UGC NET Result December 2023: మళ్లీ యూజీసీ నెట్ ఫలితాలు విడుదల వాయిదా, ఇదే కారణం

Andaluri Veni

Updated On: January 18, 2024 12:50 pm IST

UGC NET ఫలితాలు (UGC NET Result December 2023) విడుదల సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని  NTAకి నోటీసు ద్వారా తెలియజేసింది. 
UGC NET Result December 2023: మళ్లీ యూజీసీ నెట్ ఫలితాలు విడుదల వాయిదా, ఇదే కారణంUGC NET Result December 2023: మళ్లీ యూజీసీ నెట్ ఫలితాలు విడుదల వాయిదా, ఇదే కారణం

UGC NET ఫలితం 2023 డిసెంబర్ (UGC NET Result December 2023): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC NET ఫలితాలు 2023 జనవరి 17, 2024న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఫలితాలు (UGC NET Result December 2023) విడుదల కాలేదు. ఈ రెండో సారి వాయిదాకు సంబంధించి NTA ఒక ప్రకటన చేసింది. ఈ నోటీసులో  "సాంకేతిక కారణాల వల్ల UGC-NET డిసెంబర్ 2023 ఫలితాలు 17.01.2024న  ప్రకటించబడ లేదు. వెబ్‌సైట్‌లో https:/ /ugcnet.nta.ac.in నిర్ణీత సమయంలో ప్రకటించబడతాయి ." అని పేర్కొవడం జరిగింది.  కాగా మొదటి జనవరి 10 తేదీ నుంచి ఫలితాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.  మునుపటిలాగా NTA కొత్త తేదీని తెలియజేయ లేదు.

యూజీసీ నెట్ 2023 పరీక్షకు మొత్తం 9,45,918 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగింది. పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పదవికి అర్హులవుతారు. ఫలితాలతోపాటు స్కోర్‌కార్డ్ , ఫైనల్ ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంటాయి. అయితే జనవరి 17న ఈ ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ విడుదల కాలేదు. దీంతో యూజీసీ నెట్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని NTAని ట్విట్టర్ ద్వారా  అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో NTA ఒక నోటీసును ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల ఫలితాలు వెల్లడి ఆలస్యమైందని తెలియజేసింది. ఈ తరుణంలో అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తుండాలి.

UGC NET ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడానికి సులభమైన దశలను చెక్ చేయండి (Check easy steps to download UGC NET Result 2023)

యూజీసీ నెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఈ విధానాన్ని ఫాలో అవ్వండి.
  • ముందుగా అభ్యర్థులు UGC అధికారిక వెబ్‌సైట్‌కి ugcnet.nta.nic.in వెళ్లండి.
  • హోంపేజీలో ఫ్లాషింగ్ అవుతున్న 'UGC NET ఫలితం 2023'పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్‌పై కొత్త విండో కనిపిస్తుంది.
  • మీ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, 'Submit' బటన్‌పై క్లిక్ చేయండి
  • UGC NET ఫలితం 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది
  • భవిష్యత్తు సూచన కోసం UGC NET ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. తాజా అప్‌డేట్‌లను చెక్ చేస్తుండండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ugc-net-result-december-2023-postponed-again-48987/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!