ఇక్కడ మేము TS EDCET 2024 యొక్క ముఖ్యమైన సూచనలను ఇక్కడ తెలియజేశాం..
TS EDCET 2024లో అర్హత ప్రమాణాలు (Eligibility Criteria of TS EDCET 2024)
పూర్తి అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు రెండేళ్ల B.Ed కోర్సులో అడ్మిషన్ కోసం TS Ed.CET-2024ని రాయవచ్చు. వ్యక్తి తప్పనిసరిగా భారతీయ మూలానికి చెందినవారై ఉండాలి. తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (అడ్మిషన్ రెగ్యులేషన్) ఆర్డర్, 1974లో పేర్కొన్న విధంగా 'స్థానిక' / 'నాన్-లోకల్' స్థితికి సంబంధించిన షరతులను అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలి.
TS EDCET 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for TS EDCET 2024)
దరఖాస్తుదారులు తమ TS EDCET 2024 అప్లికేషన్ ఫార్మ్‌ని ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ edcet.tsche.ac.in ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత దరఖాస్తుదారులు తప్పనిసరిగా అన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
TS EDCET 2024 పరీక్షా సరళి (Exam Pattern of TS EDCET 2024)
పరీక్షా విధానాన్ని ముందుగా తెలుసుకోవడం దరఖాస్తుదారులకు పరీక్షకు ప్రీపేర్ అవ్వొచ్చు. సాధారణ అడ్మిషన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. అభ్యర్థి ఐదు ప్రధాన కేటగిరీల నుంచి 150 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానం ఇవ్వాలి.
TS EDCET 2024లో సిలబస్ (Syllabus of TS EDCET 2024)
పరీక్ష సన్నాహాలను ప్రారంభించే ముందు విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్ష సిలబస్‌ని గమనించాలి. TS EDCET 2024లో ఐదు విభాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ ఎబిలిటీ సెక్షన్ (మ్యాథ్స్, సామాజిక అధ్యయనాలు, సైన్స్) కోసం ప్రశ్నలు పదో తరగతి స్థాయికి అనుగుణంగా ఉంటాయి.
ఇతర విభాగాలలో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూలు, కంప్యూటర్ అవేర్‌నెస్ ఉంటాయి.
TS EDCET 2024లో పాల్గొనే కాలేజీలు (Participating Colleges of TS EDCET 2024)
ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థులు అడ్మిషన్ కోసం TS EDCET 2024 participating collegesలో దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కాలేజీలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య పరిమితం చేయబడినందున విద్యార్థులు వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలి. కళాశాలను ఎంచుకునే ముందు, దరఖాస్తుదారులు మొత్తం TS EDCET కౌన్సెలింగ్ ప్రక్రియను, కటాఫ్‌ల గురించి తెలుసుకోవాలి.
TS EDCET 2024 ప్రిపరేషన్ (TS EDCET 2024 Preparation)
దరఖాస్తుదారులు తప్పనిసరిగా ప్రభావవంతమైన preparation strategyని రూపొందించాలి. ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించడానికి మంచి స్కోర్ సాధించడానికి ప్రిపరేషన్ వ్యవధిలో దానికి కట్టుబడి ఉండాలి. Mock tests ,sample papers నుండి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం. రివిజన్ చేయడం విజయానికి కీలకం.
TS EDCET 2024 ఫలితాలు (TS EDCET 2024 Result)
TS EDCET 2024 result మార్కులు రూపంలో, ర్యాంకుల రూపంలో ఉంటుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. TS EDCET పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన, చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరు కావాలి.