విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)

Guttikonda Sai

Updated On: August 12, 2024 02:39 PM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడే స్పీచ్ ను CollegeDekho ఈ ఆర్టికల్ లో అందించింది. 
Independence Day Speech in Telugu

500 పదాల్లో స్వాతంత్య్ర దినోత్సవం గురించి స్పీచ్ (500 Words Independence Day Speech in Telugu)

స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి? ఇలా ఉంటె మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అని ఎవరో అడిగారు. దానికి సమాధానం ఇస్తూ ఆయన ఇలా అన్నారు అంట “ మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవం ఇస్తారు ఏమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇస్తారు అని అన్నారు “ ఇలా భారదేశంలో ఉన్న రాజుల మంచి తనాన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటీషు వారు వ్యాపారం కోసం అంటూ దేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుని దేశాన్ని 200 సంవత్సరాల పాటు మనల్ని పాలించారు. బ్రిటీషు వారి పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు, ప్రశ్నించిన వారిని నడి రోడ్డు మీదే రక్తం వచ్చేలా శిక్షించే వారు. దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు. ఎదురుతిరిగితే భారాతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా ? దేశం ముఖ్యమా? అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యం అంటూ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మొదలు పెట్టిన మహానుభావుల వలనే మనకి ఈరోజు స్వాతంత్య్రం వచ్చింది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు.

హింసతో స్వాతంత్య్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఉద్యమం ప్రారంభించారు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటీషు వారిని ఎదురించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లబాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రు ఇలా ఎంతోమంది పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. మనం గుర్తించని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇప్పటికి చాలామంది వారి దేహాన్ని, ఈ దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్పూర్తితో మన దేశాన్ని మన స్వతంత్ర భరత మాతను  (Independence Day Speech in Telugu) అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం.

నిజానికి మనదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కేవలం రాజకీయ నాయకులూ మాత్రమే కాదు , నిరంతరం కాపాడడానికి చాలామంది సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలకు తెగించి మనదేశానికి కీలకమైన సమాచారం అందిస్తున్నారు. వీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టే మనం ఇలా ఏ అభద్రతా భావం లేకుండా ధైర్యంగా ఉన్నాం.  అభివృద్ధి అంటే కేవలం సంపన్న దేశంగా ఎదగడమే కాదు, దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉండడం కూడా. సంపన్న దేశమైన అమెరికాలో గన్ కల్చర్ ఎలా పెరిగిపోయిందో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం, కానీ వాటిని ఆపడానికి ఆ దేశం తీసుకుంటున్న చర్యలు సూన్యం. కానీ భారతదేశంలో హింసను ప్రోత్సహించే వారు హింసకు పాల్పడేవారు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. అతి పెద్ద జనాభా కలిగిన మన భారత దేశంలో సామాన్యుడికి ఉండే స్వేచ్ఛ స్వాతంత్య్రం ప్రపంచంలో మరెక్కడా లేదు అనే చెప్పాలి. కానీ ఈ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించుకునే వారు కూడా లేకపోలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు మాత్రమే, కానీ ఇప్పుడు వంద కోట్లకు పై మాటే కాబట్టి అప్పుడు ఉన్న చట్టాలతో ఇప్పుడు పరిపాలించడం కూడా పాలకులకు కత్తి మీద సామే అనడంలో సందేహం లేదు. మరి అప్పటి లాగా మనల్ని ముందు ఉండి నడిపించడానికి గాంధీ, నెహ్రు, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి వీరెవరూ లేరు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన ప్రతీ ఒక్కరిలోనూ వారు ఉండే ఉంటారు. ఏ పని చేసినా దేశం కోసం చేస్తున్నాం అనుకుంటే చాలు. మన నిజాయితీనే మన దేశాన్ని ముందుకి నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

జైహింద్…

400 పదాల్లో స్వాతంత్య్ర దినోత్సవం గురించి స్పీచ్ (400 Words Independence Day Speech in Telugu)

ఇవాళ, రేపు మనకి ఆకలేస్తే జొమాటో లో ఆర్డర్ పెడితే గంటలో వచ్చేస్తుంది, అదే ఒక 10 సంవత్సరాల క్రితం అయితే మనం వండుకుంటే వండుకునే వాళ్ళం లేకపోతె హోటల్ కి వెళ్లి పార్సెల్ తెచ్చుకునే వాళ్ళము. మరి 1947 కు ముందు ? ఆరు నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం నోటి వరకు కూడా కాదు ఇంటి గడప దగ్గరకు కూడా చేరేది కాదు. దానికి కారణం బ్రిటీషు వారి పాలన. ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒకటిగా ఉండాల్సిన భారతదేశ సంపదను విచ్చలవిడిగా దోచుకుని భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీశారు. మన దేశంలోనే మనల్ని బానిసలుగా చేసుకుని అరాచకం సాగించారు. బాల గంగాధర తిలక్ మొదటిసారిగా "స్వరాజ్య" వాదాన్ని వినిపించిన జాతీయవాది.

తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యావ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేక పోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి "స్వరాజ్యమే" సహజమైన, ఏకైక మార్గమని నమ్మాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు" అనే అతను నినాదం భారతీయులందరికి స్ఫూర్తిదాయకమైంది. బ్రిటీషు వారిని మనదేశం నుండి తరిమి కొట్టడానికి భారతదేశానికి స్వాతంత్య్రం (Independence Day Speech in Telugu) సాధించడానికి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్  ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతోమంది సమరయోధులు వారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. బ్రిటీషు వారిని ఎదిరించినందుకు ఎంతోమంది జైళ్లలో మగ్గిపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఉప్పు సత్యగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి కార్యక్రమాలతో బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేఛ్చ , స్వాతంత్య్రం ఆ సమరయోధుల త్యాగ ఫలితమే. మనకి కనీసం పేరు కూడా తెలియని స్వాంతంత్య్ర సమరయోధులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. కుటుంబం కంటే దేశమే ముఖ్యం అని దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్య్రం తెచ్చారు.

ఇవి కూడా చదవండి

క్రిస్మస్ వ్యాసం తెలుగులో నూతన సంవత్సర వ్యాసం తెలుగులో
ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత బాలల దినోత్సవం ప్రాముఖ్యత
భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి భారతీయ జెండాలోని ఈ విషయాలు తెలుసా?

బ్రిటీషు వారు మన దేశం నుండి ఎంతో సంపదను దోచుకుని వెళ్లినా కూడా మన నాయకులు ఇచ్చిన స్పూర్తితో మనదేశం ఎదుగుతూ ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం కొన్ని జాడ్యాలను విడిచిపెట్టలేదు అని ఒప్పుకుని తీరాలి. అభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన మనం ఇంకా కులం, మతం , జాతి అని కొట్టుకుంటూ ఉన్నాం. ఎంత అభివృద్ధి జరిగితే అంత అవినీతి కూడా కనిపిస్తూనే ఉంది. దేశం మారాలి అంటే మనలో మార్పు రావాలి, ప్రతీ ఒక్కరిలోనూ. మన పని త్వరగా అవ్వాలి అని లంచం ఇచ్చే వ్యక్తులే రేపు ఏ పని చెయ్యడానికి అయినా లంచం తీసుకునే అందుకు వెనకాడరు. ఇలా మనం ప్రతీరోజూ చూస్తున్న చిన్న చిన్న వి అనుకుంటున్న తప్పులే మన దేశాన్ని ఇంకా ఇంకా వెనక్కి నెడుతున్నాయి. ఒక దేశం అభివృద్ధిలో పాలకులు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యం.

స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో వచ్చిన స్వాతంత్య్రాన్ని సరిగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. బ్రిటీషు వారు మనదేశాన్ని దోచుకుంటున్నారు అని వారిని తరిమికొట్టి మనదేశాన్ని మనమే దోచుకుని తింటుంటే ఎలా ఉంటుంది? ప్రతీ సంవత్సరం భారతదేశంలో చదువుకుని ఉద్యోగాలకు విదేశాలు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మరి వారి అందరికి మనదేశంలో ఉద్యోగాలు ఎందుకు కల్పించలేక పోతున్నాము? అభివృద్ధిలో దూసుకు పోతున్న దేశాలతో మనం ఎంతవరకు పోటీ పడుతున్నాం అని కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే మన చదువు కోసం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి దేశానికి మనం ఏం చేయగలుగుతున్నాం అని కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మనం ఎగరేసే జాతీయ జెండా ఎగిరేది గాలితో కాదు మనదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎంతో మంది అమరవీరుల శ్వాసతో అని మనం గుర్తు పెట్టుకోవాలి.

మనం తినే ఒక్కో మెతుకు ఎంతో మంది త్యాగ ఫలితం అని గుర్తు ఉంచుకోవాలి. ఆగస్టు 15కి , జనవరి 26కి వారిని గుర్తు చేసుకోవడం కాదు మనం చేయాల్సిన పని. మన దేశాన్ని అభివృద్ధ్ది చేస్తూ ప్రపంచ దేశాల్లో మున్ముందుకు తీసుకుని వెళ్లడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళిగా భావించాలి. ఈ ఒక్కరోజే కాకుండా వారి పోరాట స్ఫూర్తి నిరంతరం మన గుండెల్లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ

జైహింద్…

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/independence-day-speech-in-telugu/

Related Questions

Can I do GNM at Metas Adventist College after taking commerce in Class 12th?

-Mahima kumariUpdated on January 08, 2025 03:03 PM
  • 2 Answers
harshit, Student / Alumni

Hi there, LPU offers over 150 programs in various disciplines. You can choose the program according to your interest and needless to say you need to fulfil the eligibility as well. For more info visit website or contact LPU officials through chat email and phone. Good Luck

READ MORE...

M.A admission date

-samshuddeenUpdated on January 08, 2025 03:06 PM
  • 2 Answers
harshit, Student / Alumni

Hi there, admission at LPU has begun for the next academic session. LPU offers several post graduate programs. Visit website or contact LPU officials. Good Luck

READ MORE...

Without entrance can we take admission?

-ruchikaUpdated on January 08, 2025 03:05 PM
  • 2 Answers
harshit, Student / Alumni

Hi there, LPU offers several programs for which entrance is not nmandatory but I would suggest that you do take the entrance test as it may get you a scholarship as well. For more info visit website or contact LPU officials. THe admisison for the next session has begun. Good LUck

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top