందించాం.
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 డౌన్లోడ్ లింక్ (TSPSC Group 3 Hall Ticket 2024 Download Link)
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 డౌన్లోడ్ లింక్ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో యాక్టివేట్ అయింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడానికి అధికారిక లింక్‌ని ఇక్కడ అందించాం.TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024ని డౌన్లోడ్ చేయడం ఎలా? (How to Download TSPSC Group 3 Hall Ticket 2024?)
TSPSC హాల్ టికెట్ 2024ను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా దిగువ షేర్ చేసిన దశల వారీ విధానాన్ని అనుసరించండి.- ముందుగా అభ్యర్థులు వెబ్ బ్రౌజర్ https://www.tspsc.gov.in/లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీలో గ్రూప్ -III సేవల కోసం హాల్ టికెట్ డౌన్లోడ్ (29/2022)" అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
- దాంతో అభ్యర్థులు కొత్త లాగిన్ పేజీకి దారి రీడైరక్ట్ అవుతారు. ఇక్కడ అభ్యర్థులు లాగిన్ వివరాలను అంటే TSPSC ID, పుట్టిన తేదీలని నమోదు చేయాలి.
- లాగిన్ వివరాలను నమోదు చేసిన తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- తెలంగాణ TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు ప్రయోజనాల కోసం హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
TSPSC Group 3 హాల్ టికెట్‌పై ఉండే వివరాలు (Details Mentioned on TSPSC Group 3 Admit Card 2024)
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్‌పై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.- కండక్టింగ్ అథారిటీ పేరు
- పరీక్ష పేరు
- పోస్ట్ పేరు
- అభ్యర్థి పేరు
- తండ్రి లేదా తల్లి పేరు
- రిజిస్ట్రేషన్ నెంబర్/ రోల్ నెంబర్
- పరీక్ష తేదీ
- పరీక్ష కేంద్రం
- పరీక్ష సమయం
- రిపోర్టింగ్ సమయం
- అభ్యర్థి పుట్టిన తేదీ
- అభ్యర్థి ఫోటో
- అభ్యర్థి, పరీక్ష కౌన్సెలర్ సంతకం