TS AGRICET హాల్ టికెట్ 2023 (TS AGRICET Hall Ticket 2023 ) డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Updated By Guttikonda Sai on 21 Aug, 2023 19:01

Predict your Percentile based on your TS AGRICET performance

Predict Now

TS AGRICET హాల్ టికెట్ 2023

TS AGRICET హాల్ టికెట్ 2023ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 21 ఆగస్టు, 2023న విడుదల చేస్తారు. TS AGRICET పరీక్ష 2023 ఆగస్టు 26, 2023న నిర్వహించబడుతుంది. దీని కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు TS AGRICET 2023 పరీక్ష అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మేము TS AGRICET హాల్ టికెట్ 2023 విడుదల అయ్యింది, అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వారి హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TS AGRICET హాల్ టికెట్ 2023 కోసం డైరెక్ట్ లింక్ - యాక్టివేట్ చేయబడింది

అభ్యర్థులందరూ పరీక్ష హాల్‌కు TS AGRICET హాల్ టికెట్ 2023ని తీసుకువెళ్లడం తప్పనిసరి. TS AGRICET హాల్ టికెట్ 2023 లేకుండా అభ్యర్థులు ఎవరూ పరీక్ష హాల్లోకి అనుమతించబడరు. TS AGRICET 2023 హాల్ టికెట్ TS AGRICET 2023 పరీక్షకు సంబంధించి వివిధ ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది. TS AGRICET హాల్ టికెట్ 2023, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ పేజీని చెక్ చేయవచ్చు. 

Upcoming Agriculture Exams :

  • BCECE

    Exam date: 01 Jul, 2024

TS AGRICET హాల్ టికెట్ తేదీలు 2023

TS AGRICET హాల్ టికెట్ 2023 కోసం ముఖ్యమైన తేదీలుఈ దిగువున ఇవ్వబడ్డాయి. 

ఈవెంట్స్

తేదీలు

TS AGRICET 2023 విడుదల హాల్ టికెట్

21 ఆగస్టు 2023 (సాయంత్రం 04:00)

TS AGRICET 2023 పరీక్ష

26 ఆగస్టు 2023

TS AGRICET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

అభ్యర్థులు TS AGRICET 2023 హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువ ఇచ్చిన సూచనలను అనుసరించవచ్చు:

  1. TS AGRICET అధికారిక సైట్‌ని సందర్శించండి లేదా పైన సెక్షన్‌లో అప్‌డేట్ చేసిన డైరెక్ట్ లింక్‌ని ఉపయోగించండి.

  2. వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత TS AGRICET హాల్ టికెట్ 2023 కోసం లింక్‌పై క్లిక్ చేయండి.

  3. మీ TS AGRICET రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయండి.

  4. TS AGRICET 2023 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డౌన్‌లోడ్ హాల్ టికెట్ / హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయండి.

  5. భవిష్యత్ ప్రయోజనాల కోసం TS AGRICET హాల్ టికెట్ 2023 కనీసం రెండు, మూడు కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

TS AGRICET హాల్ టికెట్ 2023కి సంబంధించిన ముఖ్యమైన సూచనలు

అభ్యర్థులు TS AGRICET 2023 హాల్ టికెట్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలను ఈ దిగువున చూడవచ్చు:

  • అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ని పరీక్ష హాల్‌కు తీసుకువెళ్లాలి. లేదంటే వారు పరీక్షకు రాసేందుకు అనుమతించబడరు.

  • TS AGRICET హాల్ టికెట్ 2023 తప్పనిసరిగా హార్డ్ కాపీలో ఉండాలి. సాఫ్ట్ కాపీ ఏదీ అంగీకరించబడదు.

  • అభ్యర్థులు ఎప్పుడు అడిగినా హాల్ టికెట్ పరీక్ష ఇన్విజిలేటర్‌కు చూపించాల్సి ఉంటుంది.

  • ఒకవేళ అభ్యర్థి TS AGRICET 2023 హాల్ టికెట్‌‌ని పోగొట్టుకున్నట్లయితే, అతను/ఆమె TS AGRICET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి అదే లింక్‌ను సందర్శించి, అదే విధానాన్ని అనుసరించడం ద్వారా దాన్ని మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Want to know more about TS AGRICET

FAQs about TS AGRICET Admit Card

నేను TS AGRICET హాల్ టికెట్‌ని పోస్ట్ ద్వారా పొందవచ్చా?

లేదు, అభ్యర్థులు TS AGRICET హాల్ టికెట్‌ని ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

TS AGRICET హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి చివరి తేదీ ఏమిటి?

TS AGRICET కోసం హాల్ టికెట్‌ని పరీక్ష జరిగే ముందు రోజు వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS AGRICET హాల్ టికెట్‌ని ఎక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?

అభ్యర్థులు TS AGRICET హాల్ టికెట్‌ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS AGRICET హాల్ టికెట్ ఎప్పుడు విడుదల అవుతుంది?

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత TS AGRICET హాల్ టికెట్ విడుదల చేయబడుతుంది.

Still have questions about TS AGRICET Admit Card ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!