TS AGRICET 2023 అర్హత ప్రమాణాలు (TS AGRICET 2023 Eligibility Criteria) వయో పరిమితి, అర్హత

Updated By Andaluri Veni on 20 Oct, 2023 06:10

Predict your Percentile based on your TS AGRICET performance

Predict Now

TS AGRICET 2023 అర్హత ప్రమాణాలు

TS AGRICET 2023 పరీక్ష అర్హత ప్రమాణాలను హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విడుదల చేసింది. apply for TS AGRICET 2023 కోరుకునే అభ్యర్థులందరూ పరీక్షకు దరఖాస్తు చేసే ముందు పూర్తి అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి. అన్ని అవసరమైన TS AGRICET 2023 అర్హత అవసరాలను పూర్తి చేసే అభ్యర్థులు మాత్రమే టీఎస్‌ అగ్రిసెట్‌ ఎగ్జామ్‌కి హాజరు అవ్వొచ్చు. 

అభ్యర్థులు TS AGRICET అర్హత ప్రమాణాలు 2023కి సంబంధించి పూర్తి వివరాలను పొందడానికి ఈ కింది పేజీని చెక్ చేయవచ్చు. 

TS AGRICET అర్హత ప్రమాణాలు 2023- వివరాలు

ఈ కింద ఇవ్వబడిన TS AGRICET 2023 అర్హత ప్రమాణాలు :

  • అభ్యర్థి తప్పనిసరిగా PJTSAU / ANGRAU నుంచి అగ్రికల్చర్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

లేదా

  • అభ్యర్థి తప్పనిసరిగా PJTSAU / ANGRAU నుంచి సీడ్ టెక్నాలజీలో డిప్లొమా పాసై ఉండాలి.

లేదా

  • అభ్యర్థి తప్పనిసరిగా PJTSAU నుంచి ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా ANGRAU నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్‌లో డిప్లొమా పాసై ఉండాలి. 

  • అభ్యర్థి అర్హత పరీక్ష స్థాయిలో అన్ని సబ్జెక్టులలో పాసై ఉండాలి.

  • చివరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కూడా TS AGRICET పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

TS AGRICET 2023కి వయోపరిమితి

TS AGRICET 2023 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు TS AGRICET 2023 పరీక్షకు దరఖాస్తు చేయడానికి వయోపరిమితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. TS AGRICET పరీక్ష 2023 కోసం వివిధ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితి ఈ కింది ఇవ్వబడింది. 

కేటగిరి

జనరల్/ OBC

SC/ST

PH

తక్కువ వయస్సు పరిమితి

17 సంవత్సరాలు

17 సంవత్సరాలు

17 సంవత్సరాలు

గరిష్ట వయో పరిమితి

22 సంవత్సరాలు

26 సంవత్సరాలు

28 సంవత్సరాలు

ఇలాంటి పరీక్షలు :

TS AGRICET రిజర్వేషన్

తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం 85 శాతం సీట్లు స్థానిక అభ్యర్థులకు, 15 శాతం సీట్లు అన్‌రిజర్వ్‌డ్ కోటా కింద పరిగణించబడతాయి.

Want to know more about TS AGRICET

FAQs about TS AGRICET Eligibility

నేను డిప్లొమా చివరి సంవత్సరంలో ఉన్నాను. నేను TS AGRICET కోసం దరఖాస్తు చేయవచ్చా?

అవును, డిప్లొమా చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు కూడా TS AGRICETకి దరఖాస్తు చేసుకోవచ్చు.

TS AGRICET కోసం దరఖాస్తు చేయడానికి వయోపరిమితి ఎంత?

TS AGRICET కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి  వయస్సు 17 ఏళ్లు ఉండాలి. 22 ఏళ్లు మించకూడదు. (SC/ST కోసం 26 సంవత్సరాలు, PH కోసం 28 సంవత్సరాలు).

PJTSAU / ANGRAU నుంచి అతని/ఆమె డిప్లొమాను పూర్తి చేయని విద్యార్థి TS AGRICETకి దరఖాస్తు చేయవచ్చా?

లేదు, TS AGRICETకి అర్హత పొందడానికి అభ్యర్థులు PJTSAU / ANGRAU నుంచి అతని/ఆమె డిప్లొమాను అభ్యసించడం తప్పనిసరి.

TS AGRICETకి అర్హత పొందడానికి డిప్లొమాలో ఎన్ని మార్కులు అవసరం?

TS AGRICETకి అర్హత పొందడానికి మీరు అర్హత పరీక్ష స్థాయిలో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కావాలి.

నేను PCMలో ఇంటర్ పూర్తి చేశాను. నేను TS AGRICET ద్వారా అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌కి అడ్మిషన్ పొందవచ్చా?

లేదు, అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే TS AGRICETకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Still have questions about TS AGRICET Eligibility ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top