- AP TET 2024 పరీక్ష తేదీలు (AP TET Exam Dates 2024)
- AP TET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఎలా పూరించాలి? (How to fill …
- AP TET 2024 ఫోటో, సంతకం స్పెసిఫికేషన్స్ (AP TET 2024 Photograph …
- AP TET 2024 ఫోటో & సంతకం అప్లోడ్ విధానంలో చేయవలసినవి చేయకూడనివి …
- AP TET 2024 అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు (Important Instructions for AP …
ఏపీ టెట్ ఎగ్జామ్ 2024 (AP TET Exam 2024)
: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ 2024 కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. ప్రతీ సంవత్సరం ఏపీ టెట్ పరీక్ష కు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి వరకు టీచర్లను నియమించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. AP TET 2024 పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. AP TET 2024 కు అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి -
నేడే ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్, పేపర్ 1 రాసేందుకు వాళ్లు మాత్రమే అర్హులు
AP TET 2024 పరీక్ష తేదీలు (AP TET Exam Dates 2024)
విద్యార్థులు AP TET 2024 పరీక్ష గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో గమనించవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
నోటిఫికేషన్ జారీ | 07 ఫిబ్రవరి 2024 |
అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి తేదీ ప్రారంభమవుతుంది | 08 ఫిబ్రవరి 2024 |
సమర్పించడానికి చివరి తేదీ అప్లికేషన్ ఫార్మ్ | 18 ఫిబ్రవరి 2024 |
హాల్ టికెట్ విడుదల తేదీ | 23 ఫిబ్రవరి నుండి |
APTET పరీక్ష షెడ్యూల్ (పేపర్ 1 మరియు పేపర్ 2) | 27 ఫిబ్రవరి నుండి 09 మార్చి 2024 వరకు |
జవాబు కీ విడుదల తేదీ | 10 మార్చి 2024 |
ఫైనల్ ఆన్సర్ కీ ప్రచురణ | 13 మార్చి 2024 |
ఫలితం | 14 మార్చి 2024 |
AP TET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఎలా పూరించాలి? (How to fill AP TET Application Form 2024?)
AP TET 2024 అప్లికేషన్ పూర్తి చేయడానికి విద్యార్థులు క్రింద ఇవ్వబడిన స్టెప్స్ అనుసరించాలి.
- AP TET 2024 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- హోమ్ పేజీ లో " Apply Online" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఫార్మ్ మీకు కనిపిస్తుంది.
- అప్లికేషన్ ఫార్మ్ లో మీ వ్యక్తిగత సమాచారం పూర్తి చేయండి.
- అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత, అప్లికేషన్ ఫీజు చెల్లించి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ను మరొకసారి సరి చూసుకుని ' సబ్మిట్ ' చేయండి.
- భవిష్యత్ లో అవసరం కోసం ఫీజు రిసిప్ట్ డౌన్లోడ్ చేసి జాగ్రత్త చేయండి.
AP DSC సిలబస్ | AP DSC అర్హత ప్రమాణాలు |
---|
AP TET 2024 ఫోటో, సంతకం స్పెసిఫికేషన్స్ (AP TET 2024 Photograph and Signature Specifications)
విద్యార్థులు ఆన్లైన్ లో అప్లోడ్ చేసే ఫోటో లో కళ్ళజోడు లేదా టోపీ వంటివి ఏమీ ఉండకూడదు. విద్యార్థుల సంతకం కూడా అర్థం అయ్యే లాగా ఉండడం అవసరం. విద్యార్థులు వారి ఫొటో మరియు సంతకం స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయడానికి అవసరమైన స్పెసిఫికేషన్స్ ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
డాక్యుమెంట్ | సైజ్ | ఫార్మాట్ |
---|---|---|
ఫోటో | 50 kb కంటే తక్కువ | JPG/JPEG |
సంతకం | 50 kb కంటే తక్కువ | JPG/JPEG |
AP TET 2024 ఫోటో & సంతకం అప్లోడ్ విధానంలో చేయవలసినవి చేయకూడనివి (Do’s and Don’ts for AP TET Photograph & Signature)
AP TET 2024 కు అప్లై చేసుకునే విద్యార్థులు ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసే విషయంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించాలి.
- ఫోటో బ్యాగ్రౌండ్ వైట్‌గా ఉండాలి.
- పోలరాయిడ్ లేదా కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోలు వాడకూడదు.
- ఫోటో లో విద్యార్థి ముఖం స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి.
- సంతకం కోసం కేటాయించిన బాక్స్ లో మీ సంతకాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- మీ సంతకం లో పూర్తి పేరును కాపిటల్ లెటర్స్ లో వ్రాయకుడదు. అలా చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.
AP TET 2024 అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు (Important Instructions for AP TET Candidates)
AP TET 2024 కు అప్లై చేసే విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ వివరించబడ్డాయి.
- విద్యార్థులు ఫోటో, సంతకాన్ని పైన ఇచ్చిన స్పెసిఫికేషన్ కు సరిపడే సైజ్‌లోనే అప్‌లోడ్ చేయాలి.
- ఫోటో మరియు సంతకం స్కాన్ చేసిన తర్వాత ఎటువంటి లైట్ పాచెస్ లేకుండా చూడాలి.
- విద్యార్థులు వారి ఫొటో, సంతకం ధ్రువీకరించిన తర్వాత మాత్రమే వారి అప్లికేషన్ పూర్తి చేయడానికి కుదురుతుంది.
- విద్యార్థులు అప్‌లో.డ్ చేసిన సంతకం లేదా ఫోటో సరిగ్గా లేకపోతే వెనక్కి వెళ్లి మరోసారి స్కాన్ చేయవచ్చు.
AP TET 2024 కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి