టీఎస్ ఎడ్‌సెట్ 2023 దరఖాస్తు కరెక్షన్ (TS EDCET 2023 Application Form Correction) ప్రక్రియ అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ప్రారంభమవుతుంది. టీఎస్ ఎడ్‌సెట్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్‌కు సంబంధించిన పూర్తి విధానం, ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇక్కడ అందజేశాం.

టీఎస్ ఎడ్‌సెట్ 2023 అప్లికేషన్ పార్మ్ కరెక్షన్ (TS EDCET 2023 Application Form Correction):
TS EDCET 2023 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్‌లోని తప్పులను సరిచేసుకోవచ్చు. TS EDCET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (TS EDCET 2023 Application Form Correction) విండో ఓపెన్ అవుతుంది. దాని ద్వారా అప్లికేషన్‌లో తప్పులని సరి చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. తమ వివరాలను సవరించడానికి అభ్యర్థులు పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం.
ఇది కూడా చదవండి:
నేడే ప్రత్యేక దశ తెలంగాణ ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎడ్‌సెట్ ప్రత్యేక దశ వెబ్ ఆప్షన్లు విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి
TS EDCET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు తేదీలు (TS EDCET Application Form Correction Dates 2023)
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ కోసం ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.
ఈవెంట్ | తేదీలు |
---|---|
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ ఫార్మ్ (ఆలస్య రుసుము లేకుండా) పూరించడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ ఫార్మ్ (ఆలస్య రుసుముతో) పూరించడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు | తెలియాల్సి ఉంది |
TS EDCET 2023 పరీక్ష | మే 18, 2023 |
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ కోసం అనుసరించాల్సిన విధానం (Steps to Make TS EDCET Application Form Correction)
TS EDCET అప్లికేషన్ ఫార్మ్‌లో మార్పులు చేయడానికి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్‌ని అనుసరించవచ్చు:
ఆన్‌లైన్ లాగిన్ ద్వారా
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
ప్రధాన పేజీలో TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
TS EDCET అప్లికేషన్ ఫార్మ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
ఫార్మ్‌లో అవసరమైన మార్పులు చేయాలి
డీటెయిల్స్‌ని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత, “సబ్మిట్”పై క్లిక్ చేయాలి.
ఆఫ్‌లైన్ అభ్యర్థన ద్వారా
ఆఫ్‌లైన్ ద్వారా అప్లికేషన్‌లో కొన్ని పొరపాట్లను సరి చేసుకోవాల్సి ఉంటుంది. TS EDCET అప్లికేషన్ ఫార్మ్‌లో సవరించలేని డీటెయిల్స్ కోసం అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అభ్యర్ధులు అభ్యర్థన మెయిల్‌తో పాటు సంబంధిత పత్రాలను కూడా పరీక్ష అథారిటీకి పంపించాల్సి ఉంటుంది.
లాగిన్ చేయడం ద్వారా టీఎస్ ఎడ్‌సెట్ 2023 దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు ద్వారా సవరించగల వివరాలు (Details that Can be Edited through TS EDCET Application Form Correction by Logging In)
TS EDCET వివరాలని వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ద్వారా సరి చేసుకోవడానికి అవసరమైన రుజువు పత్రాలతో పాటు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
పరీక్ష రకం | - |
---|---|
అర్హత పరీక్ష ఉత్తీర్ణత సంవత్సరం | అర్హత పరీక్ష మార్క్స్ షీట్ / సర్టిఫికెట్ |
అర్హత పరీక్షలో బోధనా మాధ్యమం | మార్కులు మెమోలు / హాల్ టికెట్ నెంబర్ డిగ్రీ / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత |
అర్హత డిగ్రీ స్థానం | మార్కులు మెమోలు / హాల్ టికెట్ నెంబర్ డిగ్రీ / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత |
తల్లి పేరు | అర్హత పరీక్ష మార్క్స్ షీట్ /సర్టిఫికెట్ |
పుట్టిన ప్రదేశం | అర్హత పరీక్ష మార్క్స్ షీట్ / సర్టిఫికెట్ |
జెండర్ | - |
వర్గం | కాంపిటెంట్ అథారిటీ జారీ చేసినసర్టిఫికెట్ |
ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ | కాంపిటెంట్ అథారిటీ జారీ చేసినసర్టిఫికెట్ |
నాన్ మైనారిటీ/మైనారిటీ | కాంపిటెంట్ అథారిటీ జారీ చేసినసర్టిఫికెట్ |
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం | ఆదాయ ధృవీకరణ పత్రం |
ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ | అన్ని అధ్యయనం మార్క్స్ షీట్ & సర్టిఫికెట్లు |
SSC హాల్ టికెట్ నెంబర్ | హాల్ టికెట్/ మార్క్స్ షీట్ |
ఇంటర్మీడియట్/డిగ్రీ హాల్ టికెట్ సంఖ్య & ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం | అర్హత పరీక్ష మార్క్స్ షీట్ /సర్టిఫికెట్ |
చిరునామా | అర్హత పరీక్ష మార్క్స్ షీట్ /సర్టిఫికెట్ |
ఇమెయిల్ చిరునామా | ఇమెయిల్ ID |
సంప్రదింపు నెంబర్ | సంప్రదింపు నెంబర్ |
ఆధార్ కార్డ్ డీటెయిల్స్ | ఆధార్ కార్డ్ |
ఈ మెయిల్ అభ్యర్థన ద్వారా TS EDCET దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు ద్వారా సవరించగల వివరాలు (Details that Can be Edited through TS EDCET Application Form Correction By Email Request)
ఈ మెయిల్ అభ్యర్థన ద్వారా TS EDCET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ద్వారా సవరించలేని డీటెయిల్స్ అవసరమైన రుజువు పత్రాలతో పాటు ఈ దిగువ జాబితా చేయబడింది:
స్ట్రీమ్ | అర్హత పరీక్ష హాల్ టికెట్ |
---|---|
అభ్యర్థి పేరు | SSC మార్క్స్ షీట్ |
తేదీ జననం | SSC మార్క్స్ షీట్ |
తండ్రి పేరు | SSC మార్క్స్ షీట్ |
సంతకం | సంతకం |
ఛాయాచిత్రం | ఛాయాచిత్రం |
అర్హత పరీక్ష కోసం హాల్ టికెట్ నెంబర్ | అర్హత పరీక్ష హాల్ టికెట్ |
TS EDCET పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం, కాలేజ్ దేఖోను చూస్తూ ఉండండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
TS DEECET 2025 Exam Dates: తెలంగాణ డీసెట్ 2025 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్, సిలబస్, రిజల్ట్స్, కౌన్సెలింగ్
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ గెస్ పేపర్ 2025 (TS Inter 2nd Year Guess Papers 2025)
TS TET 2024 పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్, ఫలితాల పూర్తి వివరాలు (TS TET 2024 Exam Dates)
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)