TS EDCET 2023 ఫలితాలు (TS EDCET 2023 Result), ర్యాంక్ కార్డ్‌ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Updated By Andaluri Veni on 04 Jan, 2024 10:24

Your Ultimate Exam Preparation Guide Awaits!

TS EDCET 2023 ఫలితాలు

TS EDCET 2023 ఫలితం (TS EDCET 2023 Result): TS EDCET 2023 ఫలితాలు జూన్ 2023 నెలలో విడుదలవుతాయి. TS EDCET 2023  ఫలితాలు, మార్కులు,  ర్యాంకుల రూపంలో ప్రకటించబడుతుందని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి. TS EDCET ఆశావహులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి ఈ పేజీలో అందించబడే డైరెక్ట్ లింక్‌ని అందజేయడం జరిగింది.  టీఎస్ ఎడ్‌సెట్ 2023 పరీక్ష మే 18, 2023న జరిగింది.

TS EDCET 2023 ఫలితాన్ని (TBA) చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్TS EDCET 2023 ఫలితాల ర్యాంక్ కార్డ్ (TBA)ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్

అభ్యర్థులు ఇద్దరూ TS EDCET పరీక్షలో ఉత్తీర్ణులై, చెల్లుబాటు అయ్యే ర్యాంక్‌ను పొందినట్లయితే మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియకు అర్హత పొందుతారు.

Upcoming Education Exams :

TS EDCET 2023 ఫలితాల విడుదల తేదీ

TS EDCET 2023 ఫలితాలకు సంబంధించి అభ్యర్థులు అంచనా తేదీలు గురించి తెలుసుకోవడం అవసరం. ముఖ్యమైన తేదీలు ఈ దిగువన టేబుల్లో ఇవ్వబడింది:

ఈవెంట్

తేదీలు

పరీక్ష తేదీ

మే 18, 2023

TS EDCET 2023 ఫలితాల ప్రకటన

జూన్ 2023

TS EDCET 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా

TS EDCET 2023 ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువున ఇచ్చిన విధానాన్ని ఫాలో అవ్వాలి. 

  • అభ్యర్థులు TS EDCET 2023 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  • వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ర్యాంక్ కార్డును చెక్ చేయడానికి లింక్ ఉంటుంది.

  • అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

  • లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా హాల్ టికెట్ నంబర్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ వంటి నిర్దిష్ట ఆధారాలను అడిగే పేజీ తెరవబడుతుంది.

  • అభ్యర్థులు అడిగిన సమాచారాన్ని పూరించి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • ఆధారాలను సమర్పించడం వల్ల స్క్రీన్‌పై ఫలితం ప్రదర్శించబడుతుంది.

  • TS EDCET 2023 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

  • అభ్యర్థులు తదుపరి ఉపయోగం కోసం ప్రింటౌట్‌లను కూడా తీసుకోవాలి.

ఇలాంటి పరీక్షలు :

TS EDCET 2023 ఫలితంలో ఉండే వివరాలు

TS EDCET ఫలితం చాలా ముఖ్యమైన పత్రంగా పరిగణించబడుతుంది. TS EDCET స్కోర్ కార్డులో అభ్యర్థులకు సంబంధించిన అనేక వివరాలు ఉంటాయి. అందులో ఉండే వివరాలు ఈ దిగువున జాబితా చేశాం. 

  • అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ 

  • అభ్యర్థుల నమోదు సంఖ్య

  • అభ్యర్థి పేరు

  • తల్లిదండ్రుల పేర్లు

  • అభ్యర్థి సెల్ ఫోన్ నెంబర్

  • అభ్యర్థి చిరునామా

  • అభ్యర్థి స్కోర్ చేసిన మార్కులు 

  • అభ్యర్థి సాధించిన ర్యాంక్ 

  • అభ్యర్థి ఫోటో

TS EDCET 2023 ఫలితం - టై బ్రేకింగ్ పాలసీ

ముందుగా చెప్పినట్లుగా TS EDCET 2023 ఎంట్రన్స్‌లో అభ్యర్థులు స్కోర్ చేసిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేయబడుతుంది. అయితే ఇద్దరు అభ్యర్థులు ఒకే మార్కులు స్కోర్ చేసినప్పుడు మెరిట్ లిస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారనే అనుమానం తలెత్తుంది. అలాంటప్పుడు, ప్రశ్నపత్రంలోని పార్ట్ సీలో వారు స్కోర్ చేసిన మార్కులు పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఇంకా టై అయితే ర్యాంక్ జాబితాను సిద్ధం చేయడానికి పార్ట్ Aలో అభ్యర్థులు స్కోర్ చేసిన మార్కులు పరిగణనలోకి తీసుకోబడుతుంది.

పై పేరాలో పేర్కొన్న విధానాలను అనుసరించినా ఇంకా టై అయితే అభ్యర్థుల వయస్సును పరిగణలోకి తీసుకుంటారు.

TS EDCET 2023 కౌన్సెలింగ్

TS EDCET 2023 ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు మెరిట్ లిస్ట్‌‌లో ఉన్న అభ్యర్థులు TS EDCET కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి. కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే సీట్ల కేటాయింపు జరుగుతుంది.

Want to know more about TS EDCET

Still have questions about TS EDCET Result ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top