జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్ (JEE Mains 2024 Physics Preparation Tips):
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE MAIN) ను ప్రతీ సంవత్సరం రెండు సేషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు భారతదేశంలో ఉన్న అత్యుత్తమ కళాశాలలు మరియు యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందవచ్చు. జేఈఈ మెయిన్ 2024 పరీక్షలలో ప్రధానంగా ఉండే మూడు సబ్జెక్టుల్లో ఫిజిక్స్ ముఖ్యమైనది. జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు కోసం ప్రిపేర్ విద్యార్థులు ఈ ఆర్టికల్ లో నిపుణులు అందించిన కొన్ని ముఖ్యమైన సలహాలు మరియు సూచనలు ఈ ఆర్టికల్ లో వివరంగా పొందవచ్చు.
JEE Mains 2024 మొదటి సెషన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరి 2024 నెలల్లో జరగనున్నది.
JEE Mains పరీక్ష భారతదేశంలోనే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలలో కాబట్టి విద్యార్థులు వీలైనంత ముందుగా ఈ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించాలి.
ఇది కూడా చదవండి:
NTA పరీక్షా క్యాలెండర్ 2024 వచ్చేసింది, JEE మెయిన్ పరీక్షలు ఎప్పుడంటే?
ఇది కూడా చదవండి:
JEE మెయిన్ సెషన్ 1 పరీక్షా తేదీల పూర్తి షెడ్యూల్ ఇదే
జేఈఈ మెయిన్ 2024 పరీక్షా విధానం (JEE Mains 2024 Exam Pattern)
జేఈఈ మెయిన్ 2024 పరీక్షను NTA నిర్వహిస్తుంది, జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మాథెమాటిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. జేఈఈ మెయిన్ పేపర్ 1 భారతదేశం లోని ఇంజనీరింగ్ కళాశాలలో BE మరియు B.Tech అడ్మిషన్ కోసం నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ పేపర్ 1 లో ఉన్న మూడు సబ్జెక్టులకు 300 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో సబ్జెక్టు కు 100 మార్కుల చొప్పున ఇవ్వబడతాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉండగా ఒక్కో సబ్జెక్టుకు 25 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఫిజిక్స్ సబ్జెక్టు కు 25 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాల్సి ఉంటుంది. ఈ 25 ప్రశ్నలలో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మరియు 5 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్ (Preparation Tips for Physics in JEE Mains 2024)
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అయితే వారు ఫిజిక్స్ సబ్జెక్టు లో మంచి స్కోరు సాధించాలి. జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన టిప్స్ (JEE Mains 2023 Physics Preparation Tips) క్రింద వివరించబడ్డాయి.
సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి.
జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ముందుగా వారి సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఫిజిక్స్ సబ్జెక్టు లో ఉన్న అన్ని చాప్టర్ ల ఆధారంగా వ్యక్తిగత టైం టేబుల్ రూపొందించుకోవాలి.
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ కోసం ముఖ్యమైన టాపిక్స్ (JEE Mains 2024 Physics Important Topics)
Modern Physics
జేఈఈ మెయిన్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కచ్చితంగా చదవాల్సిన టాపిక్ Modern Physics, ఈ చాప్టర్ లో Radioactive decay of Substance, Bhor's Model, Dual nature of Matter, X-rays లాంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి.
Optics
విద్యార్థులు Optics చాప్టర్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఈ చాప్టర్ లో ఉండే Hyugen's principle చాలా ముఖ్యమైనది.
పై చాప్టర్ లతో పాటుగా Oscillation and Waves and Electrostatics కూడా ప్రిపేర్ అవ్వాలి.
విద్యార్థులు ఈ క్రింది ఇచ్చిన చాప్టర్ లు ప్రిపేర్ అవడం ద్వారా ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది.
Magnetics
Electromagnetic Induction
Current Electricity
Waves
జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో ఉన్న టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి.
JEE Mains 2024 Physics Syllabus | |||
---|---|---|---|
Names of Topics and Chapters | |||
Physics and Measurement | Kinematics | Laws of Motion | Work, Energy and Power |
Rotational Motion | Gravitation | Properties of Solids and liquids | Thermodynamics |
Magnetic Effects of Current and Magnetism | Electromagnetic Waves | Dual Nature of Matter and Radiation | Atoms and Nuclei |
Electronic Devices | Communication Systems |
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ రిఫరెన్స్ బుక్స్
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడానికి మొదటి ప్రాధాన్యత NCERT పుస్తకాలకు ఇవ్వాలి, ఈ క్రింది పట్టిక లో ఉన్న పుస్తకాల నుండి కూడా విద్యార్థులు ఫిజిక్స్ టాపిక్ ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.
Name of The Book | Publisher/Author |
---|---|
Physics | NCERT |
Problems in General Physics | I. E. Irodov |
Concept of Physics | H. C. Verma |
Arihant Physics | D. C. Pandey |
University Physics | Sears & Zemansky |
Advanced Level Physics | Nelson & Parker |
Element of Dynamics | S. L. Loney |
Fundamentals of Physics | Resnik, Halliday and Walker |
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ కు టిప్స్ మరియు సలహాలు (Tips and Tricks to Prepare Physics for JEE Mains 2024)
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్నప్పుడు చదవాల్సిన టాపిక్స్ లిస్ట్ పైన తెలుసుకున్నారు. విద్యార్థులు మరింత సులభంగా పరీక్ష వ్రాయడానికి అవసరమైన టిప్స్ మరియు సలహాలు ఇక్కడ అందించడం జరిగింది.
టైం టేబుల్ రూపొందించాలి
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు సిలబస్ గురించి పూర్తి అవగాహన కు వచ్చిన తర్వాత విద్యార్థులు వారి బలాలను మరియు బలహీనతను బట్టి వ్యక్తిగత టైం టేబుల్ రూపొందించుకోవాలి. ఏ చాప్టర్ కు ఎంత సమయం కేటాయించాలి అని టైం టేబుల్ లో నిర్ధారించుకోవాలి. ఎక్కువ వేయిటేజీ ఉన్న టాపిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. దాంతో పాటు మిగతా సబ్జెక్టులకు కావాల్సిన సమయం , రివిజన్ కు కూడా సమయం కేటాయించుకోవాలి.
షార్ట్ నోట్స్ వ్రాసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు సులభమైనది కాదు. కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్టు కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలు మరియు ఫార్ములాలు ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవడం బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం చాలా అవసరం. పరీక్షలకు ముందు రివిజన్ చేసుకునే సమయంలో ఈ నోట్స్ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది.
వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో, ప్రిపేర్ అయిన టాపిక్ లను ఒకటికి రెండు సార్లు రివిజన్ చెయ్యడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చెయ్యాలి మరియు ఎక్కువ మాక్ టెస్ట్ లను వ్రాస్తూ ఉండాలి. ఇలా వ్రాయడం వలన విద్యార్థులు ప్రశ్నలు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు సులభంగా అర్ధం చేసుకుంటే వాటికి జవాబులు కూడా వేగంగా వ్రాయవచ్చు.
పాజిటివ్ గా మరియు ధైర్యంగా ఉండండి.
జేఈఈ మెయిన్ 2024 పరీక్షలు వ్రాసే విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి, పరీక్ష లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే భయం లేకుండా ప్రశ్నలు ఎలా వచ్చినా కూడా వ్రాయగలం అనే ధైర్యం కలిగి ఉండాలి. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మితేనే ఏదైనా సాధించగలరు. కాబట్టి మీలో వున్న భయాలను పక్కన పెట్టి పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వండి, సమయానికి నిద్ర పోవడం, మధ్య మద్యలో విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు.
జేఈఈ మెయిన్ 2024 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అందరికీ ColleheDekho ఆల్ ది బెస్ట్ చెప్తుంది.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?
JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష (JEE Main 2025 Exam) సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ