- ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష పూర్తి వివరాలు (AP EAMCET 2024 Exam- …
- ఏపీ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP EAMCET 2023- Important Dates)
- ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫీజు (AP EAMCET 2024 Application Fee)
- ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష నమూనా (AP EAMCET 2024 Exam Pattern)
- ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024 అర్హత మార్కులు (AP EAMCET 2024 Expected Qualifying …
- ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024 ర్యాంకింగ్ సిస్టమ్ (AP EAMCET/EAPCET 2024 Ranking System)
- బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024లో మంచి ర్యాంక్ (Good …
- ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024లో మంచి స్కోరు (Good Score in AP EAMCET/EAPCET) …
- బీటెక్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్ 2024లో మంచి ర్యాంక్ (Good Rank …
ఏపీ ఎంసెట్ 2024 (AP EAMCET/EAPCET 2024):
బీటెక్ (B.Tech),బీఫార్మా (B.Pharm), బీఎస్సీ అగ్రికల్చర్ (B.Sc Agriculture), బీఎస్సీ హార్టీకల్చరల్ (B.Sc Horticulture) వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరీక్షను (AP EAMCET/EAPCET 2024) నిర్వహిస్తారు. సాధారణంగా ఏపీ ఎంసెట్ (AP EAMCET/APEAPCET 2024) ఫలితాలు పరీక్ష నిర్వహించిన వెంటనే ప్రకటిస్తారు. అయితే టెస్ట్‌లో (AP EAMCET/EAPCET 2024) ఎంత స్కోర్ చేస్తే, ఎంత ర్యాంక్ వస్తే సీటు వస్తుందనే విషయంలో చాలామంది విద్యార్థులకు రకరకాల సందేహాలు ఉన్నాయి. విద్యార్థుల అనుమానాలను తీర్చే విధంగా ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET/AP EAPCET 2024) గరిష్ట, కనిష్ట స్కోర్‌ల పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో తెలియజేశాం.
ఇది కూడా చదవండి:
ఈరోజే ఏపీ ఎంసెట్ బైపీసీ సీట్ల కేటాయింపు జాబితా రిలీజ్, ఇలా ఒక క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రతి ఏడాది బీటెక్ (B.tech) దరఖాస్తుదారుల సంఖ్య 1.70 లక్షల వరకు ఉంటుంది. దాంతో ముగింపు ర్యాంక్ 1,30,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ కోర్సులో ప్రతి ఏడాది 80 వేల మంది విద్యార్థుల వరకు జాయిన్ అవుతుంటారు. నిజానికి అగ్రికల్చర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉన్నాీయి. దాంతో ఈ కోర్సులో అడ్మిషన్‌కు చాలా పోటీగా ఉంటుంది. ఈ పేజీ కొత్త వివరాలతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. అభ్యర్థులు ఇంతకు ముందు సంవత్సరాల ట్రెండ్‌లను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ప్రతి ఏటా AP EAMCET పరీక్షను నిర్వహిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, కాకినాడ లేదా JNTUK, దాని అధికారిక వెబ్‌సైట్‌లో AP EAMCET పరీక్ష నమూనా 2024ను పబ్లిష్ చేస్తుంది. AP EAMCET పరీక్ష విధానంలో పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్, AP EAMCETలో అడిగే ప్రశ్నల సంఖ్య మొదలైనవి ఉంటాయి.
అభ్యర్థులు తమ పరీక్ష సన్నాహాల కోసం AP EAMCET పరీక్ష నమూనా 2024ని చెక్ చేయవచ్చు. అంతేకాకుండా మంచి ప్రిపరేషన్ వ్యూహాన్ని రూపొందించడానికి AP EAMCET 2024 సిలబస్ పరిజ్ఞానం కూడా అంతే అవసరం. ఈ పరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది.
ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష పూర్తి వివరాలు (AP EAMCET 2024 Exam- Overview)
AP EAMCET 2024 పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి కోర్సులను అభ్యసించడానికి ఔత్సాహిక విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. ఏపీ ఎంసెట్‌పై అభ్యర్థులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి cets.apsche.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఆర్గనైజేషన్ | ఆంధ్రప్రదేశ్ కౌన్సెలింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) |
---|---|
కండక్టింగ్ బాడీ | జవహర్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ (JNTUK) కాకినాడ |
కేటగిరి స్టేట్ లెవెల్ | ఎంట్రన్స్ ఎగ్జామ్ |
పరీక్ష ఫ్రీక్వేన్సీ | ఏడాదికి ఒకసారి |
ఎగ్జామ్ మోడ్ | ఆన్‌లైన్ |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
కోర్సులు | ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసీ |
ఎగ్జామ్ డ్యురేషన్ | మూడు గంటలు |
భాష | ఇంగ్లీష్, తెలుగు |
అధికారిక వెబ్‌సైట్ | cets.apsche.ap.gov.in |
ఏపీ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP EAMCET 2023- Important Dates)
AP EAMCET 2024 పరీక్షకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంచనా తేదీలు అభ్యర్థుల సూచన కోసం దిగువ పట్టికలో అందించబడ్డాయి.
ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
ఏపీ ఎంసెట్ 2024 నోటిఫికేషన్ | మార్చి 2024 |
ఏపీ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం | మార్చి, ఏప్రిల్ 2024 |
ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 2024 |
ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ 2024 | మే 2023 |
ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామ్ డేట్ | మే 2023 |
ఏపీ ఎంసెట్ ఫలితాలు 2024 | మే 2023 |
ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫీజు (AP EAMCET 2024 Application Fee)
అర్హత గల అభ్యర్థులు పరీక్ష కోసం విజయవంతంగా నమోదు చేసుకోవడానికి AP EAMCET 2024 దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును ATM కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఖాతాను ఉపయోగించి చెల్లించవచ్చు. అభ్యర్థులు AP/TS ఆన్‌లైన్ కేంద్రాలలో AP EAMCET దరఖాస్తు ఫీజును కూడా చెల్లించవచ్చు. వివిధ కేటగిరీల విద్యార్థుల ద్వారా AP EAMCET రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన మొత్తం దిగువున టేబుల్ ఇవ్వబడింది.
స్ట్రీమ్ | జనరల్ | బీసీ | ఎస్సీ,ఎస్టీ |
---|---|---|---|
ఇంజనీరింగ్ | రూ.600 | రూ.550, | రూ.500 |
అగ్రికల్చర్ | రూ.600 | రూ.550 | రూ.500 |
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ | రూ.1200 | రూ.1100 | రూ.1000 |
ఏపీ ఎంసెట్ 2024 పరీక్ష నమూనా (AP EAMCET 2024 Exam Pattern)
AP EAMCET 2024 పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు పేపర్‌ను ప్రయత్నించడానికి 3 గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో మార్కు చొప్పున మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా తెలుగులో పేపర్‌లో ప్రశ్నలను సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. AP EAMCET 2024 పరీక్ష మార్కింగ్ విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. పరీక్ష విధానం గురించి అర్థం చేసుకోవచ్చు.
సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు |
---|---|---|
మ్యాథ్య్స్, బయోలజీ | 80 | 80 |
ఫిజిక్స్ | 40 | 40 |
కెమిస్ట్రీ | 40 | 40 |
మొత్తం సంఖ్య | 180 | 180 |
ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024 అర్హత మార్కులు (AP EAMCET 2024 Expected Qualifying Marks)
అభ్యర్థులు APSCHE కౌన్సెలింగ్‌కు అర్హత సంపాదించేందుకు ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET 2024) (AP EAPCET 2024) లో అవసరమైన మార్కులను ముందే నిర్ణయించడం జరిగింది. కేటగిరీ వారీగా అర్హత మార్కులను దిగువ పట్టికలో చూసి తెలుసుకోవచ్చు.
కేటగిరి | అర్హత మార్కులు (160లో) |
---|---|
జనరల్/ OBC | 40 |
SC/ ST | కనీస అర్హత మార్కు లేదు |
ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024 ర్యాంకింగ్ సిస్టమ్ (AP EAMCET/EAPCET 2024 Ranking System)
ఏపీ ఎంసెట్ (AP EAMCET/EAPCET 2024) ర్యాంకింగ్ విధానాన్ని (AP EAMCET Rank Card) గత ఏడాది సవరించారు. దాని ప్రకారం ఏపీ ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ నిబంధన రద్దు అయింది. దీనిబట్టి ఏపీ ఎంసెట్ (AP EAMCET 2024) ర్యాంకింగ్ విధానం ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఏపీ ఎంసెట్‌ని (AP EAMCET 2024)ని 160 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులను సాధిస్తే, ర్యాంక్‌ను నిర్ణయించడానికి వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లకు వేర్వేరు ర్యాంకులు ఉంటాయి.
బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024లో మంచి ర్యాంక్ (Good Rank in AP EAMCET 2024 for B.Sc Agriculture Admission)
ఇంతకు ముందు సంవత్సరాల ఎంసెట్ ముగింపు ర్యాంక్ ట్రెండ్‌ల ఆధారంగా B.Sc అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఏపీ ఎంసెట్ (AP EAMCET 2024)లో గరిష్ట, కనిష్ట ర్యాంకుల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.
చాలా మంచి ర్యాంక్ | 1 - 1,000 |
---|---|
మంచి ర్యాంక్ | 1,001 - 5,000 |
సగటు ర్యాంక్ | 5,001 - 10,000 |
తక్కువ ర్యాంక్ | 15,000 పైన |
సంబంధిత లింకులు
ఏపీ ఎంసెట్/ఎప్‌సెట్ 2024లో మంచి స్కోరు (Good Score in AP EAMCET/EAPCET) 2024)
గత సంవత్సరాల ఏపీ ఎంసెట్ (AP EAMCET/ AP EAPCET) ముగింపు ట్రెండ్‌లు, విశ్లేషణల ఆధారంగా ఏపీ ఎంసెట్ (AP EAMCET/ EAPCET)2024)లో చాలా మంచి స్కోరు, మంచి స్కోరు, సగటు, తక్కువ స్కోరులు ఈ కింది విధంగా ఉండవచ్చు.
చాలా మంచి స్కోరు | 140+ |
---|---|
మంచి స్కోరు | 120+ |
సగటు స్కోరు | 70+ |
తక్కువ స్కోరు | 50 లేదా అంతకంటే తక్కువ |
బీటెక్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్ 2024లో మంచి ర్యాంక్ (Good Rank in AP EAMCET/EAPCET) for B.Tech Admission)
గత సంవత్సరాల ఏపీ ఎంసెట్ లేదా ఏపీ ఎప్‌సెట్ ముగింపు ర్యాంక్ ట్రెండ్‌ల ఆధారంగా బీటెక్ అడ్మిషన్ కోసం ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET/EAPCET) 2024) చాలా మంచి ర్యాంక్, మంచి ర్యాంక్, సగటు, తక్కువ ర్యాంక్‌లు ఈ కింది విధంగా ఉండవచ్చు.
చాలా మంచి ర్యాంక్ | 1 – 5,000 |
---|---|
మంచి ర్యాంక్ | 5,001 - 20,000 |
సగటు ర్యాంక్ | 20,001 - 40,000 |
తక్కువ ర్యాంక్ | 60,000 పైన |
కూడా తనిఖీ చేయండి,
మరింత అప్‌డేట్ సమాచారం కోసం Education News AP EAMCETలో, మాలో చేరండి Telegram Group , కాలేజ్ దేఖో (Collegedekho) చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఆంధ్రప్రదేశ్‌లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)
JEE మెయిన్ 2025లో మంచి స్కోర్, ర్యాంక్ (Good Score and Rank in JEE Main 2025) అంటే ఏమిటి?
JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష (JEE Main 2025 Exam) సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితం, పరీక్షా సరళి పూర్తి వివరాలు
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్‌లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ