- AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ (AP AGRICET 2023 Application Form)
- AP AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( AP AGRICET 2023 …
- AP AGRICET 2023 అప్లికేషన్ ప్రాసెస్ ( AP AGRICET 2023 Application …
- AP AGRICET 2023 అప్లికేషన్ ఫీజు ( AP AGRICET 2023 Application …
- AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)
- AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు ( Documents …
- AP AGRICET 2023 డీటైల్డ్ సిలబస్ (AP AGRICET 2023 Detailed Syllabus)
AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023
: AP AGRICET నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆచార్య ఎన్.జి రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ అగ్రిసెట్ పరీక్ష నిర్వహించబడుతుంది. AP AGRICET పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు B.Sc అగ్రికల్చర్, M.Sc అగ్రికల్చర్ కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చు. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి 2 గంటల సమయం కేటాయించబడుతుంది. AP AGRICET పరీక్షను ఆన్లైన్ మోడ్ లో నిర్వహిస్తారు. AP AGRICET 2023 కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ (AP AGRICET 2023 Application Process) గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ -
AP AGRICET 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ (AP AGRICET 2023 Application Form)
AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ 20 జూలై 2023 ఆన్లైన్ లో అందుబాటులో ఉంది, ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ పూరించడానికి చివరి తేదీ 05 ఆగస్టు 2023. B.Sc Hons అగ్రికల్చర్ , B.Tech అగ్రికల్చర్ లో అడ్మిషన్ పొందాలి అనుకునే విద్యార్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ ను పూర్తి చేయాలి. AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ క్రింది ఇచ్చిన టేబుల్ లో గమనించవచ్చు.
AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
AP AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( AP AGRICET 2023 Important Dates)
AP AGRICET 2023 పరీక్షకు గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
విషయం | తేదీ |
---|---|
AP AGRICET 2023 నోటిఫికేషన్ | 15 జూలై 2023 |
AP AGRICET 2023 పరీక్ష తేదీలు | 01 సెప్టెంబర్ 2023 |
AP AGRICET 2023 హాల్ టికెట్ విడుదల | 20 నుండి 25 ఆగష్టు 2023 |
AP AGRICET 2023 ఫలితాలు | 09 అక్టోబర్ 2023 ( విడుదల అయ్యాయి) |
AP AGRICET 2023 కౌన్సెలింగ్ | తెలియాల్సి ఉంది |
AP AGRICET 2023 అప్లికేషన్ ప్రాసెస్ ( AP AGRICET 2023 Application Process)
AP AGRICET 2023 పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించడం : AP AGRICET 2023 అధికారిక వెబ్సైట్ angrauagricet.aptonline.in ద్వారా అభ్యర్థులు వారి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. లేదా ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ చేయవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత పేమెంట్ స్థితి చెక్ చేసుకుని రిసిప్ట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫార్మ్ పూరించడం : అభ్యర్థులు వారి ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ లో వారి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ మొదలైన వివరాలు తప్పులు లేకుండా పూరించాలి.
ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయడం : అభ్యర్థులు వారి వ్యక్తిగత సమాచారం పూరించిన తర్వాత ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఫోటో మరియు సంతకం యొక్క ప్రమాణాలు నిర్దిష్టంగా ఉండాలి. అభ్యర్థులు సరైన స్పెసిఫికేషన్స్ పాటించకపోతే ఫోటో మరియు సంతకం అప్లోడ్ కావు.
అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకోండి :
అభ్యర్థులు పైన చెప్పిన అన్ని స్టెప్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరొక్కసారి అప్లికేషన్ ఫార్మ్ ను సరి చేసుకుని అన్ని వివరాలు సరిగా ఉన్నాయి అని నిర్దారించుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి -
AP AGRICET 2023 పూర్తి సిలబస్
AP AGRICET 2023 అప్లికేషన్ ఫీజు ( AP AGRICET 2023 Application Fee)
AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫీజు కేటగిరీ ప్రకారంగా క్రింది ఉన్న టేబుల్ లో తెలుసుకోవచ్చు.
కేటగిరీ | ఫీజు |
---|---|
జనరల్ | 1200/- |
PwD/SC/ST | 600/- |
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది.
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.
జనరల్ | 25% (120 కు 30 మార్కులు) |
SC/ST | కనీస ఉతీర్ణత మార్కులు లేవు |
ఇది కూడా చదవండి - AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు పూర్తి సమాచారం
AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు ( Documents Required During AP AGRICET 2023 Application Process)
AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించే సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా ఈ క్రింద తెలుసుకోవచ్చు.
- 10వ తరగతి మార్క్స్ షీట్
- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన డిప్లొమా మార్క్స్ షీట్
- స్టడీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ( అవసరమైనచో)
- పాస్పోర్ట్ సైజు ఫోటో
- పేమెంట్ ఐడీ రసీదు
AP AGRICET 2023 డీటైల్డ్ సిలబస్ (AP AGRICET 2023 Detailed Syllabus)
AP AGRICET 2023 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సిలబస్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు.Principles of Agronomy
Basic Principles of Plant Breeding and Bio Technology
Soil Chemistry and Fertility
Primary and Basic Chemistry
Principles of Entomology and Productive Entomology
Communication Skills
Principles of Plant Pathology
Crop Production - I (Cereals, Pulses and Fodders)
Manures and Fertilizers
Pests of Crops and their Management
Land Surveying, Soil and Water Engineering and Greenhouse Technology
Introduction to Computers
Diseases of Crops and their Management
Crop Production – II (Oil Seeds, Commercial & other Crops)
Seed Production, Testing and Certification
Field Diagnosis
Farm Management, Agricultural Cooperation, Finance and Marketing
Farm Power and Machinery
Fruits, Vegetables and their Management
Floriculture, Land Scaping, Medicinal and Aromatic Plants
Agricultural Extension and Rural Development
AP AGRICET 2023 గురించిన మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
BSc అగ్రికల్చర్ అడ్మిషన్లు 2025 (BSc Agriculture Admissions 2025): ప్రవేశ పరీక్షలు, అర్హత, ఎలా దరఖాస్తు చేయాలి & అగ్ర కళాశాలలు
ANGRAU AP BSc అగ్రికల్చర్, హార్టికల్చర్ అడ్మిషన్ 2024: వెబ్ ఎంపికలు (OUT), రిజిస్ట్రేషన్, ఫీజు, సీట్ల కేటాయింపు, కౌన్సెలింగ్
ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ 2024 (AP EAPCET Agriculture 2024) హాల్ టికెట్లు రిలీజ్, మాక్ టెస్ట్, సిలబస్, అప్డేట్లు ఇక్కడ చూడండి
తెలంగాణ BSc అగ్రికల్చర్, BFSc, BVSc & AH అడ్మిషన్ 2024: రిజిస్ట్రేషన్ (చివరి తేదీ - ఆగస్టు 18), వెబ్ ఎంపికలు, సీట్ల కేటాయింపు, & ప్రవేశ ప్రక్రియ
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ 2024 ఫలితాలు వచ్చేశాయ్ (TS EAMCET Agriculture 2024 ), కౌన్సెలింగ్ డేట్స్ ఇక్కడ చూడండి
BSc అగ్రికల్చర్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs after BSc Agriculture)