- TS AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( TS AGRICET 2023 …
- TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (TS AGRICET 2023 Passing Marks)
- TS AGRICET 2023 పరీక్ష విధానం 2023 (TS AGRICET 2023 Exam …
- TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు ( Documents …
- TS AGRICET 2023 కౌన్సెలింగ్ (TS AGRICET 2023 Counselling)
TS AGRICET ఉత్తీర్ణత మార్కులు 2023 : తెలంగాణ అగ్రిసెట్ 2023 నోటిఫికేషన్ నెలలో విడుదల అయ్యింది. TS AGRICET 2023 పరీక్షకు 22 జూలై 2023 తేదీ వరకూ ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకోవచ్చు. TS AGRICET 2023 పరీక్షను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (PJTSAU) నిర్వహిస్తుంది. TS AGRICET 2023 పరీక్ష ద్వారా కళాశాలల్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. TS AGRICET 2023 పరీక్ష ఆన్లైన్ మోడ్ లో తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. TS AGRICET 2023 పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కుల గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
TS AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( TS AGRICET 2023 Important Dates)
TS AGRICET 2023 పరీక్షకు గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
విషయం | తేదీ |
---|---|
TS AGRICET 2023 నోటిఫికేషన్ | 01 జూలై 2023 |
TS AGRICET 2023 కు అప్లై చేయడానికి చివరి తేదీ ( ఆలస్య రుసుము లేకుండా) | 22 జూలై 2023 |
TS AGRICET 2023 పరీక్ష తేదీలు | 26 ఆగష్టు 2023 |
TS AGRICET 2023 హాల్ టికెట్ విడుదల | 21 ఆగష్టు 2023 |
TS AGRICET 2023 ఫలితాలు | సెప్టెంబర్ 2023 |
TS AGRICET 2023 కౌన్సెలింగ్ | సెప్టెంబర్ 2023 |
TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (TS AGRICET 2023 Passing Marks)
TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, TS AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది.
TS AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.
కేటగిరీ | ఉత్తీర్ణత మార్కులు |
---|---|
ఓపెన్ కేటగిరీ | 25% (120 కు 30 మార్కులు) |
SC/ST | కనీస ఉతీర్ణత మార్కులు లేవు |
TS AGRICET 2023 పరీక్ష విధానం 2023 (TS AGRICET 2023 Exam Pattern)
TS AGRICET 2023 పరీక్ష విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
పరీక్ష మోడ్ | ఆన్లైన్ |
---|---|
మీడియం | ఇంగ్లీష్ మరియు తెలుగు |
పేపర్ల సంఖ్య | 1 |
ప్రశ్నల విధానం | మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు |
కేటాయించిన సమయం | 1 గంట 40 నిమిషాలు |
మొత్తం మార్కులు | 100 |
TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు ( Documents Required During TS AGRICET 2023 Application Process)
TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించే సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా ఈ క్రింద తెలుసుకోవచ్చు.
- 10వ తరగతి మార్క్స్ షీట్
- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన డిప్లొమా మార్క్స్ షీట్
- స్టడీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ( అవసరమైనచో)
- పాస్పోర్ట్ సైజు ఫోటో
- పేమెంట్ ఐడీ రసీదు
TS AGRICET 2023 కౌన్సెలింగ్ (TS AGRICET 2023 Counselling)
TS AGRICET 2023 కౌన్సెలింగ్ ఆగస్టు 2023 నెలలో జరుగుతుంది. TS AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీన కౌన్సెలింగ్ కేంద్రంలో హాజరు అవ్వాలి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. విద్యార్ధులకు సీటు కేటాయించిన తర్వాత నిర్దిష్ట సమయంలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
TS AGRICET 2023 గురించిన మరింత సమాచారం కోసం
CollegeDekho
ను చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ BSc అగ్రికల్చర్, BFSc, BVSc & AH అడ్మిషన్ 2025: తేదీలు, అర్హత ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియ
BSc అగ్రికల్చర్ అడ్మిషన్లు 2025 (BSc Agriculture Admissions 2025): ప్రవేశ పరీక్షలు, అర్హత, ఎలా దరఖాస్తు చేయాలి & అగ్ర కళాశాలలు
ANGRAU AP BSc అగ్రికల్చర్, హార్టికల్చర్ అడ్మిషన్ 2024: వెబ్ ఎంపికలు (OUT), రిజిస్ట్రేషన్, ఫీజు, సీట్ల కేటాయింపు, కౌన్సెలింగ్
ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ 2024 (AP EAPCET Agriculture 2024) హాల్ టికెట్లు రిలీజ్, మాక్ టెస్ట్, సిలబస్, అప్డేట్లు ఇక్కడ చూడండి
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ 2024 ఫలితాలు వచ్చేశాయ్ (TS EAMCET Agriculture 2024 ), కౌన్సెలింగ్ డేట్స్ ఇక్కడ చూడండి
BSc అగ్రికల్చర్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs after BSc Agriculture)