- AP LAWCET 2024 లో మంచి స్కోరు ను నిర్ణయించే అంశాలు (Factors …
- AP LAWCET 2024 అర్హత మార్కులు (AP LAWCET 2024 Qualifying Marks)
- AP LAWCET 2024 లో మంచి స్కోరు (Good Score in AP …
- ఆంధ్రప్రదేశ్‌లోని బెస్ట్ ప్రైవేట్ కాలేజీలు (Top Private Law Colleges in Andhra …
- భారతదేశంలోని బెస్ట్ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law Colleges in …
- Faqs
AP LAWCET 2024 ( AP LAWCET 2024) :
AP LAWCET 2024 పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) నిర్వహిస్తుంది.
AP LAWCET 2024 పరీక్ష
లో అర్హత సాధించిన విద్యార్థులు 3 సంవత్సరాల ఎల్.ఎల్.బీ లేదా 5 సంవత్సరాల ఎల్.ఎల్.బీ కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. ఎల్.ఎల్.బీ లో సీటు పొందాలి అంటే విద్యార్థులు ఖచ్చితంగా లాసెట్ 2024 కటాఫ్ మార్కులను సాధించాలి. AP LAWCET 2024 లో విద్యార్థులు సాధించిన స్కోరు ఆధారంగా మాత్రమే వారికి అడ్మిషన్ దొరుకుతుంది. AP LAWCET 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
నేడే రెండో దశ ఏపీ లాసెట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి
AP LAWCET 2024 కటాఫ్
ను APSCHE నిర్ణయిస్తుంది. ఏపీ న్యాయ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులు తప్పనిసరిగా ఈ కటాఫ్ మార్కులను సాధించాలి లేనిచో వారికి అడ్మిషన్ దొరకదు. కాబట్టి విద్యార్థులు AP LAWCET పరీక్ష కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి. AP LAWCET కటాఫ్ మార్కులు వివిధ అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. అవి ఏంటంటే కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మరియు రిజర్వేషన్. AP LAWCET 2024 లో విద్యార్థులు ఎంత స్కోరు సాధిస్తే వారికి కళాశాల లో సీటు లభిస్తుంది అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనాలు
AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు | AP LAWCET స్కోరును అంగీకరించే ప్రైవేట్ కళాశాలల జాబితా |
---|---|
AP LAWCET అర్హత మార్కులు 2024 | AP LAWCET ఆశించిన కటాఫ్ మార్కులు |
AP LAWCET 2024 లో మంచి స్కోరు ను నిర్ణయించే అంశాలు (Factors Determining a Good Score in AP LAWCET 2024)
1. పరీక్షకు హాజరైన వారి సంఖ్య
AP LAWCET 2024 పరీక్షకు హాజరైన వారి సంఖ్య లాసెట్ కటాఫ్ ను ప్రభావితం చేస్తుంది. లాసెట్ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి పరీక్షకు ఎక్కువ మంది విద్యార్థులు హాజరు అయితే వారి మధ్య పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.
2. విద్యార్థుల పెర్ఫార్మెన్స్
AP LAWCET 2024 లో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష బాగా రాస్తే కటాఫ్ స్కోరు కూడా పెరుగుతుంది.
3. పరీక్ష క్లిష్టత స్థాయి
AP LAWCET పరీక్ష క్లిష్టత స్థాయి ను బట్టి కూడా మంచి స్కోరు ఎంత అనేది నిర్ణనించ వచ్చు. పరీక్ష బాగా కష్టంగా ఉంటే మంచి మార్కుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒకవేళ పరీక్ష సులభంగా ఉంటే మాత్రం మంచి మార్కుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
4. విద్యార్థుల కేటగిరీ
AP LAWCET 2024 పరీక్ష రాసే విద్యార్థులు రిజర్వడ్, అన్ రిజర్వడ్ కేటగిరీ కింద విభజిస్తారు. రెండు కేటగిరీల విద్యార్థులకు వేర్వేరుగా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. రిజర్వ్ కేటగిరీ విద్యార్థుల కటాఫ్ మార్కులు కొంచెం తక్కువగా ఉంటాయి . దాంతో వారికి అవసరమైన మంచి మార్కులు కూడా తక్కువగానే ఉంటాయి.
5. సీట్ల సంఖ్య
AP LAWCET 2024 కు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ను బట్టి కూడా కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు.
6. విద్యార్థుల కళాశాల, కోర్సు ప్రాధాన్యత
AP LAWCET కు అర్హత సాధించిన విద్యార్థులు ఎంచుకునే కళాశాల, ఆ కళాశాల సీట్ల సంఖ్యను బట్టి కూడా మంచి స్కోరు ఎంత అనేది తెలుస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే కాలేజీని ఎంచుకున్నట్టు అయితే వారిలో మెరిట్ విద్యార్థులకు ముందుగా ఆ కళాశాలలో సీటు కేటాయించబడుతుంది.
7. విద్యార్థి జెండర్
AP LAWCET 2024 అడ్మిషన్ స్తీ, పురుషులకు ఒక డైనమిక్ నిష్పత్తిలో కేటాయిస్తారు. కాబట్టి ఈ అంశం కూడా కటాఫ్ నిర్ణయించడంలో ముఖ్యమైనది.
AP LAWCET 2024 అర్హత మార్కులు (AP LAWCET 2024 Qualifying Marks)
AP LAWCET 2024 పరీక్ష స్కోరు ఆధారంగా విద్యార్థులు లా కళాశాలల్లో అడ్మిషన్ పొందుతారు. విద్యార్థుల కేటగిరీ ప్రకారంగా అర్హత మార్కులు, అర్హత మార్కుల శాతం క్రింది టేబుల్లో తెలుసుకోవచ్చు.
కేటగిరీ | అర్హత మార్కులు | అర్హత శాతం |
---|---|---|
జనరల్/అన్ రిజర్వ్డ్ | 42/120 | 35% |
SC/ ST | కనీస అర్హత మార్కులు / శాతం లేదు |
AP LAWCET 2024 లో మంచి స్కోరు (Good Score in AP LAWCET 2024)
AP LAWCET 2024 పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
విద్యార్థులు క్రింద ఉన్న పట్టిక నుండి AP LAWCET 2024 లో మంచి స్కోరు ఎంత అనే విషయం తెలుసుకోవచ్చు.
చాలా మంచి స్కోరు | 100+ |
---|---|
మంచి స్కోరు | 80+ |
సగటు స్కోరు | 70+ |
పేలవమైన స్కోరు | 60 కంటే తక్కువ |
ఆంధ్రప్రదేశ్‌లోని బెస్ట్ ప్రైవేట్ కాలేజీలు (Top Private Law Colleges in Andhra Pradesh)
AP LAWCET 2024 కు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. ఒకవేళ విద్యార్థులు AP LAWCET 2024లో అర్హత సాధించకపోతే వారు క్రింద ఉన్న ప్రైవేట్ కళాశాలలోని మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను పొందవచ్చు. ఏపీలోని బెస్ట్ ప్రైవేట్ లా కళాశాలల జాబితా ఈ దిగువ పట్టికలో తెలుసుకోవచ్చు.
కాలేజ్ పేరు | ప్రాంతం |
---|---|
GITAM University | విశాఖపట్నం |
KL University | గుంటూరు |
Vignan’s Foundation for Science, Technology & Research | గుంటూరు |
భారతదేశంలోని బెస్ట్ ప్రైవేట్ లా కళాశాలలు (Top Private Law Colleges in India)
క్రింద ఇవ్వబడిన పట్టికలో భారతదేశం లో ఉన్న అత్యుత్తమ లా కళాశాలల జాబితా విద్యార్థులు గమనించవచ్చు.
కళాశాల పేరు | ప్రాంతం |
---|---|
Aurora's Legal Sciences Academy, Hyderabad (ALSA) | హైదరాబాద్, తెలంగాణ |
Amity University | ముంబై |
Teerthanker Mahaveer University (TMU) | మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్ |
SAGE University | ఇండోర్, మధ్యప్రదేశ్ |
The ICFAI University | జైపూర్, రాజస్థాన్ |
Chandigarh University (CU) | చండీగఢ్, పంజాబ్ |
Lovely Professional University (LPU) | జలంధర్, పంజాబ్ |
O.P. Jindal Global University (JGU) | సోన్‌పత్, హర్యానా |
ILS Law College (ILSLC) | పూణే, మహారాష్ట్ర |
Institute of Law Nirma University (ILNU) | అహ్మదాబాద్, గుజరాత్ |
AP LAWCET 2024 ( AP LAWCET 2024)కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మంచి స్కోరు ఎంత అనే విషయం ఈ ఆర్టికల్ నుంచి తెలుసుకున్నారు, కాబట్టి విద్యార్థులు వారి పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి. కటాఫ్ మార్కులను దృష్టిలో ఉంచుకుని ఆ మార్కులు సాధించే లాగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవ్వాలి.
ఇవి కూడా చదవండి
AP LAWCET మెరిట్ లిస్ట్ | AP LAWCET కౌన్సెలింగ్ ప్రక్రియ |
---|---|
AP LAWCET సీట్ అలాట్మెంట్ | AP LAWCET ముఖ్యమైన తేదీలు |
AP LAWCET 2024 పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
భారతదేశంలో అత్యుత్తమ లా ప్రవేశ పరీక్షలు (Top Law Entrance Exams in India 2024)
Good Score in TS LAWCET 2024: తెలంగాణ లాసెట్ 2024లో గుడ్ స్కోర్ ఎంత?
TS LAWCET 2024 Courses: తెలంగాణ లాసెట్ 2024 కోర్సుల లిస్ట్ ఇదే
TS LAWCET 2024 ఫేజ్ 2 కౌన్సెలింగ్ (TS LAWCET 20234 Phase 2 Counselling)కు ఎవరు అర్హులు?
TS LAWCET 2024 ద్వారా అడ్మిషన్ కోసం టాప్ న్యాయ కళాశాలల జాబితా (List of Top Law Colleges for Admission through TS LAWCET 2024)
TS LAWCET 2024 Application Form Correction: TS LAWCET 2024 దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్, తేదీలు, ప్రక్రియ, సూచనలు, డాక్యుమెంట్ల వివరాలు