తెలంగాణ TET 2024 పేపర్ 2టాపర్లు : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు ఈరోజు అంటే జూన్ 12వ తేదీన విడుదల అయ్యాయి. TS TET లో పేపర్ 2అంటే 6వ తరగతి నుండి 8వ తరగతి టీచర్ల కోసం నిర్వహించే పేపర్. TS TET లో టాపర్లుగా నిలిచిన అభ్యర్థులకు టీచర్ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. TS TET 2024 ఫలితాలతో పాటుగా టాపర్ల వివరాలను కూడా అధికారులు ఈరోజు విడుదల చేస్తారు. TS TET టాపర్ల జాబితా ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
TSTET 2024 పరీక్ష ముఖ్యాంశాలు (TSTET 2024 Exam Highlights)
TSTET 2024 ముఖ్యమైన ముఖ్యాంశాలు దిగువ టేబుల్లో పేర్కొనబడ్డాయి:
పరీక్ష పేరు | TSTET (తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష) |
---|---|
కండక్టింగ్ బాడీ | పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం |
పరీక్ష మోడ్ | ఆఫ్‌లైన్ |
మొత్తం మార్కులు | పేపర్-2: 150 మార్కులు |
మొత్తం ప్రశ్నలు | ప్రతి పేపర్‌లో 150 MCQలు |
మార్కింగ్ స్కీం | ప్రతి సరైన సమాధానానికి +1 నెగెటివ్ మార్కింగ్ లేదు |
పేపర్ 2 కు హాజరైన అభ్యర్థులు | 1,50,491 |
అర్హత సాధించిన అభ్యర్థులు | 51,443 |
అర్హత శాతం | 34.18% |
తెలంగాణ TET 2024 పేపర్ 2 టాపర్ల జాబితా (TS TET Paper 2 Toppers 2024)
తెలంగాణ TET 2024 పరీక్షలో టాపర్లుగా నిలిచిన అభ్యర్థుల క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
అభ్యర్థుల పేరు | విషయం | వచ్చిన మార్కులు | జిల్లా పేరు |
---|---|---|---|
లక్ష్మీ రామమ్మ | గణితం మరియు సైన్స్ | 120 | హైదరాబాద్ |
భూక్య హత్తిరం | సామాజిక అధ్యయనాలు | 105 | భద్రాద్రి కొత్తగూడెం |
పుల్లూరి స్నేహ | సామాజిక అధ్యయనాలు | 101 | పెద్దపల్లి |
ఇంకా మరిన్ని పేర్లు అందాల్సి ఉంది | ఇంకా మరిన్ని పేర్లు అందాల్సి ఉంది | ఇంకా మరిన్ని పేర్లు అందాల్సి ఉంది | మరిన్ని పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది |
తెలంగాణ TET 2024 పేపర్ 2 గత సంవత్సరం టాపర్ల జాబితా (TS TET Paper 2 Previous Year Toppers 2024)
తెలంగాణ TET 2024 గత సంవత్సరం పరీక్షలో టాపర్లుగా నిలిచిన అభ్యర్థుల క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
అభ్యర్థి పేరు | అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ | సబ్జెక్టు | సాధించిన మార్కులు | జిల్లా |
---|---|---|---|---|
కొల్లూరు నాగ వెంకట శ్రీరామ్ | 23372812601349 | గణితం & సైన్స్ | 124 | విజయనగరం |
సి. ప్రవీణ్ | 23273311000016 | గణితం & సైన్స్ | 114 | నారాయణపేట |
సయ్యద్ హుస్సేన్ | 23273011800067 | సోషల్ | 112 | గద్వాల్ |
TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా? ( How To Get TS TET 2024 Qualifying Certificate)
తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే DSC పరీక్ష వ్రాయడానికి అర్హత సాధిస్తారు. DSC పరీక్ష వ్రాసిన అభ్యర్థులు తప్పనిసరిగా TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ అధికారుల చేత ధ్రువీకరణ చేపిస్తేనే వారికి ఉద్యోగం లభిస్తుంది. గతంలో TS TET 2024 క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ ను పోస్ట్ ద్వారా అభ్యర్థుల చిరునామా కు పంపేవారు, కానీ ఇప్పుడు ఎటువంటి మెమో అభ్యర్థుల చిరునామాకు పంపించడం లేదు. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకున్న TS TET 2024 ర్యాంక్ కార్డు, క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ గా వ్యవహరించబడుతుంది. కాబట్టి TS TET 2024 ర్యాంక్ కార్డు ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిని భద్రంగా ఉంచుకోవలసిందిగా అభ్యర్థులకు సూచించడమైనది.
TS TET 2024 క్వాలిఫయింగ్ మార్కులు ( TS TET 2024 Qualifying Marks)
తెలంగాణ TET 2024 పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా మారుతూ ఉంటాయి. అభ్యర్థులు ఈ క్రింది పట్టిక ద్వారా TS TET 2024 ఉతీర్ణత మార్కులను తెలుసుకోవచ్చు.
కేటగిరీ | ఉత్తీర్ణత శాతం | ఉత్తీర్ణత మార్కులు |
---|---|---|
జనరల్ | 60% | 90 |
BC | 50% | 75 |
SC/ST | 40% | 60 |
PH | 40% | 60 |
గమనిక : తెలంగాణ TET ఉత్తీర్ణత మార్కులు అంటే కేవలం అభ్యర్థి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన మార్కులు మాత్రమే, ఉతీర్ణత మార్కులు సాధించిన అందరికీ ర్యాంక్ లభించదు అని గమనించాలి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)