TS EAMCET 2024 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TS EAMCET నమూనా పేపర్‌లను చెక్ చేయాలి. ఔత్సాహికులు తమ సౌలభ్యం మేరకు ఈ పేజీలోని డైరెక్ట్ లింక్‌లను ఉపయోగించడం ద్వారా TS EAMCET నమూనా పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. JNTU హైదరాబాద్ తన అధికారిక వెబ్‌సైట్‌లో TS EAMCET 2024 మాక్ టెస్ట్‌ను కూడా ప్రచురిస్తుంది. TS EAMCET 2024 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు TS EAMCET నమూనా పేపర్‌లను ఉపయోగించడం ద్వారా వారి ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవచ్చు.
TS EAMCET శాంపిల్ పేపర్ ఒరిజినల్ TS EAMCET పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటుంది. పరీక్షలో అడిగే ప్రశ్నల రకాలు, స్థాయిల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అభ్యర్థులు TS EAMCET మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ఇక్కడ పొందవచ్చు. వాటిని ప్రాక్టీస్ పేపర్‌లుగా పరిష్కరించవచ్చు. TS EAMCET నమూనా పత్రాలు దరఖాస్తుదారులకు పరీక్ష పూర్తి అవగాహనను అందిస్తాయి. TS EAMCET 2024 పరీక్ష అనేది పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
Start Free Mock Test Now
Get real time exam experience with full length mock test and get detailed analysis.
TS EAMCET మోడల్ ప్రశ్నపత్రాలను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు స్పష్టత కోసం వాటిని పరిశీలించండి.
మోల్ ప్రశ్నాపత్రాల ద్వారా TS EAMCET కచ్చితమైన పరీక్షా విధానం గురించి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు మోడల్ ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచించారు.
TS EAMCET 2024లో హాజరు కావడానికి ఇష్టపడే అభ్యర్థుల ఆత్మ విశ్వాసాన్ని పెరగడానికి మోడల్ పేపర్లు సహాయపడతాయి.
మోడల్ ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల సమయ నిర్వహణ, అభ్యర్థి వేగం, సామర్థ్యం పెరుగుతుంది.
మోడల్ ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేసిన తర్వాత అభ్యర్థులు వారి పనితీరు గురించి తెలుసుకోగలరు. సిలబస్‌లో ఏ టాపిక్కుల్లో బలహీనంగా ఉన్నారు, ఏ టాపిక్‌పై పట్టు ఉందో తెలుస్తుంది. దానికనుగుణంగా స్టడీ ప్లాన్ చేసుకోగలరు.
TS EAMCET మాక్ టెస్ట్ 2024
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) వారి అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inలో TS EAMCET 2024 మాక్ టెస్ట్‌లను విడుదల చేస్తుంది. అభ్యర్థులు “మాక్ టెస్ట్” లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా మాక్ టెస్ట్‌ను నిర్వహించవచ్చు. తెలంగాణ ఎంసెట్ మాక్‌టెస్ట్‌లు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్ విడివిడిగా విడుదల చేయబడుతుంది. మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడం అభ్యర్థులు ప్రిపరేషన్‌కు మరింత ఉపయోగపడుతుంది. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు సిలబస్‌లో పట్టు లేని అంశాల గురించి తెలియయడమే కాక.. వారి ప్రిపరేషన్‌ను మెరుగుపరచడానికి కసరత్తు చేయవచ్చు.
JNTUH అందించిన మాక్ టెస్ట్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులకు డిఫాల్ట్ లాగ్ ఇన్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి లాగిన్ ఆధారాలు అవసరం లేదని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు TS EAMCET 2024 ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యే ముందు మాక్ టెస్ట్‌లను కచ్చితంగా ప్రయత్నించాలని నిపుణులు సూచించారు. మాక్‌టెస్ట్‌లను ట్రై చేయడం ద్వారా అభ్యర్థులకు తమ లోటుపాట్లు సరిగ్గా అర్థం అవుతాయి. సిలబస్‌లో ఏ అంశంలో బలహీనంగా ఉన్నారో, ఈ అంశంపై పూర్తి పట్టు సాధించారో క్షుణ్ణంగా తెలుస్తుంది. దాంతో అభ్యర్థులు తాము బలహీనంగా ఉన్న టాపిక్కులపై మరింత దృష్టి సారించవచ్చు. సిలబస్‌లో ఆ అంశాలపై మళ్లీ శ్రద్ధ పెట్టి సాధన చేయడం వల్ల పరీక్షలో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.