TS AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips)

Guttikonda Sai

Updated On: August 18, 2023 01:54 pm IST

TS AGRICET 2023 పరీక్ష ఆగస్టు 26వ తేదీన జరగనున్నది, ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సమయానికి తగ్గట్టు ప్రిపరేషన్ స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. TS AGRICET 2023 పరీక్షకు అవసరమైన ప్రిపరేషన్ టిప్స్ ఈ ఆర్టికల్ లో చూడండి. 
TS AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips)

TS AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips in Telugu): బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం TS AGRICET 2023ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.  ఈ ఎగ్జామ్‌ ఆన్‌లైన్ పద్ధతిలోనే జరుగుతుంది. అభ్యర్థులు గంటన్నర వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఈ AGRICET కోసం చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. AGRICET కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ముందుగా AGRICET పరీక్షా సరళి, మార్కింగ్ స్కీమ్, దరఖాస్తు చేసుకున్న కోర్సు సిలబస్ గురించి  పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేందుకు విద్యార్థులు పాటించాల్సిన ప్రిపరేషన్ టిప్స్‌ని (TS AGRICET 2023 Preparation Tips in Telugu) ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.

తెలంగాణ అగ్రిసెట్ 2023 నోటిఫికేషన్ నెలలో విడుదల అయ్యింది. TS AGRICET 2023 పరీక్షకు 22 జూలై 2023 తేదీ వరకూ ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకోవచ్చు. TS AGRICET 2023 పరీక్షను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (PJTSAU) నిర్వహిస్తుంది. TS AGRICET 2023 పరీక్ష ద్వారా కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. TS AGRICET 2023 పరీక్ష ఆన్లైన్ మోడ్ లో తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. TS AGRICET 2023 పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. TS AGRICET 2023 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక క్రమ పద్దతిని పాటిస్తే పరీక్ష వ్రాయడం సులభంగా ఉంటుంది. అభ్యర్థులకు TS AGRICET 2023 ప్రిపరేషన్ సులభంగా ఉండడానికి ఈ ఆర్టికల్ లో ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips) వివరంగా అందించాము.

TS AGRICET ప్రిపరేషన్ ప్రక్రియ (TS AGRICET 2023 Preparation Process)

TS AGRICET 2023కు హాజరయ్యే విద్యార్థులు ప్రిపేర్ అయ్యే ముందుగా ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS AGRICET)కి హాజరవుతారు. అందుకే ఈ పరీక్షలో మంచి స్కోర్, ర్యాంకు సాధించేందుకు విద్యార్థులకు సరైన ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి.  గత సంవత్సరాల ట్రెండ్స్‌ను పరిశీలించాలి. సరైన స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ పుస్తకాలు,  గైడ్‌లను సమకూర్చుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
  • TS AGRICET పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్, సిలబస్ తెలుసుకోవాలి.
  • TS AGRICET కోసం అన్ని అధ్యయన సామగ్రిని పొందండి - ప్రిపరేషన్ పుస్తకాలు, మార్గదర్శకాలు.
  • నమూనా పత్రాలు, మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిష్కరించాలి.
  • వీలైనంత వరకు సిలబస్‌ని రివైజ్ చేయాలి.
  • తగినత విశ్రాంతి, విరామం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి - TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు

TS AGRICET 2023 మార్కింగ్ స్కీమ్ (TS AGRICET 2023 Marking Scheme)

TS AGRICET 2023 ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా TS AGRICET 2023 మార్కింగ్ స్కీమ్‌  (TS AGRICET 2023 Marking Scheme) గురించి పూర్తిగా తెలుసుకోవాలి.TS AGRICET 2023 పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి, ఎన్ని విభాగాలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఎన్ని మార్కులు  ఇస్తారనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దాంతో విద్యార్థుల సమయం వృథా అవ్వదు.TS AGRICET మార్కింగ్ స్కీమ్ ఈ దిగువున తెలిపిన విధంగా ఉంటుంది.
  • ప్రశ్నాపత్రంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి
  • ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది
  • నెగిటివ్ మార్కింగ్ ఉండదు. దాంతో అభ్యర్థులు ప్రతి ప్రశ్నను ప్రయత్నించవచ్చు.

TS AGRICET 2023 సిలబస్ (AGRICET 2023 Syllabus)

TS AGRICET 2023 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ముందుగా సిలబస్‌ గురించి తెలుసుకోవాలి. సిలబస్‌లో ప్రతి టాపిక్‌‌పై అవగాహన పెంచుకోవాలి. అగ్రికల్చర్  సీడ్ టెక్నాలజీ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు మొత్తం సిలబస్ తెలుసుకోవాలి.  ఈ దిగువున సిలబస్‌లోని ప్రధాన అంశాలను అందజేయడం జరిగింది.
  • వ్యవసాయ శాస్త్రం సూత్రాలు
  • మొక్కల పెంపకం, బయో-టెక్నాలజీ యొక్క ప్రాథమిక సూత్రాలు
  • నేల రసాయన శాస్త్రం, సంతానోత్పత్తి
  • ప్రాథమిక,  ప్రాథమిక రసాయన శాస్త్రం
  • కీటకాల శాస్త్రం, ఉత్పాదక కీటకాల శాస్త్రం సూత్రాలు
  • సమాచార నైపుణ్యాలు
  • ప్లాంట్ పాథాలజీ సూత్రాలు
  • పంట ఉత్పత్తి - I (తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు మేత)
  • ఎరువులు
  • పంటల తెగుళ్లు,  వాటి నిర్వహణ
  • ల్యాండ్ సర్వేయింగ్, సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్, గ్రీన్ హౌస్ టెక్నాలజీ
  • పంటల వ్యాధులు, వాటి నిర్వహణ
  • పంట ఉత్పత్తి - II
  • విత్తన ఉత్పత్తి, పరీక్ష, ధ్రువీకరణ
  • ఫీల్డ్ డయాగ్నోసిస్
  • వ్యవసాయ నిర్వహణ, వ్యవసాయ సహకారం, ఫైనాన్స్, మార్కెటింగ్
  • వ్యవసాయ శక్తి మరియు యంత్రాలు
  • పండ్లు, కూరగాయలు మరియు వాటి నిర్వహణ
  • ఫ్లోరికల్చర్, ల్యాండ్ స్కేపింగ్, మెడిసినల్ సుగంధ మొక్కలు
  • వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (TS AGRICET 2023 Passing Marks)

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, TS AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 100 మార్కులకు 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది.

TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.

కేటగిరీ

ఉత్తీర్ణత మార్కులు

జనరల్

25% (100 కు 25 మార్కులు)

SC/ST

కనీస ఉతీర్ణత మార్కులు లేవు

TS AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ (TS AGRICET 2023 Preparation Tips)

TS AGRICET 2023‌ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు పొందడానికి విద్యార్థులు మంచి  ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. విద్యార్థులు ప్రిపరేషన్ టిప్స్‌ని ఈ దిగువున అందజేయడం జరిగింది.
  • టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి: పరీక్షా విధానం, సిలబస్‌ గుర్తించి పూర్తిగా అర్థం చేసుకున్నారు. విద్యార్థులు మొదటగా టైమ్ టేబుల్ వేసుకోవాలి. అంటే విద్యార్థులు ఒక రోజు, ఒక వారం, ఒక నెలలో సిలబస్‌లో ఎన్ని అంశాలను కవర్ చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి. మొత్తం సిలబస్‌ను కవర్ చేయానికి ఇలాంటి  ఒక ప్రణాళిక కచ్చితంగా అవసరం. సరైన షెడ్యూల్‌ని రూపొందించుకుని ప్రతి సబ్జెక్టుకు, ప్రతి అంశానికి తగిన సమయం కేటాయించుకోవాలి. అలాగే షెడ్యూల్లో విద్యార్థులు విశ్రాంతి సమయాన్ని కూడా కేటాయించుకోవాలి. ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది.
  • పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి: TS  AGRICETలో మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిష్కరించడం ద్వారా ప్రవేశ పరీక్ష‌‌పై విద్యార్థులకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అందుకే పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం అనేది విద్యార్థులు తమ ప్రిపరేషన్‌లో భాగం చేసుకోవాలి. గత ప్రశ్నాపత్రాల ద్వారా పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్, ప్రశ్నల రకాలు గురించి పూర్తిగా అర్థం అవుతుంది.అదే సమయంలో మునుపటి సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పరిష్కరించడం ద్వారా విద్యార్థులు తమ సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోవచ్చు.
  • మంచి పుస్తకాలు ఏర్పాటు చేసుకోవాలి: దరఖాస్తు చేసుకున్న కోర్సు ప్రకారం వీలైనన్ని మంచి  పుస్తకాలను దగ్గర పెట్టుకోవాలి. ప్రిపరేషన్ పుస్తకాల ద్వారా టాపిక్స్‌ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. నిర్దేశిత సిలబస్‌లో పేర్కొనని మరింత సమాచారాన్ని పొందవచ్చు. పుస్తకాల్లో అన్ని అంశాలు ఉంటాయి. అలాంటి పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
  • రివిజన్: విద్యార్థులు తమ  ప్రిపరేషన్ ప్లాన్‌లో కచ్చితంగా రివిజన్‌ను భాగం చేసుకోవాలి. చదివిన అన్ని అంశాలను మళ్లీ రివైజ్ చేసుకోవాలి. ఇది మీరు చదివిన వాటిని బాగా గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు వ్యవసాయం అనే అంశాన్ని ఎంచుకుంటే దానికి సంబంధించిన టాపిక్‌లు, సబ్ టాపిక్‌లను తెలుసుకోవాలి. వాటిని పదే పదే చదువుతూ ఉండాలి.
  • విశ్రాంతి: ప్రిపరేషన్‌తో పాటు విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. అభ్యర్థులు వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి, విరామం లేకపోతే విద్యార్థులు అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది.  దాంతో చదివే అంశాలపై ఆసక్తి  ఉండదు. ఒత్తిడికి గురికాకుండా  విరామం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. తగినంత సేపు నిద్రపోవాలి.

TS AGRICET 2023 కౌన్సెలింగ్ (TS AGRICET 2023 Counselling)

TS AGRICET 2023 కౌన్సెలింగ్ ఆగస్టు 2023 నెలలో జరుగుతుంది. TS AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీన కౌన్సెలింగ్ కేంద్రంలో హాజరు అవ్వాలి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. విద్యార్ధులకు సీటు కేటాయించిన తర్వాత నిర్దిష్ట సమయంలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్‌లో College Dekho ని ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-agricet-preparation-tips/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Agriculture Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!