AP LAWCET 2024 ద్వారా అందించే కోర్సులు జాబితా (List of Courses Offered Through AP LAWCET 2024): అర్హత ప్రమాణాలు

Guttikonda Sai

Updated On: January 02, 2024 11:23 AM | AP LAWCET

AP LAWCET 2024  పరీక్ష మే నెలలో జరుగుతుంది. ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందాలి అనుకుంటున్న విద్యార్థులు ఏపీ లాసెట్ ద్వారా అందించే కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
List of Courses Offered Through AP LAWCET 2022

AP LAWCET 2024 ద్వారా అందించే  కోర్సులు జాబితా: AP LAWCET ( ఆంధ్రప్రదేశ్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్) భారతదేశంలోని ప్రసిద్ధ రాష్ట్ర స్థాయి లా ఎంట్రన్స్ పరీక్షలలో ఒకటి. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం నిర్వహిస్తుంది. AP LAWCET కళాశాలలు విద్యార్థులకు అందించే కోర్సుల జాబితా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టాప్ లా కళాశాలలు వారు అందించే కోర్సుల వివరాలు, ఆయా కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులకు కావాల్సిన అర్హత ప్రమాణాలు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: నేడే రెండో దశ ఏపీ లాసెట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల, లింక్ కోసం ఇక్కడ చూడండి

సంబంధిత కథనాలు

AP LAWCET 2024 ముఖ్యమైన అంశాలు AP LAWCET స్కోరును అంగీకరించే ప్రైవేట్ కళాశాలల జాబితా
AP LAWCET అర్హత మార్కులు 2024 AP LAWCET ఆశించిన కటాఫ్ మార్కులు

AP LAWCET 2024 పరీక్ష ముఖ్యాంశాలు (AP LAWCET 2024 Exam Highlights)

AP LAWCET 2024 పరీక్ష కు సంబందించిన ముఖ్యమైన అంశాలు ఈ క్రింది పట్టిక నుండి విద్యార్థులు తెలుసుకోవచ్చు.

విశేషాలు డీటెయిల్స్
పరీక్ష AP LAWCET
పూర్తి రూపం ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్
పరీక్ష మోడ్ ఆన్‌లైన్
వ్యవధి 1 గంట 30 నిమిషాలు
తరచుదనం వార్షిక
అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in
ప్రశ్నల రకం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు
మొత్తం విభాగాలు 3
మొత్తం మార్కులు 120
ప్రశ్నల సంఖ్య 120
పరీక్షా మాధ్యమం ఇంగ్లీష్ మరియు తెలుగు
మార్కింగ్ స్కీం

సరైన సమాధానం కోసం +1

నెగెటివ్ మార్కింగ్ లేదు

AP LAWCET 2024 ముఖ్యమైన తేదీలు (AP LAWCET 2024 Important Dates)


AP LAWCET 2024 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించిన సమాచారం విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

కార్యక్రమం

తేదీలు

అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభ తేదీ

ఫిబ్రవరి 2024

అప్లికేషన్ ఫార్మ్ (ఆలస్య రుసుము లేకుండా) సమర్పించడానికి చివరి తేదీ

మార్చి  2024

అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్

ఏప్రిల్ 2024

హాల్ టికెట్ విడుదల తేదీ

ఏప్రిల్ 2024

పరీక్ష తేదీ

మే 2024

ప్రిలిమినరీ కీ ప్రకటన

మే 2024

అభ్యంతరం చెప్పడానికి చివరి తేదీ

మే 2024

ఫలితాలు

జూన్ 2024

కౌన్సెలింగ్

జులై 2024

అకడమిక్ సెషన్ ప్రారంభం

ఆగష్టు 2024

AP LAWCET 2024 ద్వారా అందించే కోర్సులు(Courses Offered through AP LAWCET 2024)

AP LAWCET 2024 ద్వారా అందించే కోర్సుల వివరాలు ఈ పట్టిక లో తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల అడ్మిషన్ కూడా లభిస్తుంది.

కోర్సు పేరు

వ్యవధి

LLB

3 సంవత్సరాలు

BA LLB

5 సంవత్సరాలు

BCom LLB

5 సంవత్సరాలు

BSc LLB

5 సంవత్సరాలు

BBA LLB

5 సంవత్సరాలు

AP LAWCET 2024 ద్వారా అందించే కోర్సులకు అర్హత ప్రమాణాలు (Eligibility Criteria of Courses Offered through AP LAWCET 2024)

AP LAWCET 2024 ద్వారా అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు కొన్ని అర్హతలను ఖచ్చితంగా పాటించాలి. ఏ కోర్సులో ప్రవేశం పొందడానికి ఎలాంటి అర్హత కలిగి ఉండాలి అని క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.

Eligibility Criteria of Courses Offered through AP LAWCET 2022

కోర్సు అర్హత ప్రమాణాలు
LLB
  • అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో అతని/ఆమె గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
  • కనీస అర్హత మార్కులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, BC కేటగిరీకి 42% మరియు SC/ST కేటగిరీ అభ్యర్థులకు, అర్హత సాధించిన మార్కులు 40%.

BA LLB

BBA LLB

BCom LLB

  • అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ నుండి క్లాస్ 12వ లేదా తత్సమాన పరీక్ష  పూర్తి చేసి ఉండాలి
  • క్లాస్ 12వ తరగతిలో కనీసం 45% మార్కులు స్కోర్ చేసి ఉండాలి
  • BC వర్గానికి చెందిన వారు అర్హత పరీక్షలో కనీసం 42% మార్కులు మరియు SC/ST వర్గాలకు చెందినవారు కనీసం 40% మార్కులు కలిగి ఉండాలి.
B.Sc LLB
  • గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి అభ్యర్థి క్లాస్ 12వ తరగతి వరకు అతని/ఆమె విద్యను పూర్తి చేసి ఉండాలి
  • అభ్యర్థి కనీసం 45% మార్కులు తో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీని ప్రధాన సబ్జెక్టులుగా సైన్స్‌లో క్లాస్ 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

AP LAWCET 2024 కోర్సులకు ఎలా అప్లై చేయాలి? (How to Apply for Courses Offered through AP LAWCET 2024)

AP LAWCET 2024 ద్వారా అందించబడే కోర్సులకు అప్లై చేసుకోవడానికి విద్యార్థులు లాసెట్ అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ పూరించాలి. విద్యార్థుల వ్యక్తిగత వివరాలు పూర్తి చేసి అప్లికేషన్ ఫీజు ను చెల్లించాలి. ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించిన రిసిప్ట్ ను డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవాలి.

ఇవి కూడా చదవండి

AP LAWCET మెరిట్ లిస్ట్ AP LAWCET కౌన్సెలింగ్ ప్రక్రియ
AP LAWCET సీట్ అలాట్మెంట్ AP LAWCET ముఖ్యమైన తేదీలు

AP LAWCET 2024 గురించి ఏవైనా అనుమానాలు ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 1800-572-9877 కు కాల్ చేసి నిపుణుల సలహా పొందవచ్చు. AP LAWCET గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

FAQs

AP LAWCET 2024 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?

AP LAWCET 2024 పరీక్ష మే నెలలో జరుగుతుంది.

AP LAWCET 2024 ద్వారా ఏ కోర్సులు అందించబడతాయి?

  1. AP LAWCET ద్వారా, అభ్యర్థులు 5 సంవత్సరాల BBA LL.B, 5 సంవత్సరాల B.Com LL.B, 3 సంవత్సరాల LL.B (Hons), 3 years LL.B, 5 years LL.B (Hons), LL.M చదువుకోవచ్చు. రాజ్యాంగ మరియు చట్టపరమైన క్రమంలో, వాణిజ్య చట్టంలో LL.M, క్రిమినల్ చట్టంలో LL.M, కార్పొరేట్ మరియు భద్రతా చట్టంలో LL.M మరియు అనేక ఇతర చట్టాలు కోర్సులు .

/articles/list-of-courses-offered-through-ap-lawcet/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Law Colleges in India

View All
Top