UGC NET 2024 పరీక్ష తేదీ (UGC NET June Exam Date 2024): 2024-25 విద్యా సంవత్సరానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన పరీక్షల క్యాలెండర్ ప్రకారం UGC NET 2024 పరీక్ష (UGC NET June Exam Date 2024) జూన్ 10 నుంచి 21, 2024 మధ్య నిర్వహించబడుతుంది. NTA UGC NET పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తుంది. ఇక్కడ పేర్కొన్న తేదీలు సెషన్ 1 లేదా జూన్ సైకిల్ కోసం మాత్రమే. పరీక్ష కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష ఆన్‌లైన్‌లో ముగిసిన తర్వాత మూడో వారాల్లోగా ఫలితాలు ప్రకటించబడతాయి. పరీక్ష తేదీకి సంబంధించిన ఏదైనా అప్‌డేట్ నిర్ణీత సమయంలో www.nta.ac.inలో షేర్ చేయబడుతుంది. అప్పటి వరకు దరఖాస్తుదారులు పరీక్ష రోజు ముందు బాగా ప్రిపేర్ కావడానికి పరీక్ష కోసం స్టడీ ప్లాన్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ న్యూస్ | UGC NET ఫలితం డిసెంబర్ 2023 విడుదల, ఇదే లింక్
UGC NET 2024 పరీక్ష తేదీ (UGC NET 2024 Exam Date)
ఈ దిగువున ఇచ్చిన పట్టికలో UGC NET 2024 పరీక్ష తేదీని తెలుసుకోవచ్చు.
ఈవెంట్ | తేదీ |
---|---|
UGC NET జూన్ 2024 పరీక్ష ప్రారంభ తేదీ | జూన్ 10, 2024 |
UGC NET జూన్ 2024 పరీక్ష చివరి తేదీ | జూన్ 21, 2024 |
UGC NET జూన్ 2024 పరీక్ష వివరాలు (UGC NET June 2024 Exam Details)
UGC NET 2024కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి:
UGC NET 2024 సెషన్ 1 పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, షిఫ్ట్ 2 మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుంది.
ఆన్‌లైన్‌లో ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష జాతీయ స్థాయిలో ఉంటుంది.
పేపర్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం ఉంటుంది.
అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి. పేపర్ 1, 100 మార్కులకు, పేపర్ 2, 200 మార్కులకు ఉంటుంది.
పేపర్ 1లో 50 బహుళైచ్ఛిక ప్రశ్నలు, పేపర్ 2లో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు.
ప్రశ్నపత్రంలో అన్ని ప్రశ్నలకు రెండు మార్కులు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు కేటాయించబడతాయి. తప్పు లేదా సమాధానం లేని ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.