టీఎస్‌ఆర్జేసీ సెట్ మోడల్ పేపర్లు 2024 (TSRJC CET Model Question Paper 2024) : తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSRJC CET 2024) ఏప్రిల్ 21వ తేదీన జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 11వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. దీనికోసం విద్యార్థులు TSRJC CET 2024లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. TSREIS లేదా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ TSRJC CET 2024ని నిర్వహిస్తోంది. TSRJC CET 2024 కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న మొదలై మార్చి 16వ తేదీన ముగిసింది. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 21వ తేదీన జరిగే పరీక్ష కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా టీఎస్‌ఆర్జేసీ సెట్ 2024 మోడల్ ప్రశ్నపత్రాలను ఈ దిగువున అందిస్తున్నాం.
TSRJC CET పరీక్ష విధానం 2024 (TSRJC CET Exam Pattern 2024)
TSRJC CET 2024 పరీక్ష విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందించాం. ఈ పట్టిక ద్వారా విద్యార్థులకు పరీక్షా సరళిపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది.గ్రూప్ పేరు | సబ్జెక్ట్ పేరు | మార్కులు |
---|---|---|
ఎంపీసీ | ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ | 150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు) |
బీపీసీ | ఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ | 150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు) |
సీఈసీ/ఎంఈసీ | ఇంగ్లీష్, సొషల్ స్టడీస్, మ్యాథ్స్ | 150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు) |
ఈఈటీ | ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ | 150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు) |
సీజీడీటీ | ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ | 150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు) |
TSRJC CET 2024 మోడల్ ప్రశ్నపత్రాలు (TSRJC CET 2024 Model Question Papers)
TSRJC CET 2024 మోడల్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులకు పరీక్ష విధానంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నాపత్రం ఫార్మాట్ చాలా సంవత్సరాలు ఒకే విధంగా ఉంటుంది. విద్యార్థులు ఈ దిగువున మోడల్ ప్రశ్నపత్రాలను అందిస్తున్నాం.TSRJC CET ఫిజికల్ సైన్స్ PDF మోడల్ ప్రశ్నాపత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
---|---|
TSRJC CET బయోసైన్స్ PDF మోడల్ ప్రశ్నాపత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
TSRJC CET సొషల్ స్టడీస్ PDF మోడల్ ప్రశ్నాపత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
TSRJC CET మ్యాథ్స్ PDF మోడల్ ప్రశ్నాపత్రం | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.