- TS SSC Previous Year Question Paper ముఖ్యంశాలు 2024 (TS SSC …
- Telangana SSC Previous Year Question Papers 2024 డౌన్లోడ్ చేయడం ఎలా? …
- తెలంగాణ SSC గత సంవత్సర ప్రశ్న పత్రం 2023 (TS SSC Previous …
- TS SSC మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం - PDFలను డౌన్‌లోడ్ చేయండి
- TS SSC Previous Year Question Paper 2019
- Telangana SSC పరీక్ష విధానం 2024 (Telangana SSC Exam Pattern 2024)
- Telangana SSC Previous Question Papers ప్రాక్టీస్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు …
- TS SSC ప్రిపరేషన్ చిట్కాలు 2024 (TS SSC Preparation Tips 2024)
Never Miss an Exam Update
Telangana SSC Previous Year Question Papers 2024
: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 10 వ తరగతి మరియు ఇంటర్మీడియెట్ పరీక్షల యొక్క నిర్వహణ మొత్తం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (BSE TS)చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వ విధానాలను అనుసరించి పరీక్ష విధానాలు, పరీక్షల సిలబస్, పరీక్షల నిర్వహణ లాంటి వ్యవహారాలు అన్ని ఈ బోర్డు నిర్వహిస్తూ ఉంటుంది. వాటితో పాటు విద్యార్థులకు అవసరమైన సిలబస్, పరీక్ష తేదీలు మొదలైన సమాచారాన్ని వారి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ (TS BSE) గత సంవత్సర ప్రశ్న పత్రాలను ( TS SSC Previous Question Papers 2024) ను కూడా వారి అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in లో పొందుపరిచింది. 10 వ తరగతి బోర్డు పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఈ ప్రశ్న పత్రాలు చాలా ఉపయోగ పడతాయి. ఈ ప్రశ్న పత్రాలను అవగాహన చేసుకోవడం వలన విద్యార్థులకు బోర్డు పరీక్షలు వ్రాయడం సులభంగా ఉంటుంది, ప్రశ్నలకు తగ్గట్టు జవాబులు వ్రాసే సమయం కూడా అలవాటు అవుతుంది. విద్యార్థులు బోర్డు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలను(TS SSC Previous Question Papers 2024) అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం , విద్యార్థులు వాటిని PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.
ముఖ్యమైన ఆర్టికల్స్
TS SSC Previous Year Question Paper ముఖ్యంశాలు 2024 (TS SSC Previous Year Question Paper Highlights 2024)
క్రింద ఇవ్వబడిన తెలంగాణ 10వ తరగతి గత సంవత్సరం ప్రశ్న పత్రాల (TS SSC Previous Question Papers 2024)ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి:
బోర్డు పేరు | బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ |
---|---|
మీడియం | ఇంగ్లీష్ మరియు తెలుగు |
అధికారిక సైట్ | bse.telangana.gov.in |
Telangana SSC Previous Year Question Papers 2024 డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download Telangana SSC Previous Year Question Papers 2024?)
Telangana SSC Previous Year Question Papers 2024 డౌన్‌లోడ్ చేయడానికి సులభమైన స్టెప్స్ క్రింద వివరించబడ్డాయి.
- తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- వెబ్‌సైట్ మెను నుండి మోడల్ ప్రశ్నాపత్రం ఎంపికను ఎంచుకోండి.
- తర్వాత మీకు, సబ్జెక్టులు జాబితా కనిపిస్తుంది.
- మీకు కావాల్సిన సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేయడానికి సంబందించిన లింక్‌పై క్లిక్ చేయండి.
తెలంగాణ SSC గత సంవత్సర ప్రశ్న పత్రం 2023 (TS SSC Previous Year Question Paper 2023)
తెలంగాణ 10వ తరగతి విద్యార్థుల కోసం 2023 సంవత్సరం యొక్క ప్రశ్న పత్రాలు క్రింది పట్టికలో వివరించబడ్డాయి.సబ్జెక్టు పేరు | పేపర్ నం. | డౌన్లోడ్ లింక్ |
---|---|---|
తెలుగు | పేపర్-2 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
తెలుగు | పేపర్-1 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
హిందీ | పేపర్-2 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
ఇంగ్లీష్ | పేపర్-1 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
హిందీ | పేపర్-1 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
గణితం | పేపర్-1 | |
ఉర్దూ | పేపర్-1 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
ఉర్దూ | పేపర్-2 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
సోషల్ స్టడీస్ | పేపర్-1 | Download PDF (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS SSC మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం - PDFలను డౌన్‌లోడ్ చేయండి
2021 సంవత్సరానికి సంబంధించి TS SSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ క్రింది పట్టిక నుండి డైరెక్ట్ లింక్‌ని చూడవచ్చు:
విషయం పేరు | పేపర్ నం. | డౌన్లోడ్ లింక్ |
---|---|---|
తెలుగు | పేపర్-2 | |
తెలుగు | పేపర్-1 | |
హిందీ | పేపర్-2 | |
ఆంగ్ల | పేపర్-1 | |
హిందీ | పేపర్-1 | |
గణితం | పేపర్-1 | |
ఉర్దూ | పేపర్-1 | |
ఉర్దూ | పేపర్-2 |
TS SSC మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం PDFలు
2020 సంవత్సరానికి TS SSC మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేయడానికి ప్రత్యక్ష లింక్‌లు విద్యార్థుల సహాయం కోసం దిగువ ఇవ్వబడిన పట్టికలో అందించబడ్డాయి:
విషయ పేర్లు | పేపర్ నం. | డౌన్లోడ్ లింక్ |
---|---|---|
తెలుగు | పేపర్-1 | |
తెలుగు | పేపర్-2 | |
హిందీ (రెండవ భాష) | -- | |
ఆంగ్ల | పేపర్-2 | |
గణితం | పేపర్-1 | |
గణితం | పేపర్-2 | |
జనరల్ సైన్స్ | పేపర్-2 | |
సామాజిక అధ్యయనాలు | పేపర్-1 | |
సామాజిక అధ్యయనాలు | పేపర్-2 |
TS SSC Previous Year Question Paper 2019
తెలంగాణ 10వ తరగతి విద్యార్థుల కోసం 2019 సంవత్సరం యొక్క ప్రశ్న పత్రాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.సబ్జెక్టుల పేరు | పేపర్ నం | డౌన్లోడ్ లింక్ |
---|---|---|
హిందీ | పేపర్-1 | |
హిందీ | పేపర్-2 | |
ఇంగ్లీష్ | పేపర్-1 | |
ఇంగ్లీష్ | పేపర్-2 | |
గణితం | పేపర్-1 | |
గణితం | పేపర్-2 | |
జనరల్ సైన్స్ | పేపర్-1 | |
జనరల్ సైన్స్ | పేపర్-2 | |
సోషల్ స్టడీస్ | పేపర్-1 | |
సోషల్ స్టడీస్ | పేపర్-2 |
Telangana SSC పరీక్ష విధానం 2024 (Telangana SSC Exam Pattern 2024)
- తెలంగాణ 10వ తరగతి కొత్త పరీక్ష విధానంలో 6 సబ్జెక్టులకు 6 పరీక్షలు మాత్రమే ఉంటాయి.
- ఒక పేపర్ మొదటి భాష (పేపర్లు 1 మరియు 2), ఇంగ్లీష్, గణితం, సాధారణ శాస్త్రం (భౌతికశాస్త్రం మరియు జీవశాస్త్రం) మరియు సోషల్ స్టడీస్ మిళితం చేస్తుంది. ఇంతకుముందు రెండు పేపర్లకు బదులు ఇప్పుడు ఒక్కో పేపర్ మాత్రమే ఉంది.
- తెలంగాణ 10వ తరగతి పరీక్షలో 80 మార్కులకు వివరణాత్మక ప్రశ్నలు మరియు 20 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
- కొత్త పరీక్ష విధానంకు అనుగుణంగా పరీక్ష సమయం 30 నిమిషాలు పొడిగించబడింది, పరీక్ష సమయం 3 గంటల 15 నిమిషాలు.
- పరీక్ష చివరి 30 నిమిషాల్లో ఆబ్జెక్టివ్ పేపర్‌కు సమాధానం రాయాలి.
Telangana Class 10 ప్రశ్న పత్రాల మార్కింగ్ విధానం 2024 (Marking scheme of Telangana SSC Question Papers 2024)
తెలంగాణ SSC పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల యొక్క రెండు గ్రూపులను లాంగ్వేజ్ మరియు నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టులు కలిగి ఉంటాయి.
- లాంగ్వేజ్ పేపర్లలో హిందీ, తెలుగు, ఉర్దూ మరియు ఇంగ్లీష్ ఉన్నాయి.
- గణితం, సైన్స్ మరియు సామాజిక శాస్త్రం భాషేతర అంశాలకు ఉదాహరణలు.
- ప్రతి పేపర్‌కు మార్కుల వివరణ కోసం క్రింది పట్టికను చూడండి.
విషయం | మొత్తం మార్కులు | థియరీ పరీక్ష మార్కులు | ఇంటర్నల్ అసెస్మెంట్ |
---|---|---|---|
ప్రథమ భాష (హిందీ/ఉర్దూ/తెలుగు) | 100 | 80 | 20 |
రెండవ భాష (హిందీ/తెలుగు) | 100 | 80 | 20 |
మూడవ భాష (ఇంగ్లీష్) | 100 | 80 | 20 |
గణితం (పేపర్ 1) | 100 | 80 | 20 |
జీవ శాస్త్రం | 50 | 40 | 10 |
ఫిజికల్ సైన్స్ | 50 | 40 | 10 |
సోషల్ స్టడీస్ | 100 | 80 | 20 |
Telangana SSC Previous Question Papers ప్రాక్టీస్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు (What are the benefits of Telangana SSC Question Papers 2024?)
- విద్యార్థులు మొత్తం సిలబస్ ను పూర్తి చేసిన తర్వాత , తెలంగాణ 10వ తరగతి ప్రశ్న పత్రాలు 2024 ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టవచ్చు.
- విద్యార్థులు గత సంవత్సరం పేపర్ల నుండి ప్రశ్నల విధానాన్ని గుర్తించవచ్చు వాటికి అనుగుణంగా సమాధానాలను సిద్ధం చేసుకోవచ్చు.
- పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలకు ముందే విద్యార్థులు మొత్తం పాఠ్యాంశాలను పూర్తి చేస్తే 2024 బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.
- గత సంవత్సర ప్రశ్న పత్రాలను ప్రిపేర్ అవడం వలన విద్యార్థులకు ప్రశ్న పత్రం లో ఇచ్చే ప్రశ్నల గురించిన అవగాహన కలుగుతుంది.
- విద్యార్థులు తమ సిలబస్ పూర్తి చేసిన తర్వాత గత సంవత్సర ప్రశ్న పత్రాలకు జవాబులు వ్రాయడం వారికి రివిజన్ చేసినట్టుగా కూడా ఉంటుంది.
TS SSC ప్రిపరేషన్ చిట్కాలు 2024 (TS SSC Preparation Tips 2024)
తెలంగాణ 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాసి మంచి మార్కులు సాదించాలి అంటే విద్యార్థులకు క్రింద వివరించబడిన టిప్స్ ఫాలో అవ్వడం ముఖ్యం.
- విద్యార్థులు అందరూ ఒకేలాగా చదవలేరు ఈ విషయాన్నీ అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే విద్యార్థులు వారికి తగ్గట్టుగా వ్యక్తిగత టైం టేబుల్ రూపొందించుకోవడం చాలా అవసరం.
- గత సంవత్సర ప్రశ్న పత్రాలకు జవాబులు వ్రాస్తూ మీరు ఏ సబ్జెక్టులో ఎక్కువ శ్రద్ద పెట్టాలో తెలుసుకోండి. ఎక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయో తెలుసుకుని ఆ మార్కుల కోసం సమాధానాలు ఎలా వ్రాయాలో తెలుసుకోండి, ఈ విషయంలో మీ టీచర్ల సహాయం కూడా తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతీ విషయాన్నీ బట్టీ పట్టే విధానంలో కాకుండా క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటూ చదువుకోవాలి.
- విద్యార్థులు ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి, చదువుకునే గదిలో తగినంత గాలి మరియు వెలుతురు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి.
- విద్యార్థులు చదవడం ఎంత ముఖ్యమో వారికి కావాల్సిన విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం, ఒక రోజు నిద్ర లేకుండా చదివి తర్వాత రోజు అధికంగా పడుకోవడం కంటే ప్రతీ రోజూ ఒక నిర్దిష్ట సమయం పాటించడం అలవాటు చేసుకోవడం అవసరం.
సంబంధిత కధనాలు
మరిన్ని ఎడ్యుకేషనల్ ఆర్టికల్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.