TS AGRICET 2025 Registration - Application Date, Link, Fees, Documents Required, How to Apply

Updated By Andaluri Veni on 20 Oct, 2023 06:10

Predict your Percentile based on your TS AGRICET performance

Predict Now

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ 01 జులై 2023న విడుదల చేయబడింది. TS AGRICET అప్లికేషన్ ఫార్మ్‌లో అన్ని వివరాలు ఇచ్చి ఆన్‌లైన్ మోడ్‌లో 22 జూలై 2023వ తేదీ కల్లా సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు టీఎస్‌ అగ్రిసెట్‌ 2023 పరీక్షకు హాజరు కావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడానికి ముందు అభ్యర్థులు అవసరమైన అన్ని వ్యక్తిగత, విద్యావిషయక వివరాలను దగ్గర ఉంచుకోవాలి. దీంతో TS AGRICET 2023 నమోదు ప్రక్రియ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని  TS AGRICET అప్లికేషన్ ఫార్మ్ 2023 ఈ పేజీలో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు TS AGRICET eligibility criteriaని కూడా చెక్ చేయవచ్చు. TS AGRICET అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ ఈ దిగువన అందించబడింది.

Direct Link Fill TS AGRICET Application Form 2023 - యాక్టివేట్ చేయబడింది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం TS AGRICET 2023 అధికారిక నోటిఫికేషన్‌ను ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు 22 జూలై 2023 (సాయంత్రం 04:00) వరకు ఆలస్య ఫీజు లేకుండా దరఖాస్తును పూరించవచ్చు. ఆలస్య ఫీజుతో దరఖాస్తులను సబ్మిట్ చేయడానికి 23 జూలై 2023 (10:30 AM) నుంచి 24 జూలై 2023 (04:00 PM) వరకు టైమ్ ఉంది.

TS AGRICET 2023 నమోదు తేదీలు

TS AGRICET అప్లికేషన్ ఫార్మ్ 2023కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ కింద హైలైట్ చేయబడ్డాయి:

ఈవెంట్స్

తేదీలు

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల

01 జూలై 2023 (ఉదయం 10:30)

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ (ఆలస్య ఫీజు లేకుండా)

22 జూలై 2023 (04:00 PM)

ఆలస్య ఫీజుతో TS AGRICET 2023 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్

23 జూలై 2023 (ఉదయం 10:30) నుంచి 24 జూలై 2023 (సాయంత్రం 04:00)

TS AGRICET 2023 పరీక్ష తేదీ

26 ఆగస్టు 2023 (09.00 AM - 10:40 AM)

Release of TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్

01 జూలై 2023 10:30 AM

ఎటువంటి ఆలస్య ఫీజు లేకుండా  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 

22 జూలై 2023  4:00 PM

ఆలస్య రుసుముతో TS AGRICET 2023కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ

23 జూలై 2023 10:30 AM to 24 జూలై 2023 04:00 PM 

TS AGRICET 2023 పరీక్ష తేదీ

26 ఆగస్ట్ 2023 9.00 AM - 10:40 AM 

TS AGRICET 2023 దరఖాస్తు ఫీజు

వివిధ కేటగిరీల కోసం TS AGRICET 2023 కోసం దరఖాస్తు ఫీజు ఈ దిగువున ఇవ్వబడింది:

దరఖాస్తుదారు కేటగిరి

దరఖాస్తు ఫీజు

ఆలస్య రుసుముతో దరఖాస్తు ఫీజు

OC (ఓపెన్ కేటగిరీ) మరియు BC (వెనుకబడిన తరగతులు) దరఖాస్తుదారులు

1400/-

2100/-

SC / ST / PH దరఖాస్తుదారులు

700/-

1050/-

గమనిక - దరఖాస్తుదారు NET బ్యాంకింగ్ / డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ (వీసా / మాస్టర్ కార్డ్) ఉపయోగించి TS AGRICET దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు.

ఇలాంటి పరీక్షలు :

TS AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి?

అభ్యర్థులు TS AGRICET అప్లికేషన్ ఫార్మ్ 2023ని పూరించడానికి ఈ కింద పేర్కొన్న వాటిని అనుసరించాలి:

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా ఈ ఆర్టికల్లో అందించిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.

  2. వెబ్‌సైట్ ప్రధాన పేజీలో, “TS AGRICET రిజిస్ట్రేషన్” కోసం లింక్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి

  3. అవసరమైన మొత్తం సమాచారాన్ని ఉపయోగించి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోండి.

  4. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను యాక్సెస్ చేయడానికి మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

  5. మీ డాక్యుమెంట్‌లలో ఇచ్చిన మొత్తం సమాచారాన్ని ఉపయోగించి ఫార్మ్‌ను పూరించండి.

  6. రిజిస్ట్రేషన్ ఫీజు కోసం డెబిట్/క్రెడిట్/నెట్ బ్యాంకింగ్ మోడ్‌ని ఉపయోగించి TS AGRICET 2023 దరఖాస్తు ఫీజును చెల్లించండి.

  7. తదుపరి సూచన కోసం ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.

Want to know more about TS AGRICET

FAQs about TS AGRICET Application Form

TS AGRICETకి దరఖాస్తు ఫీజు ఉందా?

 TS AGRICET కోసం దరఖాస్తు ఫీజు OC, BC దరఖాస్తుదారులకు రూ.1200. SC / ST / PH దరఖాస్తుదారులకు రూ.600.

నేను TS AGRICET కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చా?

TS AGRICET కోసం ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఏదీ అంగీకరించబడదు.

నేను TS AGRICET కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించడం ద్వారా TS AGRICET కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Still have questions about TS AGRICET Application Form ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top