AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు (AP EDCET 2024 Application Form Correction ) : AP EDCET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అధికారులు కరెక్షన్ విండో ను ఓపెన్ చేస్తారు. AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్, sche.ap.gov.in/edcet, ఇక్కడ మీరు ఫారమ్ కరెక్షన్ విండోను యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థి పేరు, సంతకం, పుట్టిన తేదీ మరియు ఇతర వివరాలు మార్చడానికి అవకాశం ఉండదు. కేటగిరీ 2 కిందకు వచ్చే డీటెయిల్స్ మాత్రమే అభ్యర్థులు సవరించగలరు. AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో క్లోజ్ చేసిన తర్వాత విద్యార్థులు వారి వివరాలను సవరించడానికి అవకాశం ఉండదు.
ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, AP EDCET 2024 అప్లికేషన్ కరెక్షన్ తేదీలను ప్రకటిస్తుంది. విద్యార్థులు sche.ap.gov.in వెబ్సైటు నుండి వారి వివరాలను మార్పు చేసుకోవచ్చు. వెబ్సైటు లో లాగిన్ చేసి, వారి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్, చెల్లింపు సూచన ID, డేట్ ఆఫ్ బర్త్ మరియు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా, అభ్యర్థులు తమ AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్‌లో మార్పులు చేయవచ్చు.
AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో :
sche.ap.gov.in/edcet
సంబంధిత కథనాలు
AP EDCET కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు | AP EDCET ప్రిపరేషన్ టిప్స్ |
---|
AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ తేదీలు (AP EDCET 2024 Application Form Correction Dates)
అభ్యర్థులు దిగువ పేర్కొన్న తేదీలలో మాత్రమే AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో మార్పులు చేయగలరు
ఈవెంట్ | తేదీ |
---|---|
AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో ప్రారంభం తేదీ | తెలియాల్సి ఉంది |
AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ని సవరించడం/ సరిదిద్దడం ఎలా? (How to Edit/ Correct AP EDCET 2024 Application Form?)
AP EDCET 2024 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ ప్రక్రియ కేటగిరీ 1& 2 వంటి రెండు వర్గాలుగా వర్గీకరించబడింది. ఈ రెండు వర్గాల క్రింద AP EDCET 2024 అప్లికేషన్ ఫారమ్‌ను సవరించే విధానం మారుతూ ఉంటుంది మరియు దానికి సంబంధించిన వివరణాత్మక ప్రక్రియ క్రింద వివరించబడింది.
కేటగిరీ 1 AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ని సరిచేయడానికి/ సవరించడానికి సూచనలు (Instructions to Correct/ Edit AP EDCET Application Form under Category 1)
కేటగిరీ 1 AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో మార్పుల కోసం అభ్యర్థించవచ్చు, అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లతో పాటు పరీక్ష అథారిటీకి ఇ-మెయిల్ ఐడిని పంపడం ద్వారా మాత్రమే. AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో కరెక్షన్ చేయడం వీలు అవుతుంది.
కరెక్షన్ | పంపవలసిన పత్రం (స్కాన్ చేసిన కాపీ) |
---|---|
స్ట్రీమ్ మార్పు (B.Ed కోర్సు కోసం) | BA/ B.Sc/ B.Com/ B.Tech/ ఏదైనా UG డిగ్రీ హాల్ టికెట్ నంబర్ (చివరి సంవత్సరం/ సెమిస్టర్) |
అభ్యర్థి పేరు | క్లాస్ 10 (SSC) మార్క్ షీట్ |
తండ్రి పేరు | క్లాస్ 10 (SSC) మార్క్ షీట్ |
డేట్ ఆఫ్ బర్త్ (DOB) | క్లాస్ 10 (SSC) మార్క్ షీట్ |
అభ్యర్థి సంతకం | సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ (నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్‌తో సంతకం చేయాలి) |
ఛాయాచిత్రం | పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన కాపీ |
UG పరీక్ష హాల్ టికెట్ సంఖ్య | UG హాల్ టికెట్ నంబర్ యొక్క స్కాన్ చేసిన కాపీ (చివరి సంవత్సరం/సెమిస్టర్) |
కేటగిరీ 2 AP EDCET అప్లికేషన్ ఫార్మ్ ని సరిచేయడానికి/ సవరించడానికి సూచనలు (Instructions to Correct/ Edit AP EDCET Application Form under Category 2)
కేటగిరీ 2 AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా మార్పులు చేసుకోవచ్చు. ప్రాంతీయ కేంద్రం, పరీక్ష కేంద్రాలు లేదా కన్వీనర్ వద్ద, ఈ మార్పులు ఆమోదించబడవు.కాబట్టి విద్యార్థులు సరైన డీటెయిల్స్ ని నమోదు చేయడం మంచిది,ఈ వివరాలతోనే విద్యార్థుల హాల్ టికెట్ రూపొందించబడుతుంది. AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కేటగిరీ 2లో కింది మార్పులు అనుమతించబడతాయి.
పరీక్ష రకం | ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ (వర్తిస్తే) |
---|---|
స్థానిక ప్రాంత స్థితి | అభ్యర్థి మైనారిటీ స్థితి |
UG పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం | తల్లిదండ్రుల వార్షిక ఆదాయం |
చదువుకునే ప్రదేశం (ఇంటర్మీడియట్/డిగ్రీ) | క్లాస్ 10 హాల్ టికెట్ నంబర్ |
తల్లి పేరు | ఎడ్యుకేషనల్ అర్హత |
పుట్టిన ప్రదేశం (రాష్ట్రం/ జిల్లా) | ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ మరియు ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం |
అభ్యర్థి లింగం | కమ్యూనికేషన్ చిరునామా |
రిజర్వేషన్ వర్గం/ కులం/ సంఘం | ఇ-మెయిల్ ID/ మొబైల్ నంబర్ |
ఆధార్ కార్డ్ డీటెయిల్స్ (సంఖ్య/ నమోదు ID) | - |
AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో విద్యార్థులు కేవలం కొన్ని మార్పులను మాత్రమే సరిచేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు వారి AP EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేసే సందర్భంలోనే జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది.
లేటెస్ట్ AP EDCET పరీక్షా వార్తల కోసం, CollegeDekho ను చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి