TS SSC 2024 సప్లిమెంటరీ టైం టేబుల్ విడుదల అయ్యింది ( TS SSC Supplementary Time Table 2024): పరీక్ష తేదీలు, ముఖ్యమైన సమాచారం

Andaluri Veni

Updated On: April 30, 2024 11:25 AM

పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్షలకు (TS SSC Supplementary Exam 2024) హాజరుకావచ్చు.TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2024 జూన్ 2024 లో నిర్వహించబడుతుంది. 
TS SSC Supplementary Exam 2023
examUpdate

Never Miss an Exam Update

తెలంగాణ SSC సప్లిమెంటరీ  ఎగ్జామ్ 2024 (TS SSC Supplementary Exam 2024): తెలంగాణ SSC ఫైనల్ పరీక్షల్లో ఒకటి లేదా రెండు పేపర్లలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం తెలంగాణ పదో తరగతి లేదా TS SSC సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. TS SSC సప్లిమెంటరీ పరీక్షలు 03 జూన్ నుండి 13 జూన్ 2024 తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ 16 మే తేదీ నుండి ప్రారంభం అవుతుంది. తెలంగాణ 10వ కంపార్ట్‌మెంట్ పరీక్షలకు (TS SSC Supplementary Exam 2024)హాజరవడం ద్వారా ఫెయిల్ అయిన విద్యార్థులు తమ ఫలితాలను మెరుగుపరుచుకుని ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. తెలంగాణ బోర్డ్ అధికారులు బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వారి అంచనాలకు తగ్గట్లుగా TS SSC సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావడానికి, వారి స్కోర్‌ను మెరుగుపరచడానికి అనుమతి ఇస్తారు. ఈ ఆర్టికల్లో మేము తెలంగాణ 10వ కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024 గురించి పూర్తి సమాచారం అందజేస్తాం.

తెలంగాణ SSC సప్లిమెంటరీ ఫలితాలు 2024 డైరెక్ట్ లింక్ (Telangana SSC Supplementary Results 2024 Direct Link )

TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2024 జూన్ 2024లో నిర్వహించబడుతుంది. ఈ ఆర్టికల్ లో అందించిన డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ SSC సప్లిమెంటరీ ఫలితాలు 2024 డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి (యాక్టివేట్ చేయబడుతుంది)


TS SSC సప్లిమెంటరీ పరీక్షలు 2024 (TS SSC Supplementary Exam 2024) బోర్డు పరీక్ష ఫలితాల ప్రకటన తర్వాత  తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది. TS SSC సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ 2024 ఫైనల్ పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. అనంతరం తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష టైం టేబుల్ విడుదల అవ్వనున్నట్టు చెప్పవచ్చు. తెలంగాణ సప్లిమెంటరీ  2024 పరీక్షలు కూడా జూన్‌లోనే నిర్వహించబడతాయి. TS SSC సప్లిమెంటరీ పరీక్షల 2024కి సంబంధించి తేదీలు, అప్లికేషన్ ఫార్మ్, హాల్ టికెట్, ఫలితాలు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్ష 2024 - ముఖ్యాంశాలు (TS SSC Supplementary Exam 2024 - Highlights)

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, వారి మార్కులు మెరుగుపరచాలనుకునే విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ దిగువ టేబుల్లో మేము ముఖ్యమైన అంశాలను హైలైట్ చేశాం. తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.

విశేషాలు

డీటెయిల్స్

కండక్టింగ్ అథారిటీ

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ

పరీక్ష పేరు

తెలంగాణ 10వ తరగతి 2024 సప్లిమెంటరీ పరీక్షలు

పరీక్షా విధానం

ఆఫ్‌లైన్

ఫలితం యొక్క విధానం

ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్

bse.telangana.gov.in

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్ష 2024: ముఖ్యమైన తేదీలు (TS SSC Supplementary Exam 2024: Important Dates)

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్షా తేదీలు బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలైన వెంటనే విడుదల చేయబడతాయి. అనంతరం విడుదలయ్యే సర్క్యులర్‌లో తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ 2024 పరీక్షలు,  రిజిస్ట్రేషన్ తేదీ, పరీక్షా తేదీలను వెల్లడించడం జరుగుతుంది.తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల 2024 కోసం ముఖ్యమైన తేదీలని తెలుసుకోవడానికి ఈ దిగువ అందించిన టేబుల్‌ని పరిశీలించండి.

ఈవెంట్స్

తేదీలు

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ

16 మే 2024

తెలంగాణ 10వ  తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీ

03 జూన్ నుండి 13 జూన్  2024 వరకు

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు

జూలై 2024

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్ష 2024: డేట్ షీట్ (TS SSC Supplementary Exam 2024: Date Sheet)

తెలంగాణ పదో తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు జూన్ 2024లో జరిగే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ 2024లో హాజరు కాగలరు. రెండు కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ అవకాశం  ఉండదు. ఆ విద్యార్థులు మళ్లీ పదో తరగతిని చదవాల్సి ఉంటుంది. తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల కోసం డేట్ షీట్ ఈ దిగువన టేబుల్లో ఇవ్వడం జరిగింది.

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్షా తేదీలు

విషయం

జూన్ 2024

  • ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్ A)
  • ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు )
  • ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కంపోజిట్ కోర్సు )

జూన్ 2024

ద్వితీయ భాష (సెకండ్ లాంగ్వేజ్)

జూన్ 2024

మూడో భాష ఇంగ్లీష్

జూన్ 2024

మ్యాథ్స్

జూన్ 2024

సైన్స్ (భౌతిక, జీవ శాస్త్రం)

జూన్ 2024

సోషల్ స్టడీస్

జూన్ 2024

  • OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్)
  • SSC ఒకేషనల్ కోర్సు (సిద్ధాంతం)

జూన్ 2024

OSSC ప్రధాన భాష పేపర్-II (సంస్కృతం, అరబిక్)

తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024: దరఖాస్తు ప్రక్రియ (Telangana 10th Compartment Exams 2024: Application Process)

తెలంగాణ  2024 SSC ఫలితాల ప్రకటన తర్వాత తెలంగాణ బోర్డు TS SSC సప్లిమెంటరీ పరీక్షల 2024 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఆ షెడ్యూల్‌లో పదో తరగతి కంపార్ట్‌మెంట్  పరీక్షల దరఖాస్తు ప్రక్రియ, అర్హత, హాల్ టికెట్ పరీక్ష తేదీలు అన్ని ముఖ్యమైన డీటెయిల్స్ ఉంటాయి.  తెలంగా SSC సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులందరూ తప్పనిసరిగా  ఈ పరీక్షల వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ఫార్మ్ జూన్ 2024 మొదటి వారంలో విడుదల అవుతుంది. విద్యార్థులు అప్లికేషన్ ఫార్మ్ ని పూరించడానికి బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. విద్యార్థి దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌ల వివరాలతో పాటు, వ్యక్తిగత వివరాలు అప్లికేషన్ ఫార్మ్‌లో నమోదు చేసుకోవాలి. తెలంగాణ పదో తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్‌ని ఫిల్ చేయడానికి ఈ దిగువున ఇచ్చిన సూచనలు పాటించాలి.

  • స్టెప్ 1: bse.telangana.gov.in లో తెలంగాణ బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి
  • స్టెప్ 2: హోమ్‌పేజీలో ఉన్న “Quick Links” సెక్షన్ లో విద్యార్థులు తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల 2024 నమోదు కోసం డైరెక్ట్ లింక్‌ని గుర్తించాలి
  • స్టెప్ 3: ఆ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్‌ ఫార్మ్‌ని పూరించడానికి నిర్దిష్ట సూచనలను చూసే కొత్త విండోకు మళ్లించబడతారు.
  • స్టెప్ 4: తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలకు దరఖాస్తు ఫార్మ్  2024ని పూరించడానికి ముందు సూచనలను చదివి, నేను అంగీకరిస్తున్నాను అనే దానిపై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 5: అడిగిన ఆధారాల ప్రకారం మొత్తం డీటెయిల్స్ నోట్ చేసి అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి.
  • స్టెప్ 6: సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
  • స్టెప్ 7: ఫీజు చెల్లించిన తర్వాత రసీదు స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్ష 2024 డేట్ షీట్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download the TS SSC Supplementary Exam 2024 Date Sheet?)

సాధారణ పరీక్షల కోసం డేట్ షీట్ మాదిరిగానే విద్యార్థులు తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష డేట్ షీట్ 2024ని బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ నుంచి PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. తెలంగాణ SSC సప్లిమెంటరీ డేట్ షీట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.

  • స్టెప్ 1: bse.telangana.gov.inలో తెలంగాణ బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
  • స్టెప్ 2: హోమ్ పేజీ ఎడమ వైపున “Quick Links" సెక్షన్ ఉంటుంది.
  • స్టెప్ 3:విద్యార్థులు తెలంగాణ బోర్డ్ SSC సప్లిమెంటరీ పరీక్ష డేట్ షీట్‌ని టాప్‌లో “Quick Links"  సెక్షన్‌లో చూడగలరు.
  • స్టెప్ 4: ఆ లింక్‌పై క్లిక్ చేయాలి. కొత్త విండోకి రీడైర్ట్ అవుతుంది. అక్కడ TS SSC కంపార్ట్‌మెంట్ పరీక్ష డేట్ షీట్ pdf ఆకృతిలో కనిపిస్తుంది.
  • స్టెప్ 5: అక్కడ డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల డేట్ షీట్‌ని సేవ్ చేసుకోవచ్చు.

తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్ష షెడ్యూల్/ టైమింగ్ (Telangana Class 10 Supplementary Exam Schedule/ Timing)

తెలంగాణ 2024 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 9 గంటలకల్లా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.  విద్యార్థులు తెలంగాణ SSC కంపార్ట్‌మెంట్ పరీక్ష హాల్ టికెట్‌ని తమతోపాటు పరీక్షా హాల్‌కి తీసుకెళ్లాలి. హాల్ టికెట్ లేకుండా  పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024 - ముఖ్యమైన పాయింట్‌లు (Telangana 10th Supplementary Exams 2024 - Important Points)

TS SSC సప్లిమెంటరీ పరీక్షలు 2024 కి సంబంధించి గుర్తుంచుకోవలసిన సాధారణ అంశాలు ఈ దిగువున తెలియజేశాం.
  • బోర్డు పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడానికి TS SSC సప్లిమెంటరీ పరీక్ష చివరి అవకాశం. అటువంటి విద్యార్థి కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరు కావడంలో విఫలమైతే వాళ్లు ఆ సంవత్సరం మళ్లీ పదో తరగతిని చదవాల్సి ఉంటుంది.
  • ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో మాత్రమే ఫెయిల్ అయిన విద్యార్థులు TS 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించబడతారు.
  • రెండు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఏడాదిని పునరావృతం చేయాల్సి ఉంటుంది.
  • తక్కువ మార్కులతో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారు తమ స్కోర్‌లను మెరుగుపరుచుకోగలరని భావించి, TS SSC సప్లిమెంటరీ పరీక్షలు 2024లో పాల్గొనవచ్చు. మెరుగైన స్కోర్ చేయడం ద్వారా వారి మార్కుల శాతాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
  • తెలంగాణ SSC కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరకావడానికి అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్ష 2024 హాల్ టికెట్ (TS SSC Supplementary Exam 2024 Admit Card)

తెలంగాణ SSC సప్లిమెంటరీ పరీక్ష ఫార్మ్‌ని విజయవంతంగా పూరించిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. కంపార్ట్‌మెంట్ పరీక్షల కోసం TS SSC హాల్ టికెట్ జూన్ 2024 రెండో వారంలో తాత్కాలికంగా విడుదల చేయబడుతుంది. తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ హాల్ టికెట్ 2024 బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. అవసరమైన ఆధారాలను అందించడం ద్వారా పాఠశాల అధికారులు pdf ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాల అధికారులు వారి అధికారిక చిహ్నాన్ని ముద్రించిన తర్వాత సంబంధిత విద్యార్థులకు హాల్ టికెట్‌ని అందజేస్తారు. విద్యార్థులు హాల్ టికెట్‌ని పరీక్షా హాల్‌కు తీసుకెళ్లాల్సిన తప్పనిసరి పత్రం కనుక పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు హాల్ టికెట్‌ని భద్రపరుచుకోవాలి. TS SSC సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్ లేని విద్యార్థులు పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు. ఈ దిగువ ఇవ్వబడిన సెక్షన్‌లో తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల హాల్‌టికెట్‌ని డౌన్‌లోడ్ చేసే విధానాన్ని తెలియజేశాం.

  • స్టెప్ 1: bse.telangana.gov.in లో తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • స్టెప్ 2: TS SSC కంపార్ట్‌మెంట్ పరీక్ష హాల్ టికెట్ 2024 లింక్ హోమ్ పేజీలోనే అందించబడుతుంది.
  • స్టెప్ 3: అభ్యర్థులు ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 4: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో స్కూల్ కోడ్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ టైప్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 5:  స్క్రీన్‌పై నిర్దిష్ట విద్యార్థి యొక్క హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. అనంతరం తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ TS SSC కంపార్ట్‌మెంట్ పరీక్ష ఫలితాలను జూలై 2024లో దాని అధికారిక వెబ్‌సైట్ @ bse.telangana.gov.inలో విడుదల చేస్తుంది. కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మాత్రమే తెలంగాణ 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల 2024 ఫలితాలను చెక్ చేసుకోగలుగుతారు.

/ts-ssc-supplementary-exam-time-table-brd

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top