టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak Latest Update):
ప్రశ్నాపత్రాల లీకేజ్ (TSPSC Paper Leak Latest Update) కారణంగా రద్దు చేసిన అన్ని TSPSC రిక్రూట్‌మెంట్ పరీక్షలను నాలుగు నెలల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పరీక్షలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కమిషన్ అధికారులను కోరినట్టు తెలుస్తుంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో (TSPSC Paper Leak Latest Update) విద్యార్థులు,నిరుద్యోగ యువత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొత్త ప్రశ్న పత్రాలను సిద్ధం చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని టీఎస్‌పీఎస్సీ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్టు సమాచారం. క్వశ్చన్ పేపర్లు లీక్ (TSPSC Paper Leak) కావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-II, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్షలను TSPSC రద్దు చేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలో మే, జూన్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ముగిసిన తర్వాత TSPSC పరీక్షలను నిర్వహించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని, లేకుంటే పరీక్షా కేంద్రాల లభ్యత, పోలీసులు, పరీక్షా సిబ్బందిని నియమించడం సమస్యగా మారుతుందని సమాచారం.
కాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో కేసులో మూడో రోజు కూడా నలుగురు నిందితులను పోలీసులు ప్రశ్నించారు. నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను పోలీసులు సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏఈ ప్రశ్నాపత్ర లీకేజీ నిందితులైన డాక్యా అండ్ టీమ్, ఎంతమందికి పేపర్ అమ్మారనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ నెల ఐదో తేదీన జరిగిన ఏఈ పరీక్షతోపాటు టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్స్ పేపర్లు, ఎంఐవీ, గ్రౌండ్ వాటర్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఈ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ముఖ్యంగా అభ్యర్థులు ఈ విషయంపై చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రతిపక్షాలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. దాంతో ప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేసింది. పేపర్ లీకేజీకు సంబంధించిన నిందితులను వెంటనే పట్టుకుంటామని ప్రకటించింది. ప్రభుత్వ సూచనలతో సిట్ రంగంలోకి దిగి పేపర్ లీకేజ్‌కు కారకులైన నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిని విచారించడంతో ఎన్నో సంచనలనమైన విషయాలు బయటకొచ్చాయి.