4 నెలల్లో నీట్ 2024కి (NEET 2024 Preparation) ఎలా ప్రిపేర్ అవ్వాలి? - స్టడీ ప్లాన్, టాపర్స్ నుంచి టిప్స్ ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: October 03, 2023 03:17 PM

నీట్ యూజీ 2023 ప్రవేశ పరీక్ష దగ్గరలోనే ఉంది. ఇంత తక్కువ సమయంలో ఎలా ప్రీపేర్  (NEET 2024 Preparation) అవ్వాలని అభ్యర్థులు అనుకుంటుంటారు. కేవలం 4 నెలల్లోనే నీట్ 2023కి రెడీ అయ్యేందుకు ఇక్కడ ఒక స్టడీ ప్లాన్‌ని,  నిపుణుల టిప్స్‌ను ఇక్కడ అందజేశాం. 

విషయసూచిక
  1. నీట్ 2024 ఓవర్ వ్యూ  (NEET 2024 Overview)
  2. నీట్ ఎగ్జామినేషన్ 2024 ముఖ్యమైన తేదీలు  (Date of the 2024 NEET …
  3. ఇంటర్మీడియట్‌లోనే ప్రిపరేషన్ ప్లాన్ (NEET 2024 Preparation Strategy in Inter)
  4. సగటు విద్యార్థి NEET 2024ని క్రాక్ చేయగలరా? (Can an Average Student …
  5. నీట్ 2024  అర్హత ప్రమాణాలు  (Eligibility Requirements of NEET 2024)
  6. 4 నెలల్లో నీట్ 2023కు ప్రిపేర్ అవ్వడానికి టిప్స్ (Tips to Prepare …
  7. NEET 2024 ప్రిపరేషన్‌లో నివారించాల్సిన తప్పులు (Mistakes to Avoid in NEET …
  8. 4 నెలల్లో NEET 2023 ప్రిపరేషన్‌కు టైమ్ టేబుల్ (Time Table to …
  9. అభ్యర్థులు అనుసరించాల్సిన టైం టేబుల్ ఈ దిగువున అందజేశాం.  అభ్యర్థులు తమ సౌకర్యార్థం …
  10. NEET-UG 2023లోని సబ్జెక్టులు
  11.  ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ
  12. ఫిజిక్స్‌లో మొత్తం ఛాప్టర్లు
  13. 19
  14. బయాలజీలో మొత్తం ఛాప్టర్లు
  15. 09
  16. కెమిస్ట్రీలో మొత్తం ఛాప్టర్లు
  17. 31
  18. మొత్తం ఛాప్టర్లు
  19. 59
  20. ప్రిపరేషన్‌కి మిగిలి ఉన్న సమయం
  21. నాలుగు నెలలు (120 రోజులు)
  22. ప్రతి ఛాప్టర్ పూర్తి చేయడానికి పట్టే సమయం
  23. 1.5 రోజులు
  24. రోజుకు అవసరమయ్యే స్టడీ అవర్స్
  25. 6-6.5 గంటలు
  26. అన్ని ఛాప్టర్లు పూర్తి చేయడానికి పట్టే రోజులు
  27. 88 రోజులు
  28. మిగిలిన రోజులు 
  29. 32 రోజులు
  30. ప్రతి సబ్జెక్ట్ రివిజన్ కోసం పట్టే సమయం
  31. 7 రోజులు + 7 రోజులు + 7 రోజులు= 21 రోజులు
  32. మిగిలిన రోజులు 
  33. 11 రోజులు
  34. మాక్ టెస్ట్‌ల ప్రాక్టీస్ 
  35. 7 రోజులు
  36. మిగిలిన రోజులు 
  37. 4 రోజులు 
  38. ఈ ప్లానింగ్ సాధ్యమేనా..? 
  39. అవును సాధ్యమే. కష్టపడి చదివే అభ్యర్థుల కోసం ఈ ప్లానింగ్
4 నెలల్లో నీట్ 2024కి (NEET 2024 Preparation) ఎలా ప్రిపేర్ అవ్వాలి? - స్టడీ ప్లాన్, టాపర్స్ నుంచి టిప్స్ ఇక్కడ తెలుసుకోండి

నీట్ 2024 ప్రిపరేషన్ (NEET 2024 Preparation): వైద్య రంగంలో అడుగుపెట్టి డాక్టర్‌గా స్థిరపడాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా  నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)ని ఎదుర్కోవాల్సిందే. ఈ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన వారికి మాత్రమే మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందగలరు. అటువంటి నీట్ పరీక్ష  2024కి సిద్ధం కావడం ఒక ముఖ్యమైన మైలురాయి. దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలల్లో ఒకదానిలో కావలసిన స్థానాన్ని పొందడానికి  అభ్యర్థులు నిర్మాణాత్మకమైన అధ్యయన ప్రణాళిక, సమర్థవంతమైన వ్యూహాలను కలిగి ఉండాలి. నీట్ 2024లో రాణించడం కోసం అభ్యర్థులు  NEET కోసం ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలో? స్టడీ ప్లాన్, సబ్జెక్ట్ వారీగా టిప్స్‌ని ఇక్కడ చూడండి. అదేవిధంగా నిపుణులు సిఫార్సు చేసిన పుస్తకాలు, NEET 2024 పరీక్షను ఛేదించడానికి ఉత్తమ ఆన్‌లైన్ కోచింగ్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

నేషనల్ ఎలిజిబిలిటీ క్యుములేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అనేది భారతదేశంలో MBBS, BDS ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోరుకునే వ్యక్తుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)చే నిర్వహించబడే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. నీట్ పరీక్ష సంవత్సరానికి ఒకసారి ఆఫ్‌లైన్ ఫార్మాట్‌లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష మూడు గంటల ఇరవై నిమిషాల పాటు జరుగుతుంది. ఈ NEET 2024 పరీక్ష 13 భాషలలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు MBBS/BDS/BAMS/BSMS/BUMS/BHMS వంటి కోర్సుల్లో సీటు సాధించే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల్లోని అగ్ర విద్యా సంస్థల్లో సీట్లు పొంది, నాణ్యమైన విద్యను పొందే ఛాన్స్ ఉంటుంది.

నీట్ 2024 ఓవర్ వ్యూ  (NEET 2024 Overview)

ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌ల కోసం NEET (నేషనల్ ఎలిజిబిలిటీ,  ఎంట్రన్స్ టెస్ట్)ని నిర్వహిస్తుంది.  NEET 2024  పరీక్ష మే నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. NEET 2024కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో తెలుసుకోవచ్చు.
పరీక్ష కండక్టింగ్ బాడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులు
NEET 2024 ఎగ్జామ్ డేట్ మే మొదటి వారం, 2024
ప్రశ్నల సంఖ్య 200 ప్రశ్నలు
పరీక్ష పేరు NEET UG 2024
ఎగ్జామ్ మోడ్ పెన్, పేపర్ మోడ్
అధికారిక వెబ్2సైట్ www.neet.nta.nic.in


నీట్ ఎగ్జామినేషన్ 2024 ముఖ్యమైన తేదీలు  (Date of the 2024 NEET Examination)

NEET 2024 నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను మార్చి, ఏప్రిల్ నెలలో  విడుదల చేసే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది. NEET దరఖాస్తు ఫార్మ్, దిద్దుబాటు విండో, అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీ వంటి కీలకమైన ఈవెంట్‌లతో సహా NEET 2024 కోసం NTA సమగ్ర షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది.

NEET 2024 ఈవెంట్స్ ముఖ్యమైన తేదీలు
NEET 2024 రిజిస్ట్రేషన్ మొదలయ్యే తేదీ తెలియాల్సి ఉంది
NEET 2024 రిజిస్ట్రేషన్ చివరి తేదీ తెలియాల్సి ఉంది
NEET అడ్మిట్ కార్డు 2024 తెలియాల్సి ఉంది
NEET పరీక్ష తేదీ  2024 తెలియాల్సి ఉంది
NEET ఆన్సర్ కీ 2024 తెలియాల్సి ఉంది
NEET 2024 ఫైనల్ ఆన్సర్ కీని తెలియాల్సి ఉంది
NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024 తెలియాల్సి ఉంది
NEET యూజీ కౌన్సెలింగ్ డేట్ 2024 తెలియాల్సి ఉంది

ఇంటర్మీడియట్‌లోనే ప్రిపరేషన్ ప్లాన్ (NEET 2024 Preparation Strategy in Inter)

నిజానికి ఇంటర్మీడియట్‌లో నీట్ ప్రిపరేషన్‌ను మొదలుపెట్టడం చాలా మంచిది. నీట్‌లో ఎలాగైన మంచి స్కోర్ సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది చాలా అవసరం. ఎందుకంటే నీట్ ప్రిపరేషన్ అనేది మీరు 11వ తరగతిలో  అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో నీట్ కోసం ఎలా చదివారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు 11వ తరగతిలోని అన్ని అంశాలు, అధ్యాయాలను కవర్ చేసినట్లయితే, మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అంశాలను చదవడం ప్రారంభించవచ్చు. అభ్యర్థులు తమ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ని వృథా చేసినట్లయితే, NEET 11వ తరగతి సిలబస్‌లోని మిస్ అయిన, బలహీనమైన, ముఖ్యమైన అధ్యాయాలతో NEET 2024 ప్రిపరేషన్‌ని ప్రారంభించాల్సి ఉంటుంది.

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అంటే ఆ ఒక సంవత్సరంలో నీట్‌ను ఛేదించడానికి మీ ప్రాధాన్యత తప్పనిసరిగా సమయ నిర్వహణ‌కు ఇవ్వాలి. అభ్యర్థులు తమ బ్యాక్‌లాగ్‌లను సకాలంలో క్లియర్ చేయడానికి మొదటి నుంచి  వారంలోని సమయాన్ని 12వ తరగతిలో 70% (అంటే కోచింగ్ కాకుండా) , 11వ తరగతిలో 30 శాతంగా విభజించుకోవాలి. మీ బ్యాక్‌లాగ్‌లను కవర్ చేయడానికి మీరు తరగతిలో మీ ప్రస్తుత అంశాలలో వెనుకబడి ఉండరని నిర్ధారించుకోండి.

సగటు విద్యార్థి NEET 2024ని క్రాక్ చేయగలరా? (Can an Average Student Crack NEET 2024?)

సరైన ప్లానింగ్, కష్టపడే తత్వం ఉంటే నీట్ 2024లో కచ్చితంగా మంచి ర్యాంకు పొందవచ్చు.  ఒక సగటు విద్యార్థి  స్థిరత్వంతో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే NEET 2024ను ఛేదించవచ్చు. నీట్‌లో మంచి ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించిన సగటు విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మీరు నిర్ణయించుకుంటే, కష్టపడి (తెలివిగా) పని చేస్తే NEETని ఛేదించడం అసాధ్యమేమి కాదు.  NEET 2024 కోసం మీకు అవసరమైన సమస్య పరిష్కార నైపుణ్యాలను స్థిరమైన అభ్యాసం ద్వారా చాలా సులభంగా అభివృద్ధి చేయవచ్చు. సరైన మార్గదర్శకత్వం, ప్రిపరేషన్‌తో, మీరు NEETని క్లియర్ చేయవచ్చు.


నీట్ 2024  అర్హత ప్రమాణాలు  (Eligibility Requirements of NEET 2024)


నీట్ 2024 దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా తగు అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. ఆ అర్హతలను ఈ దిగువున అందించడం జరిగింది.

  • NEET 2024 పరీక్షకు హాజరుకావడానికి అభ్యర్థులకు డిసెంబర్ 31, 2024 నాటికి కనీసం 17 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ జాతీయుడు, ప్రవాస భారతీయుడు (NRI), విదేశీ భారతీయుడు (OCI), భారతీయ సంతతికి చెందిన వ్యక్తి (PIO) లేదా విదేశీ జాతీయుడు అయి ఉండాలి.
  • ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షను పూర్తి చేసిన లేదా పూర్తి చేసే విద్యార్థులు NEET 2024 కోసం నమోదు చేసుకోవడానికి అర్హులు.
  • NTA NEET 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషులో కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులలో కనీసం 50 శాతం పొందాలి. SC, ST, OBC-NCL వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు అవసరమైన కనీస మార్కు 40 శాతం


4 నెలల్లో నీట్ 2023కు ప్రిపేర్ అవ్వడానికి టిప్స్ (Tips to Prepare for NEET 2023 in 4 Months)

కేవలం 4 నెలల్లో NEET 2023 కోసం సిద్ధం కావడానికి టిప్స్ మీ కోసం ఇక్కడ కొన్ని టిప్స్ అందజేశాం.

టైమ్ టేబుల్‌ని రెడీ చేసుకుని అనుసరించండి: ప్రతి గంటను కచ్చితంగా లెక్కించుకోవడం ద్వారా నాలుగు నెలల్లో NEET 2023 కోసం ప్రిపేర్ అవ్వడం సాధ్యం అవుతుంది. దీనికోసం అభ్యర్థులు కచ్చితంగా టైమ్ టేబుల్ వేసుకోవాలి.  టైం టేబుల్‌ వల్ల చదవాల్సిన టాపిక్స్‌ను కచ్చితంగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.

సిలబస్ ఫాలో అవ్వండి: NEET 2023 అధికారిక సిలబస్‌కు కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. ప్రిపరేషన్ సమయం చాలా తక్కువ ఉన్నందున  సమయాన్ని వృథా చేయకుండా సిలబస్‌‌లో ఉన్న టాపిక్స్‌పై దృష్టి పెట్టాలి. ఉదయాన్నే, పగలు లేదా రాత్రి సమయం వంటి వివిధ సమయాల్లో అధ్యయనం చేయడం ద్వారా నీట్ 2024 పరీక్షను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

న్యూమారికల్స్‌పై వర్క్ చేయాలి: సిలబస్‌లోని సైద్ధాంతిక భాగాన్ని రోజుకు ఒక ఛాప్టర్ చొప్పున పూర్తి చేయవచ్చు. కానీ న్యూమారికల్ విభాగానికి సంబంధించి చాలా స్టడీ అవసరం.  కాబట్టి వీలైనంత ఎక్కువ కెమిస్ట్రీ, ఫిజిక్స్ న్యూమారికల్ విభాగాలపై దృష్టి సారించాలి.

రివిజన్ చేసుకోవాలి: సిలబస్ రివిజన్ చేసుకోవడం చాలా ముఖ్యం. చదివే ప్రతి అంశాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ముఖ్యమైన అంశాలను మరిచిపోకుండా ఉంటారు.

మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి: NEET 2023 మాక్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థుల ప్రిపరేషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. సిలబస్‌పై అభ్యర్థులకు ఎంత పట్టు వచ్చిందో మాక్ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ టాపిక్‌లో బలహీనంగా ఉన్నారో..? ఏ అంశాల్లో బలంగా ఉన్నారో..? తెలుస్తుంది.

సరైన విశ్రాంతి తీసుకోవాలి: ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులకు సరైన విశ్రాంతి కూడా అవసరం. ప్రిపరేషన్‌తో పాటు అభ్యర్థులు ఆటలు, పాటల్లో పాల్గోవాలి. అభ్యర్థులు  సరైన నిద్ర కూడా అవసరం.

ఆత్మ విశ్వాసంతో ఉండాలి: ప్రిపరేషన్ కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో అభ్యర్థులకు మోటీవేషన్ అవసరం. ఆత్మ విశ్వాసంతో ఉండాలి.

NEET 2024 ప్రిపరేషన్‌లో నివారించాల్సిన తప్పులు (Mistakes to Avoid in NEET 2024 preparation)

నీట్ 2024 ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు ఏం చేయాలో? ఏం పాటించాలో?  అనేదే కాదు. ఏమేమి తప్పులు చేయకూడదో కూడా చాలా అవసరం.  ఆ తప్పులను ఎలా దూరం చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

  • బయోలజీ NCERT నిర్లక్ష్యం చేయడం: అభ్యర్థులు తమ కోచింగ్ స్టడీ మెటీరియల్‌పై దృష్టి పెట్టాలనుకున్నప్పటికీ, NCERT సిలబస్‌ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాటిని చదవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
  • సకాలంలో సందేహాలను నివృత్తి చేసుకోకపోవడం: అభ్యర్థులు తమ సందేహాలను వీలైనంత త్వరగా నివృత్తి చేసుకోవాలి. అభ్యర్థులు తమ సందేహాలను ఉపాధ్యాయులను  అడగడానికి సంకోచించకూడదు. తమ సందేహాలను త్వరగా క్లియర్ చేయకపోతే, అది వాయిదా వేయడానికి దారితీస్తుంది.
  • పరీక్షల్లో తక్కువ స్కోర్లు రావడంతో చాలా నిరాశ చెందడం: ప్రాథమిక పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో నిరాశ అభ్యర్థులు నిరాశ చెందకూడదు. నీట్ ప్రిపరేషన్‌లో ప్రతి పరీక్షతో అభ్యర్థులు మెరుగుపడతారు. అభ్యాస పరీక్షలు అవగాహన, అభ్యాసాన్ని విశ్లేషించడానికి మాత్రమే. తప్పుల నుంచి నేర్చుకోవడానికి ఇది ఒక మార్గం.
  • అనవసరమైన కార్యకలాపాలతో పరధ్యానంగా ఉండడం: అభ్యర్థులు తమ విలువైన సమయాన్ని తీసుకునే పరధాన్యాన్ని నివారించాలి. NEET ప్రిపరేషన్‌పై అంకితభావంతో వ్యవహరించాలి. NEET 2024 ప్రిపరేషన్‌పైన మాత్రమే దృష్టి సారించాలి. మిగిలిన విషయాలను ఏ మాత్రం పట్టించుకోకూడదు.
  • అప్రధానమైనవి భావించి కొన్ని టాపిక్స్‌ని వదిలివేయడం: NEET కోసం మీరు అప్రధానంగా భావించే ఏ అంశం లేదా అధ్యాయాన్ని వదిలివేయవద్దు. నీట్‌లోని ప్రశ్నలు ఏ అంశం నుంచి అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

4 నెలల్లో NEET 2023 ప్రిపరేషన్‌కు టైమ్ టేబుల్ (Time Table to Prepare for NEET 2023 in 4 Months)

అభ్యర్థులు అనుసరించాల్సిన టైం టేబుల్ ఈ దిగువున అందజేశాం.  అభ్యర్థులు తమ సౌకర్యార్థం తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. దిగువున తెలియజేసిన టైమ్ టేబుల్ ఎలాంటి అధ్యయన అలవాట్లు ఉన్న వ్యక్తులకైనా ఈ టైమ్ టేబుల్ సెట్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేసుకుని అభ్యర్థులు తమ స్టడీని  ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు.

NEET-UG 2023లోని సబ్జెక్టులు

ఫిజిక్స్

కెమిస్ట్రీ

బయాలజీ


ఫిజిక్స్‌లో మొత్తం ఛాప్టర్లు

19


బయాలజీలో మొత్తం ఛాప్టర్లు

09


కెమిస్ట్రీలో మొత్తం ఛాప్టర్లు

31


మొత్తం ఛాప్టర్లు

59


ప్రిపరేషన్‌కి మిగిలి ఉన్న సమయం

నాలుగు నెలలు (120 రోజులు)


ప్రతి ఛాప్టర్ పూర్తి చేయడానికి పట్టే సమయం

1.5 రోజులు


రోజుకు అవసరమయ్యే స్టడీ అవర్స్

6-6.5 గంటలు


అన్ని ఛాప్టర్లు పూర్తి చేయడానికి పట్టే రోజులు

88 రోజులు


మిగిలిన రోజులు

32 రోజులు


ప్రతి సబ్జెక్ట్ రివిజన్ కోసం పట్టే సమయం

7 రోజులు + 7 రోజులు + 7 రోజులు= 21 రోజులు


మిగిలిన రోజులు

11 రోజులు


మాక్ టెస్ట్‌ల ప్రాక్టీస్

7 రోజులు


మిగిలిన రోజులు

4 రోజులు


ఈ ప్లానింగ్ సాధ్యమేనా..?

అవును సాధ్యమే. కష్టపడి చదివే అభ్యర్థుల కోసం ఈ ప్లానింగ్

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/how-to-prepare-to-neet-in-4-months/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Medical Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top