TS EAMCET 2024కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?
TS EAMCET పరీక్ష 2024ని ఛేదించడానికి అభ్యర్థులందరూ పరీక్ష విధానంపై సిలబస్‌పై సమగ్ర అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. అదే సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం తెలుసుకుని ఉండాలి. దీనికోసం అభ్యర్థులు సరైన, సమగ్ర స్టడీ ప్లాన్ చేసుకోవాలి. పటిష్టమైన స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవాలి. అందులో రివిజన్, మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడం, మునుపటి సంవత్సరం ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం కూడా ఉండాలి. అభ్యర్థులు పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలో? కొన్ని అంశాలను దిగువున అందజేశాం.
పరీక్షా సరళిపై స్పష్టమైన అవగాహన, సిలబస్ (Clear understanding of the exam pattern and syllabus)
TS EAMCET 2024 పరీక్షలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి సిలబస్, పరీక్షా సరళిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. TS EAMCET సిలబస్ విద్యార్థులు తప్పక క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రశ్నపత్రాలలో కవర్ చేయబడే విషయాలను వారికి తెలియజేస్తుంది. పరీక్షలో ఉండే ప్రశ్నల రకాలు, స్కోరింగ్ విధానం మరియు మునుపటి సంవత్సరాల నుంచి ప్రశ్నల సరళి గురించి సమాచారం కోసం విద్యార్థులు తప్పనిసరిగా TS EAMCET పరీక్షా సరళిని కూడా అర్థం చేసుకోవాలి.
రివిజన్ చేసుకోవాలి (Revise appropriately)
అధ్యయనం, రివజిన్ రెండూ కీలకమైనవి. ఒక విద్యార్థి పరీక్ష సమయంలో చదివిన అంశాలను మళ్లీ మళ్లీ చదవకపోతే కీలకమైన అంశాలను మరిచిపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు చదివిన తర్వాత TS EAMCET అంశాలను క్రమం తప్పకుండా రివిజన్ చేసుకోవాలని నిపుణులు సూచించారు. మరుసటి రోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకునే ముందు, ముందు రోజు నుంచి విషయాలను అధ్యయనం చేయడం మంచిది.
టైం టేబుల్ని అనుసరించండి (Follow a time table)
విద్యార్థులు తమ అధ్యయన షెడ్యూల్‌ను నిర్వహించడానికి ఉత్తమ మార్గం టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండటం. విరామాలు, పాఠ్యేతర కార్యకలాపాలకు తగిన సమయంతో టైమ్‌టేబుల్‌ను రూపొందించడం ఉత్తమ సలహా. మొత్తం నాలుగు సబ్జెక్టులకు, ప్రతి టాపిక్‌కు తగిన సమయాన్ని ఇవ్వండి.
చివరి నిమిషంలో ఏదైనా కొత్త విషయాలను చదవడం మానుకోండి (Avoid studying anything new in the last minute)
మీ ప్రిపరేషన్ చివరి కొన్ని రోజులలో ఏదైనా సబ్జెక్ట్ నుంచి ఏదైనా కొత్త అంశాలను జోడించడం మానుకోవాలి. ఇది గందరగోళానికి దారి తీస్తుంది. అభ్యర్థులు వారు ఇప్పటికే కవర్ చేసిన యూనిట్లు, టాపిక్‌లు, సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి తమ సమయాన్ని వెచ్చించాలి. అభ్యర్థులు చివరి వారంలో రివైజ్డ్ సిలబస్‌లో పట్టుదలతో, అత్యంత సబ్జెక్టివ్‌గా ఉండాలి. అభివృద్ధి అవసరం, బలహీనంగా ఉన్న అంశాలను మాత్రమే అధ్యయనం చేయాలి.
మునుపటి సంవత్సరం ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి (Practice previous year questions)
పరీక్ష తయారీలో ముఖ్యమైన భాగం TS EAMCET previous year question papersతో ప్రాక్టీస్ చేయడం. ప్రతి సబ్జెక్టు నుంచి వెయిటేజీ టాపిక్‌లను తెలుసుకోవడానికి మీకు వీలైనన్ని మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాల నమూనాలను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఇది మీ బలహీనత ప్రాంతాలను కనుగొనడానికి, మెరుగుదల కోసం ఆ అంశాలపై మరింత దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది.