తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2023 ( TS Agriculture Polytechnic Admission 2023): దరఖాస్తు విధానం, కౌన్సెలింగ్ తేదీలు, కళాశాలల జాబితా, సీట్ మ్యాట్రిక్

Guttikonda Sai

Updated On: June 19, 2023 03:29 PM | TS POLYCET

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నీక్ నోటిఫికేషన్ ( TS Agriculture Polytechnic Admission 2023) SBTET  అధికారికంగా విడుదల చేసింది , 17 మే 2023 న పాలీసెట్ పరీక్ష జరిగింది .  పాలిటెక్నీక్ దరఖాస్తు విధానం, కౌన్సెలింగ్ తేదీలు, కళాశాలల జాబితా ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.

TS Agriculture Polytechnic Admission 2022 – Dates (Out), Application Form (Soon), Eligibility, Counselling, Colleges

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2023 ( TS Agriculture Polytechnic Admission 2023): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ(SBTET) అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ లకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. POLYCET ఎంట్రన్స్ పరీక్ష ను SBTET ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంది. తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2023 కోర్సులో జాయిన్ అవ్వడానికి విద్యార్థులు POLYCET ఎంట్రన్స్ పరీక్ష లో అర్హత సాధించాలి. ఈ ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సు కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2023 ( TS Agriculture Polytechnic Admission 2023) అడ్మిషన్ తేదీలు ఏప్రిల్ నెలలో ప్రకటించబడతాయి. సంబంధిత తేదీల ప్రకారం విద్యార్థులు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు.

ఈ పరీక్ష (TS POLYCET )  మే 17 2023 తేదీన జరిగింది . ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు అడ్మిషన్ పొందుతారు, జూన్ లేదా జూలై నెలలో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2023 ( TS Agriculture Polytechnic Admission 2023) కు సంబంధించిన ప్రవేశ పరీక్ష తేదీలు, దరఖాస్తు ఫారం, అడ్మిషన్ విధానం, కోర్సుల జాబితా, కౌన్సెలింగ్ విధానం మొదలైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ లో గమనించవచ్చు. తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కటాఫ్ వివరాలు త్వరలోనే అప్డేట్ చేయబడతాయి.

ఇది కూడా చదవండి: Diploma in Agriculture Course after Class 10

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ తేదీలు 2023 (TS Agriculture Polytechnic Admission Dates 2023)

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్( TS Agriculture Polytechnic Admission 2023) పొందడానికి దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు మొదలైన సమాచారం ఈ క్రింది పట్టికలో గమనించవచ్చు.

కార్యక్రమం

తేదీ

TS POLYCET రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ

16 జనవరి 2023

TS POLYCET కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)

ఫిబ్రవరి 2023

TS POLYCET కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ (ఆలస్య రుసుము రూ. 100తో)

ఫిబ్రవరి 2023

TS POLYCET 2023 పరీక్ష తేదీ

17 మే 2023

TS POLYCET ఫలితాల తేదీ

జూన్ 2023

కౌన్సెలింగ్ అప్లికేషన్ ప్రారంభ తేదీ

జూన్ 2023

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ

జూన్ 2023

TS అగ్రికల్చర్ డిప్లొమా కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ

జూన్ 2023

సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌లో సవరణ

జూన్ 2023

కౌన్సెలింగ్

జులై 2023



తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నీక్ కోర్సుల జాబితా(List of Agriculture Diploma Courses offered in Telangana)

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మరియు ఈ యునివర్సిటీ యొక్క అనుబంధ కళాశాలలు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. క్రింది ఇచ్చిన పట్టికలో తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల జాబితా అందించబడింది.

Diploma in Agriculture

డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ

డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్

డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (3 సంవత్సరాలు)

అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులు మాత్రమే మొదటి సంవత్సరం బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి అర్హులని అభ్యర్థులు గమనించాలి.

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ అర్హత ప్రమాణాలు 2023 (Eligibility Criteria of TS Agriculture Polytechnic Admission 2023)

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశం ( TS Agriculture Polytechnic Admission 2023)పొందడానికి విద్యార్థులకు కొన్ని అర్హతలు అవసరం. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్దేశించిన అర్హతలు క్రింద టేబుల్ లో గమనించవచ్చు.

ఫ్యాక్టర్ అర్హత ప్రమాణం

వయో పరిమితి

అభ్యర్థులు అడ్మిషన్ సంవత్సరం నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి, గరిష్ట వయోపరిమితి 22 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి విషయానికి వస్తే, డిసెంబర్ 31, 2000 మరియు డిసెంబర్ 31, 2007 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అర్హతలు

తెలంగాణలో 35% మార్కులతో 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. CBSE/ ICSE/ APOSS/ TOSS/ NIOS నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై తెలంగాణలో శాశ్వత నివాసితులు అయిన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు.

అర్హత మార్కులు

TS పాలిసెట్ 120 మార్కులకు నిర్వహించబడుతుంది మరియు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2023 కి అర్హత సాధించడానికి అభ్యర్థులు  120కి కనీసం 36 మార్కులను స్కోర్ చేయాలి.

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దరఖాస్తు ఫారం 2023(TS Agriculture Polytechnic Application Form 2023)

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దరఖాస్తు ఫారం 2023 ను SBTET విడుదల చేస్తుంది. విద్యార్థులు పైన చెప్పిన అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే మాత్రమే ఈ దరఖాస్తు పూర్తి చేయడం వీలు అవుతుంది. విద్యార్థులు తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అప్లికేషన్ ను (TS Agriculture Polytechnic Application Form 2023) ఆన్లైన్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో అవసరమైన ధృవీకరణ పత్రాలు కూడా దగ్గర ఉంచుకోవాలి. తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దరఖాస్తు పూర్తి చేసే విధానం క్రింది స్టెప్స్ లో వివరించబడింది.

స్టెప్ 1 : తెలంగాణ POLYCET అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

స్టెప్ 2 : ఇప్పుడు " Pay Application Fee" మీద క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.

స్టెప్ 3 : తర్వాత విద్యార్థి వ్యక్తిగత వివరాలు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మొదలైన సమాచారం ఎంటర్ చేయాలి.

స్టెప్ 4 : ఫీజు చెల్లించిన రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్త చేసుకోవాలి.

స్టెప్ 5 : ఇప్పుడు " Fill Application Form" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి .

స్టెప్ 6 : దరఖాస్తు లో అడిగిన సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, 10 వ తరగతి హాల్ టికెట్ నెంబర్ మొదలైన సమాచారం ఎంటర్ చేయండి.

స్టెప్ 7 : విద్యార్థులు దరఖాస్తు ఫారం ను జాగ్రత్తగా పూర్తి చేయాలి, అన్ని వివరాలు పూర్తి చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.

స్టెప్ 8 : పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

స్టెప్ 9 : భవిష్యత్తు అవసరాల కోసం ఈ ప్రింట్ అవుట్ ను జాగ్రత్తగా ఉంచుకోండి.

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ విధానం 2023 (TS Agriculture Polytechnic Counselling Process 2023)

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశం ( TS Agriculture Polytechnic Admission 2023) పొందడానికి విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ విధానం గురించి ఈ క్రింద వివరించబడింది.

స్టెప్ 1 : రిజిస్ట్రేషన్(Registration)

విద్యార్థులు ఈ ఆర్టికల్ లో అందించిన లింక్ ఓపెన్ చేసి తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కోసం రిజిష్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ( జనరల్ కేటగిరీ విద్యార్థులు 1100/- మరియు SC/ST విద్యార్థులు 600/- రూపాయలు) . ఫీజు చెల్లించిన తర్వాత వారి POLYCET హాల్ టికెట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

స్టెప్ 2 : సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification)

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన విద్యార్థులు వారి సర్టిఫికెట్స్ వెరిఫై చేపించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం విద్యార్థులు వారికి కేటాయించిన హెల్ప్ లైన్ కేంద్రాలకు తప్పని సరిగా వెళ్ళాలి. ఈ హెల్ప్ లైన్ కేంద్రాలలో సంబంధిత అధికారుల చేత విద్యార్థుల సర్టిఫికెట్స్ వెరిఫై చేయబడతాయి.

స్టెప్ 3 : వెబ్ ఆప్షన్స్ (Web Options)

విద్యార్థులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వారికి ఇచ్చిన లాగిన్ ఐడీ ను ఉపయోగించి కౌన్సెలింగ్ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. ఈ వెబ్సైట్ లో విద్యార్థులు వారికి కావాల్సిన కోర్సు మరియు కాలేజీ లను ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ 4 : సీట్ల కేటాయింపు(Seat Allotment)

తెలంగాణ POLYCET పరీక్ష ద్వారా అర్హత పొందిన విద్యార్థులు వారికి వచ్చిన రాంక్ మరియు వారు ఎంపిక చేసుకున్న వెబ్ ఆప్షన్స్ ద్వారా కళాశాల లో సీట్ కేటాయించబడుతుంది. నిర్దిష్ట తేదీలోపు విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ తేదీలు 2023 (TS Agriculture Polytechnic Counselling Dates 2023)

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగే తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరించబడ్డాయి.

కార్యక్రమం తేదీలు మరియు సమయం

కౌన్సెలింగ్ అప్లికేషన్ ప్రారంభ తేదీ

జూన్ 2023

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ

జూన్ 2023

TS అగ్రికల్చర్ డిప్లొమా కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ

జూన్ 2023

సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌లో సవరణ

జూన్ 2023

కౌన్సెలింగ్

జులై 2023

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల జాబితా & సీట్ మ్యాట్రిక్స్ (List of Agriculture Polytechnic Colleges in Telangana & Seat Matrix)

తెలంగాణ రాష్ట్రంలోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల జాబితా మరియు కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు క్రింది పట్టిక లో గమనించవచ్చు.

కళాశాల పేరు & లొకేషన్

మొత్తం సీట్ల సంఖ్య

పూజ్య శ్రీ మాధవంజీ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, అశ్వారావుపేట

60

బడే కోటయ్య మెమోరియల్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పోలేనిగూడెం

60

మదర్ థెరిసా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, సత్తుపల్లి

60

రత్నపురి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, తుర్కల ఖానాపూర్

60

శివ కేశవ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పంచగామ, నారాయణఖేడ్

60

సాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్, చేవెళ్ల

60

డాక్టర్ డి. రామా నాయుడు విజ్ఞాన జ్యోతి వ్యవసాయ పాలిటెక్నిక్, తునికి

60

అగ్రిల్. పాలిటెక్నిక్, మాల్తుమ్మెడ

20

అగ్రిల్. పాలిటెక్నిక్, జమ్మికుంట

20

అగ్రిల్. పాలిటెక్నిక్, తోర్నాల

40

అగ్రిల్. పాలిటెక్నిక్, జోగిపేట్

20

అగ్రిల్. పాలిటెక్నిక్, మధిర

20

అగ్రిల్. పాలిటెక్నిక్, బసంత్‌పూర్

20

అగ్రిల్. పాలిటెక్నిక్, కంపాసాగర్

20

అగ్రిల్. పాలిటెక్నిక్, పోలాస

20

అగ్రిల్. పాలిటెక్నిక్, పాలెం

20

సీడ్ టెక్నాలజీ  స్ట్రీమ్ అందించే తెలంగాణ కళాశాలల జాబితా (Diploma in Seed Technology Colleges in Telangana)

ఈ క్రింద ఇవ్వబడిన పట్టికలో తెలంగాణాలో సీడ్ టెక్నాలజీ స్ట్రీమ్ అందించే కళాశాలల జాబితా గమనించవచ్చు.

కళాశాల పేరు & లొకేషన్

మొత్తం సీట్ల సంఖ్య

డాక్టర్ డి.రామా నాయుడు విజ్ఞాన జ్యోతి సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్, తునికి

60

సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్, రుద్రూర్

20

ఆర్గానిక్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అందించే తెలంగాణ కళాశాలల జాబితా (Diploma in Organic Agriculture Colleges in Telangana)

ఆర్గానిక్ అగ్రికల్చర్ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వాలి అనుకునే విద్యార్థులు క్రింద ఇవ్వబడిన కళాశాలల జాబితా గమనించవచ్చు.

కళాశాల పేరు  &  లొకేషన్

మొత్తం సీట్ల సంఖ్య

ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్, గింగుర్తి

60

అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అందించే తెలంగాణ కళాశాలల జాబితా (Diploma in Agricultural Engineering Colleges in Telangana)

క్రింద ఇవ్వబడిన పట్టికలో తెలంగాణాలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అందించే కళాశాలల జాబితా గమనించవచ్చు

కళాశాల పేరు & లొకేషన్

మొత్తం సీట్ల సంఖ్య

రత్నపురి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, తుర్కల ఖానాపూర్

30

మదర్ థెరిసా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, సత్తుపల్లి

30

డాక్టర్ డి. రామా నాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, తునికి

30

ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, రాజేంద్రనగర్

20








పైన పేర్కొన్న అన్ని కళాశాలలో హాస్టల్ సదుపాయం ఉండకపోవచ్చు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము.

తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ 2023( TS Agriculture Polytechnic Admission 2023)కి సంబంధించిన ఈ కథనం మీకు ఉపయోగకరంగా  ఉంటుందని మేము ఆశిస్తున్నాము. తెలంగాణా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 2023కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం CollegeDekho కు చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-agriculture-polytechnic-admission/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Agriculture Colleges in India

View All
Top