టీఎస్పీఎస్సీ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ (TSPSC Horticulture Officer Exam Date):
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డైరక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ పరిధిలోని హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టుల నియామక పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు TSPSC ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన పరీక్షను జూన్ 17వ తేదీకి (TSPSC Horticulture Officer Exam Date) రీ షెడ్యూల్ చేయడం జరిగింది. జూన్ 17వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని TSPSC ప్రకటనలో పేర్కొంది. ఈ దిగువున లింక్‌పై క్లిక్ చేసి TSPSC ప్రకటనను చూడొచ్చు.
TSPSC పరీక్షా వాయిదా ప్రకటన డైరక్ట్ లింక్ |
---|
TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా వివరాలు (TSPSC Horticulture Officer Exam Details)
మొత్తం 22 మంచి హార్టికల్చర్ ఆఫీసర్‌ల నియామకం కోసం టీఎస్‌పీఎస్‌సీ గత ఏడాది డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసంది. ఈ ఏడాది జనవరి 02వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో నిర్వహించబడుతుంది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువ టేబుల్లో చూడొచ్చు.నిర్వహణ సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
---|---|
పోస్ట్ పేరు | హార్టికల్చర్ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 22 |
ఎగ్జామ్ డేట్ | జూన్ 17, 2023 |
సెలక్షన్ ప్రాసెస్ | రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ |
జాబ్ లోకేషన్ | తెలంగాణ |
అధికారిక వెబ్‌సైట్ | tspsc.gov.in |
TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check the TSPSC Horticulture Officer Exam Date 2023)
TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీని అభ్యర్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. దానికోసం అనుసరించాల్సిన స్టెప్స్‌ని ఈ దిగువున అందజేశాం.
- అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ని సందర్శించాలి.
- TSPSC వెబ్‌సైట్ హోంపేజీ కనిపిస్తుంది.
- వెబ్‌సైట్ కుడి వైపున ఉన్న "అన్ని రిక్రూట్‌మెంట్‌ల కోసం నోటిఫికేషన్" విభాగానికి వెళ్లాలి.
- ప్రదర్శించబడే డ్యాష్‌బోర్డ్‌లో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023 లింక్‌ను గుర్తించాలి.
- TSPSC HO పరీక్ష తేదీ 2023ని వీక్షించడానికి దానిపై క్లిక్ చేయాలి.
- TS HO పరీక్ష తేదీ 2023 హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి